రకరకాల పండ్లు, కూరగాయలు.. కాలెయం ఆరోగ్యంగా ఉండటానికి ముందుగా మనం చేయాల్సింది మంచి పోషకాహారం తీసుకోవడం. రకరకాల కూరగాయలు, పండ్లను తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటాము. ఇవి వివిధ పోషకాలను మన శరీరానికి అందిస్తాయి. వీలైనంత వరకు వివిధ రంగుల్లో ఉండే కూరగాయలను తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎక్కువ మొత్తంలో పోషకాలు లభిస్తాయి. కాలెయం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అయితే శుద్ధి చేసిన ఆహారాలు, జంక్ ఫుడ్, చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాలను తీసుకోవడం మానేయండి.