ఏమో అనుకుంటాం కానీ.. స్కిన్ కేర్ అంత సులువైన పనైతే కాదని అందరికీ తెలుసు. చాలా మంది ముఖం అందంగా కనిపించాలని, మొటిమలు, నలుపు, మొటిమల మచ్చలు, తెల్లమచ్చలు పోవాలని ఏవేవో క్రీములను వాడుతుంటారు. ఇంకొందరు ఫేస్ ప్యాక్స్ ను వాడుతుంటారు. అన్నింటికంటే ముఖం సౌందర్యానికి నేచురల్ పద్దతులే బెస్ట్. ఎందుకంటే వీటిలో ఎలాంటి కెమికల్స్ ఉండవు. చర్మం దెబ్బతినే అవకాశమే ఉండదు. అందుకే ప్రస్తుతం చాలా మంది నేచురల్ పద్దతులనే ఫాలో అవుతున్నారు.