నిమ్మ తొక్కే కదా అని తీసిపారేస్తే పొరపాటే.. దీని ప్రయోజనాలను తెలిస్తే అస్సలు పారేయరు

Published : Sep 30, 2023, 01:50 PM IST

నిమ్మకాయ తొక్కలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి మన మొత్తం ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ముఖ్యంగా మన జుట్టుకు, చర్మానికి నిమ్మ తొక్క చేసే మేలు అంతా ఇంతా కాదు.   

PREV
17
నిమ్మ తొక్కే కదా అని తీసిపారేస్తే పొరపాటే.. దీని ప్రయోజనాలను తెలిస్తే అస్సలు పారేయరు
lemon peel

నిమ్మకాయతో మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ప్రతి ఒక్కరికీ తెలుసు. నిమ్మరసాన్ని పిండి దాని తొక్కలను డస్ట్ బిన్ లో వేసేస్తుంటారు. ఎందుకంటే ఇవి దేనికీ పనికి రావని. కానీ దీని తొక్కలు కూడా ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తాయి.  అవును నిమ్మతొక్కలు బరువు తగ్గడానికి, అందంగా కనిపించడానికంటూ ఎన్నో విధాలుగా మనకు మేలు చేస్తాయి. 

27

నిమ్మ రసంలోనే కాదు దీని తొక్కలో కూడా ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఇవి మీ మొత్తం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ తొక్కలు మన జుట్టుకు, చర్మానికి చేసే మేలు ఎంతో. అందుకే నిమ్మతొక్కతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? వాటిని ఎలా ఉపయోగించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. 

37
lemon peel

నోటి ఆరోగ్యానికి.. 

చిగుళ్లు, దంత కుహరాలకు సంబంధించిన అంటువ్యాధులను తగ్గించడానికి నిమ్మకాయలు బాగా ఉపయోగపడతాయి. నిమ్మ తొక్కలో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు నోటి లోపల సూక్ష్మజీవుల పెరుగుదలను తగ్గిస్తాయి.  ఇది మన దంతాలు, చిగుళ్లతో సహా మొత్తం నోటి ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడుతుంది.

ఎలా ఉపయోగించాలంటే: నిమ్మకాయ రసాన్ని పిండిన తర్వాత.. మిగిలిన తొక్కతో మీ దంతాలను రుద్దండి. అయితే నిమ్మ తొక్కను రాత్రంతా నీటిలో నానబెట్టి  ఉదయాన్నే ఆ నీటితో శుభ్రం చేసుకుంటే కూడా మంచిది. 
 

47
lemon peel

రోగనిరోధక శక్తికి..

పబ్ మెడ్ సెంట్రల్ ప్రకారం.. నిమ్మ తొక్కలో ఉండే ఫ్లేవనాయిడ్లు, విటమిన్ సి వెయిటింగ్ మన రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. బలమైన రోగనిరోధక వ్యవస్థ మన శరీరాన్ని దగ్గు, జలుబు, ఫ్లూ బారిన పడకుండా రక్షిస్తుంది. అలాగే అంటువ్యాధులతో పోరాడటానికి కూడా సహాయపడుతుంది. 

ఎలా ఉపయోగించాలంటే: రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి పిండిన నిమ్మ తొక్కలను నీటిలో నాలుగైదు గంటల పాటు నానబెట్టండి. ఆ తర్వాత ఈ నీటిని ఉదయం పరగడుపున తాగండి. దీనివల్ల మరెన్నో ఆరోగ్య ప్రయోనాలను పొందుతారు. 

57

చర్మానికి.. 

నిమ్మ తొక్కలో విటమిన్ సి తో పాటుగా ఆస్కార్బిక్ యాసిడ్ కూడా పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు ఇది యాంటీఆక్సిడెంట్లకు గొప్ప మూలం కూడా. ఇది నిర్విషీకరణకు సహాయపడుతుంది. ఈ పోషకాలన్నీ చర్మంపై ఉండే మంచ్చలను పోగొడతాయి. అలాగే ముడతలు పడకుండా చేస్తాయి. ఈ తొక్కలో ఉండే విటమిన్ సి చర్మంపై కనిపించే వయసు మచ్చలను కూడా తగ్గిస్తుంది. అలాగే కొల్లాజెన్ ఉత్పత్తిని కూడా పెంచుతుంది. ఇది చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా చేస్తుంది. 

ఎలా ఉపయోగించాలంటే: చర్మంపై నిమ్మ తొక్కను అప్లై చేయడానికి ఎన్నో మార్గాలున్నాయి. ఈ తొక్కలను ఎండబెట్టి పొడిగా చేసి ఫేస్ ప్యాక్ లు, ఉబ్తాన్ మాస్క్ ల రూపంలో చర్మానికి క్రమం తప్పకుండా అప్లై చేయొచ్చు. అలాగే నిమ్మ తొక్క బయటి భాగాన్ని మీ చర్మంపై తేలికగా రుద్దొచ్చు. అలాగే, నిమ్మ తొక్కను గ్రైండ్ చేసి శనగపిండితో కలిపి మీ చర్మానికి అప్లై చేయొచ్చు. 
 

67


ఆక్సీకరణ ఒత్తిడికి.. 

నిమ్మ తొక్కలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి ఒక రకమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది ఫ్రీ రాడికల్స్, టాక్సిన్స్ ప్రభావాలను తగ్గిస్తుంది. అలాగే సెల్యులార్ నష్టాన్ని నియంత్రిస్తుంది. ఇది శరీర జీవక్రియను పెంచుతుంది. 

ఎలా ఉపయోగించాలి: మనలో చాలా మంది ఏదో ఒక సమయంలో లెమన్ టీని తాగుతుంటారు. కాబట్టి మీరు ఇప్పటి నుంచి లెమన్ పీల్ టీని ప్రయత్నించండి. ఇందుకోసం ఒక కప్పు మరుగుతున్న నీటిలో సగం నిమ్మ తొక్క వేసి 5 నిమిషాల పాటు బాగా మరిగించండి. ఆ తర్వాత ఈ నీటిని తాగండి. కావాలనుకుంటే దీనిలో కొద్దిగా నల్ల మిరియాలను కూడా కలుపుకోవచ్చు. 
 

77

బరువు తగ్గడానికి.. 

బరువు తగ్గడానికి కూడా నిమ్మ తొక్క సహాయపడుతుంది. దీనిలో పెక్టిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ జీవక్రియ పెరుగుతుంది. దీంతో మీ ఫ్యాట్ బాగా కరుగుతుంది. 

ఎలా ఉపయోగించాలంటే: డెజర్ట్లు, కుకీలు, కేకులు వంటి  వంటకాలకు మీరు దీన్ని జోడించొచ్చు. అలాగే సూప్లు, పుల్లని రుచులతో కూడిన ఆహారాల్లో కూడా వీటిని ఉపయోగించొచ్చు. అలాగే నిమ్మ తొక్కతో తయారు చేసిన టీ కూడా బరువు తగ్గడానికి మీకు బాగా సహాయపడుతుంది. నిమ్మ తొక్క ఊరగాయ కూడా మీ ఆరోగ్యానికి మంచి చేస్తుంది. 
 

Read more Photos on
click me!

Recommended Stories