వక్షోజాల్లో దురదకు కారణాలివే...

First Published | Aug 3, 2021, 1:24 PM IST

దీనికి పరిష్కారం బ్రాలను క్రమం తప్పకుండా ఉతకడం. మీరు బ్రా వేసుకుని వర్కవుట్లు చేస్తున్నట్లైతే.. బ్రాలకు అంటుకున్న దుమ్ము, చెమటను తొలగించడానికి వీటిని గోరువెచ్చని నీటిలో ఉతకాల్సి ఉంటుంది.  

చాలామంది మహిళలు ఎదుర్కునే అతి సాధారణ సమస్య రొమ్ముల ప్రాంతంలో దురద పుట్టడం. ఈ సమస్య మీరు కూడా ఎదుర్కుంటున్నట్లైతే వెంటనే దీని మీద దృష్టి పెట్టడం అవసరం. గుడ్ న్యూస్ ఏంటంటే ఇది చాలా చిన్న సమస్య కావడం.. దీనికి కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకునేంటు సరిపోవడం. ఇక ఈ దురదకు కారణాలు రొమ్ముల మీద జుట్టు పెరగడం, వడదెబ్బ, ఏదైనా పురుగులు కుట్టడం, బ్రా టైట్ గా ఉండడం, డ్రై స్కిన్, ఏదైనా గాయాలు నయమవుతున్నప్పుడు లాంటి కారణాలతో మీ ఛాతీ దురదకు కారణాలు.
undefined
వక్షోజాల దురదకు గల అనేక కారణాల్లో ముఖ్యమైన ప్రధాన కారణాలు ఇక్కడున్నాయి. అందులో ఒకటి బ్రాను రెగ్యులర్ గా ఉతకకపోవడం.. బ్రాని రెగ్యులర్‌గా ఉతకకపోవడం వల్ల చర్మం మీద చికాకుకు దారితీస్తుంది. ఇక రొమ్ము మీద లేదా రొమ్ము చుట్టూ పక్కల ఏదైనా గాయం ఉంటే, ఉతకని బ్రాతో ఆ గాయం కలిసి ఇన్‌ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల ఆ ప్రాంతంలో బ్యాక్టీరియా ఏర్పడి దురదకు దారి తీస్తుంది.
undefined

Latest Videos


దీనికి పరిష్కారం బ్రాలను క్రమం తప్పకుండా ఉతకడం. మీరు బ్రా వేసుకుని వర్కవుట్లు చేస్తున్నట్లైతే.. బ్రాలకు అంటుకున్న దుమ్ము, చెమటను తొలగించడానికి వీటిని గోరువెచ్చని నీటిలో ఉతకాల్సి ఉంటుంది.
undefined
వడదెబ్బ వల్ల వేడి దద్దుర్లు : ఛాతీ ప్రాంతంలోని చర్మం సున్నితంగా ఉంటుంది. సూర్యకాంతికి ఎక్స్ పోజ్ అయితే వెంటనే ఆ ప్రాంతంలో వడదెబ్బ లక్షణాలు కనిపిస్తాయి. టాప్ లెస్ డ్రెసెస్.. ఛాతి ఎక్కువగా ఎండకు ప్రభావితం అయ్యే డ్రెస్ లు వేసుకున్నప్పుడు ఈ సమస్య తలెత్తుతుంది.
undefined
ఎండవల్ల చర్మం చికాకుకు లోనై.. దురదలు పుడతాయి. ఈ వడదెబ్బ వల్ల కలిగే దురదలతో ఎర్రటి దద్దుర్లు కూడా వస్తాయి. అంతేకాదు ఈ వేడి వల్ల వక్షోజాల కింది చర్మం చెమటలు పడుతుంది. ఈ చెమట వల్ల వక్షోజాల మీదుండే రంధ్రాలు మూసుకుపోయి చికాకు, దురదలతో పాటు ఇన్ ఫెక్షన్లకు దారి తీస్తుంది.
undefined
గాఢమైన సబ్బులు లేదా బాతింగ్ డిటర్జంట్లు వాడడం వల్ల రొమ్ముల మీద దురదలు వస్తాయి. అందుకే మీ చర్మానికి సూటయ్యే సబ్బునే ఎంచుకోండి. కఠినంగా లేకుండా మైల్డ్ గా ఉండే సబ్బును వాడడం వల్ల ఈసమస్య నుంచి బైటపడొచ్చు. అంతేకాదు అలర్జీకి కారణమయ్యే వాటిని గుర్తించి నివారణకు ప్రయత్నించండి. బ్రాలను వాషింగ్ మెషీన్‌లో పిండితే.. అవి పూర్తిగా ఆరిపోయినప్పటికీ కాసేపు బ్రాని ఎండలో ఆరబెట్టండి.
undefined
బ్రా మెటీరియల్ సరైంది కాకపోతే... : బ్రా తయారీకి వాడిన క్లాత్ సరైంది కాకపోతే కూడా రొమ్ముల దురదకు కారణమవుతుంది. దీనివల్ల చర్మానికి గాలి ఆడక దురద వస్తుంది. మీ బ్రా సైజు, ఫాబ్రిక్, ఆకారం మీకు సరిగ్గా సరిపోయేవే ఎంచుకోండి. బ్రా వల్ల రొమ్ములకు రక్షణతో పాటు ఆరోగ్యం కూడా ఉండాలంటే.. వాటిని కొనేసమయంలో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని.. కాస్త సమయం కేటాయించి కొనుక్కోవాలి.
undefined
గర్భధారణ లేదా చనుబాలివ్వడం : ప్రెగ్నెన్సీ తరువాత బ్రెస్ట్ ఫీడింగ్, ఛాతీ ఆకారాన్ని, పరిమాణాన్ని మారుస్తుంది. ఈ సమయంలో చర్మం సాగడం వల్ల వక్షోజాలు, చనుమొనల్లో మరింత దురదకు దోహదం చేస్తుంది. చనుబాలివ్వడం వల్ల కూడా పొడి చర్మం చికాకుకు దారి తీస్తుంది. పాలిచ్చే తల్లుల్లో చనుమొనల మీద పగుళ్లు, రక్తస్రావం, దురద కనిపిస్తుంటుంది. అందుకే ఈ సమయంలో సరైన బ్రా ధరించడం, చర్మాన్ని తేమగా ఉంచడం వల్ల వీటినుంచి బయట పడడానికి సహాయపడుతుంది.
undefined
ఇలా చనుమొనల్లో దురద పుట్టడం రక్తస్రావం, పగుళ్లు అనేవి కొన్నిసార్లు రొమ్ము క్యాన్సర్ కారణాలు కూడా కావచ్చు. అయితే ఇది చాలా అరుదుగా కొన్ని సందర్బాల్లో మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తలు తీసుకున్నా అనుమానంగా ఉంటే అప్పుడు మీ డాక్టర్ ను సంప్రదించవచ్చు.
undefined
మీరు తామరతో బాధపడుతున్నట్లైతే అది రొమ్ము ప్రాంతంలో దురదకు కూడా కారణమవుతుంది. తామర వల్ల కేవలం ఛాతిమీద మాత్రమే కాదు శరీరంలోని ఏ ప్రాంతంలో అయినా దురదలు వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల మంట, చర్మం పొడి బారిపోవడం కూడా కనిపిస్తుంది.
undefined
click me!