దళపతి విజయ్ అలవాట్లు చూస్తే షాకే.. అందుకే ఈ హీరో అంత ఫిట్ గా ఉన్నారేమో..!

First Published | Feb 7, 2024, 1:33 PM IST

విజయ్ దళపతి వయసు ఎంతంటే ఏం చెప్తారు.. హా ఏముంది.. ఏ ముప్పయో.. ముప్పై ఐదో ఉండొచ్చు అనుకుంటారు చాలా మంది. ఎందుకంటే ఈ హీరో లుక్ అలా ఉంటుంది మరి. కానీ ఈ హీరో మరికొన్ని నెలల్లో 50 ఏండ్ల వయసులోకి అడుగుపెట్టబోతున్నాడు. ఆశ్చర్యంగా ఉంది కదూ.. చూస్తే అంత యంగ్ గా ఉన్నారు.. వయసేంటి ఇంత అని షాక్ అవ్వొచ్చు. కానీ ఈ హీరో అలవాట్లే అంత యంగ్ గా, ఫిట్ గా ఉండేలా చేశాయి మరి.. అవేంటో ఓ లుక్కేద్దం పదండి..  

విజయ్ దళపతి ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూత్ మాత్రమే కాదు.. చిన్న పిల్లలు, ముసలి వాళ్లు కూడా ఈ హీరో సినిమాలను ఎంతో ఇష్టంగా చూస్తారు. ఈ హీరో నటనకు ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. అందుకే ఈ స్టార్ హీరో తమిళ చిత్రసీమలో అగ్ర కథానాయకుడిగా వెలుగొందుతున్నారు. ఇక తెలుగులోనూ తిరుగులేకుండా హిట్లు అందుకుంటున్నారు. మీకు తెలుసా? విజయ్ దళపతి ఒక్క నటుడు గానే కాకుండా నేపథ్య గాయకుడు, నిర్మాతగా కూడా రాణిస్తున్నారు.
 

అయితే ఈ హీరో వయసు ఎంత ఉందనుకుంటున్నారు? ఇలా అడిగితే 30,35 మధ్య ఉంటుందని చెప్పేవారు చాలా మందే ఉంటారు. ఎందుకంటే ఈ స్టార్ హీరో లుక్ అలా ఉంటుంది మరి. కానీ ఈ హీరో వయసు 50 ఏండ్లకు చేరువలో ఉంది. అవును ఈ హీరో కొన్ని రోజుల్లోనే 50 ఏండ్లలోకి అడుగుపెట్టబోతున్నారు. అయినా.. కుర్ర హీరోలకు మించి యాక్టింగ్ ఇరగదీస్తారు. ఇందుకు ఈ తమిళ స్టార్ దగ్గర ఓ సీక్రేట్ ఉంది తెలుసా?  


విజయ్ దళపతి వయసు ఏ మాత్రం ఎక్కువగా అనిపించదు. కుర్ర హీరోల లాగే కనిపిస్తారు. ఫిట్ గా కూడా ఉంటారు. అయితే ఇందుకోసం విజయ్ దళపతి కొన్ని పనులు ఖచ్చితంగా చేస్తారు. అవే అతని ఫిట్ నెస్ సీక్రేట్ కూడా. అవేంటో మనమూ తెలుసుకుందాం పదండి. 

దళపతి విజయ్ డైట్ ప్లాన్ చాలా సింపుల్ గా ఉంటుంది. ఈ హీరో ఉదయం 5.30 గంటలకే నిద్రలేస్తారు. అలాగే నిద్రలేవగానే కనీసం అరగంట సేపైనా ఖచ్చితంగా వర్కౌట్ చేస్తారట. ఇక షూటింగ్  లకు అని వేరే ప్లేస్ కు వెళ్లినా వర్కౌట్ ను మాత్రం అస్సలు మిస్ చేయరట. 
 

ఇకపోతే ఈ హీరో ఉదయం 9 గంటలకే ఖచ్చితంగా బ్రేక్ ఫాస్ట్ ను చేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకు భోజనం చేస్తారు. రాత్రిపూట 7 గంటలకే డిన్నర్ చేస్తారట. మరీ ముఖ్యమైన విషయమేంటంటే.. ఈ స్టార్ హీరోకు రాత్రి 9 గంటల లోపే నిద్రపోయే అలవాటు ఉందట.
 

మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే.. షూటింగ్ సమయంలో దళపతి మాంసాహారం అసలే తినరట. బయటకు వెళ్లినప్పుడు మాత్రమే హోటల్ ఫుడ్ ను తింటారు. ఇతర సమయాల్లో ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రే తింటారట. 
 

మీకు తెలుసా? విజయ్ దళపతికి జిమ్ కు వెళ్లి వర్కవుట్స్ చేసే అలవాటు లేనేలేదట. ఈ హీరో క్రమం తప్పకుండా వాకింగ్ కు వెళతారు. అలాగే టీ, కాఫీలను తాగే అలవాటు అసలే లేదట. అందుకే దళపతి విజయ్ ఫిట్ గా ఉన్నారు. 
 

Latest Videos

click me!