Onions: పచ్చి ఉల్లిపాయను తింటే ఒంట్లో వేడి తగ్గడమే కాదు.. మరెన్నో బెనిఫిట్స్ ఉన్నాయి..

Published : Mar 29, 2022, 01:14 PM IST

Onions:ఈ వేసవి కాలం రోజుకు ఒక పచ్చిఉల్లిపాయను తినడం వల్ల ఒంట్లో వేడి ఇట్టే తగ్గిపోతుంది. అలాగే జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది.  ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది.   

PREV
18
Onions: పచ్చి ఉల్లిపాయను తింటే ఒంట్లో వేడి తగ్గడమే కాదు.. మరెన్నో బెనిఫిట్స్ ఉన్నాయి..

Onions: భారతీయ కూరగాయల్లో ఉల్లిపాయ స్థానం ప్రత్యేకమైంది. ఇది  లేని కూర ఉండదంటే నమ్మండి. ఉల్లిపాయతో కూరలు రుచికరంగా అవడమే కాదు.. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కూడా. అయితే ఈ ఎండాకాలంలో ఉల్లిపాయను పచ్చిగా తినడం వల్ల మరెన్నో లాభాలున్నాయి. 
 

28

ఉల్లిపాయల్లో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ అలర్జిక్, యాంటీ కార్సినోజెనిక్ , విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్  బి6 వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. 

38

ఈ ఎండాకాలం రోజుకు ఒక పచ్చి ఉల్లిపాయను తింటే శరీర ఉష్ణోగ్రత పెరిగే అవకాశమే ఉండదు. అంతేకాదు వేడి కూడా ఇట్టే తగ్గిపోతుంది.  ఎన్నో ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షణ కూడా పొందొచ్చు. ఉల్లిపాయతో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో.. తెలుసుకుందాం పదండి. 
 

48

బాడీ చల్లగా ఉంటుంది.. ఈ ఎండకాలం ఉల్లిపాయలను తినడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది. ఎందుకంటే బాడీని కూల్ చేసే లక్షణాలు ఉల్లిపాయలో పుష్కలంగా ఉంటాయి. ఇవే మనల్ని వేడి నుంచి కాపాడుతాయి. శరీరాన్ని చల్లగా ఉంచడానికి సహకరిస్తాయి. 

58

వేడిని తగ్గిస్తుంది.. ఎండల తీవ్రతకు హీట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమస్య  బారిన పడకూడదంటే.. మీ రోజు వారి ఆహారంలో పచ్చి  ఉల్లిపాయను పక్కాగా చేర్చుకోవాల్సిందే. ఒంట్లో వేడి ఎక్కువైనప్పుడు పచ్చి ఉల్లిపాయను తినండి.. వేడి ఇట్టే తగ్గిపోతుంది. 

68

జీర్ణక్రియ సమస్యలకు చెక్.. జీర్ణక్రియ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి పచ్చి ఉల్లిపాయ చక్కటి మెడిసిన్ లా ఉపయోగపడుతుంది. పచ్చి ఉల్లిపాయను అలాగే తిన్నా.. లేదా సలాడ్ గా చేసుకుని తాగినా.. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. అంతేకాదు ఈ ఉల్లిపాయ పొట్టను ఆరోగ్యంగా ఉంచుతుంది. 

78

ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.. ఉల్లిపాయల్లో సెలీనియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి ఎంతో సహాయపడుతుంది.  రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటే ఎన్నోరోగాలు చుట్టుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అందుకే తరచుగా పచ్చి ఉల్లిపాయను తింటూ రోగ నిరోధక శక్తిని పెంచుకోండి. 
 

88

డయాబెటీస్ పేషెంట్లకు..  డయాబెటీస్ పేషెంట్లకు  తెల్ల ఉల్లిపాయ చక్కటి మేలు చేస్తుంది.  ఈ ఉల్లిపాయలో ఉండే యాంటీ డయాబెటిక్, క్వెర్సిటిన వంటివి మధుమేహుల రక్తంలోని షుగర్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచుతాయి.  

click me!

Recommended Stories