అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, 'ప్రపంచం మొత్తం స్తూలకాయం సమస్యతో బాధపడుతోంది. దీంతోపాటు ప్రస్తుతం కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆధునిక ఆహార విధానాలపై విమర్శ ఉంది. ముఖ్యంగా, ప్రాసెస్ చేయబడిన, వేగంగా జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్లు. ఈ ఆహారాలు హార్మోన్ల ప్రతిస్పందనలకు కారణమవుతాయి, ఇవి ప్రాథమికంగా మన జీవక్రియను మారుస్తాయి, కొవ్వు నిల్వను పెంచడం, బరువు పెరగడం, ఊబకాయం లాంటివాటికి కారణమవుతాయి.