women calenderమనలో జ్యోతిష్య శాస్త్రాన్ని విశ్వసించే వారు చాలా మంది ఉంటారు. న్యూమరాలజీ కూడా ఇందులో ఓ భాగం. మన పేరు ఆధారంగా, మనం పుట్టిన తేదీ ఆధారంగా మనం ఎలాంటి వాళ్లం, మన ఆలోచనలు ఎలా ఉంటాయి.? జీవితంలో ఎదురయ్యే సమస్యల పట్ల ఎలా వ్యవహరిస్తాము లాంటి వివరాలను పుట్టిన తేదీ ఆధారంగా తెలుసుకోవచ్చని చెబుతుంటారు. సాధారణంగా మనం జన్మించిన నక్షత్రం ఆధారంగా జ్యోతిష్య నిపుణులు మన భవిష్యత్తును అంచనా వేస్తుంటారు. అయితే పుట్టిన తేదీ ఆధారంగా కూడా మన గురించి చెప్పొచ్చని అంటున్నారు. ఇంతకీ ఏ తేదీల్లో జన్మించిన వారి ఆలోచనలు ఎలా ఉంటాయి.? ఇప్పుడు తెలుసుకుందాం..
1వ తేదీ నుంచి 9వ తేదీ మధ్య జన్మించిన వారు అదృష్టవంతులని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ తేదీలు శుభకరమైనవని అంటున్నారు. ఇక 10 నుంచి 18వ తేదీల మధ్‌య జన్మించిన వారు బంధానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారని అంటున్నారు. అలాగే 19 నుంచి 27వ తేదీల్లో జన్మించిన వారు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వీరిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇక 28 నుంచి 31వ తేదీల్లో జన్మించిన వారు మంచి పేరు ప్రఖ్యాతలతో పాటు ధనవంతులుగా ఎదుగుతారని అంటున్నారు.
కొన్ని ముఖ్యమైన తేదీలు..
ఇక స్పెసిఫిక్‌గా చెప్పాలంటే.. 1, 10, 19, 28 తేదీల్లో జన్మించిన వారు ఎంతో సృజనాత్మక కలిగి ఉంటారు. కొత్తగా ఆలోచిస్తుంటారు, కెరీర్‌లో ఎదిగేందుకు వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. నలుగురితో కలిసిపోవడానికి ఇష్టపడతారు. అలాగే.. 2, 11, 20, 29 తేదీల్లో జన్మించిన వారిలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. భావ వ్యక్తీకరణలో ముందుంటారు. మనసులో ఏది ఉన్నా ఇట్టే చెప్పేస్తుంటారు. ఇక 3, 12, 21, 30 తేదీల్లో జన్మించిన వారు.. ప్రతీ విషయంలో స్పష్టమైన ఆలోచనలతో ఉంటారు. ఏ పని చేసినా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తుంటారు. సామాజిక సంబంధాలను కలిగి ఉంటారు.
ఇక 4, 13, 22 తేదీల్లో జన్మించిన వారు ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆర్థికంగా రాణించేందుకు కృషి చేస్తుంటారు. వీరు కష్టాన్ని నమ్ముకుని ఎదగడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అలాగే 5, 14, 23 తేదీల్లో పుట్టిన వారు మంచి ప్రతిభను కలిగి ఉంటారు. అవకాశాలను అందుకోవడంలో వీరి ప్రతిభ ఎంతో ఉపయోగపడుతుంది. 6, 15, 24 తేదీల్లో జన్మించిన వారు కుటుంబం, సంబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. వీరిలో దయా గుణం ఎక్కువగా ఉంటుంది. అలాగే 7, 16, 25 తేదీల్లో పుట్టిన వారిలో ఆధ్యాత్మిక భావాలు ఎక్కువగా ఉంటాయి. వీలైనంత వరకు ఇతరులకు హాని కలిగించకూడదని ఆలోచిస్తారు. ఇక 8, 17, 26 తేదీల్లో జన్మించిన వారిలో నిజాయితీ ఎక్కువగా ఉంటుంది. ఇక 9, 18, 27 తేదీల్లో జన్మించిన వారిలో ఆత్మ విశ్వాసం ఎక్కువగా ఉంటుంది. మార్పును త్వరగా స్వీకరిస్తారు.