వింటే విచిత్రం... కానీ అందానికి మెరుగులద్దే అద్భుతమైన చిట్కాలు..

First Published Jul 13, 2021, 12:24 PM IST

అలాంటి కొన్ని విచిత్రమైన..పనిచేసే చిట్కాలు ఇవి. వీటితో మీ చర్మ సమస్యలు, జుట్టు సమస్యలు మాయమవడమే కాకుండా మృధుమైన, కాంతివంతమైన చర్మం మీ సొంతవుతుంది. 

మూసుకుపోయిన చర్మ రంధ్రాలు, కంటిచుట్టు నల్లటి వలయాలు, మొటిమలు, కాలిపగుళ్లు, చుండ్రు, జుట్టు సమస్యలు.. ప్రతీ ఒక్కరినీ ఇబ్బంది పెట్టేవే. దీని చుట్టూ కోట్లాది రూపాయల బ్యూటీ బిజినెస్ జరుగుతుంటుంది.
undefined
అయితే ఎంత ఖరీదైన లోషన్లు, క్రీమ్ లు వాడిని కొన్నిసార్లు ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. వీటికంటేమరికొన్ని సార్లు.. వంటింటి చిట్కాలు బాగా పనిచేస్తుంటాయి.
undefined
అలాంటి కొన్ని విచిత్రమైన..పనిచేసే చిట్కాలు ఇవి. వీటితో మీ చర్మ సమస్యలు, జుట్టు సమస్యలు మాయమవడమే కాకుండా మృధుమైన, కాంతివంతమైన చర్మం మీ సొంతవుతుంది.
undefined
చర్మ రంధ్రాలు మూసుకుపోవడం వల్ల.. చర్మం సహజకాంతిని కోల్పోతుంది. దీంతో నిర్జీవంగా తయారవుతుంది. దీనికి విరుగుడుగా.. ఒక గిన్నెలో 5-6 టాబ్లెట్ యాక్టివేటెడ్ చార్ కోల్ టాబ్లెట్ తీసుకొని.. దీనికి 2 టేబుల్ స్పూన్ల జెలిటిన్, 3 టేబుల్ స్పూన్ల వేడినీరు కలపాలి.
undefined
వీటిని బాగా కలిపి.. ఆ మిశ్రమాన్ని బ్రష్‌తో ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయాలి. ఆరిన తరువాత పీల్ చేస్తే మూసుకుపోయినరంధ్రాలు తెరుచుకుని మొహం కాంతివంతంగా తయారవుతుంది.
undefined
మడమల పగుళ్లతో ఇబ్బంది పడుతున్నట్లైతే...దీనికోసం..ఒక ఆస్పిరిన్ టాబ్లెట్ ను తీసుకొని దీన్ని రోలింగ్ పిన్నుతో మెత్తటి చూర్ణంలా చేయాలి. ఈ ఆస్పిరిన్ పౌడర్‌ను ఒక చిన్న గిన్నెలోకి తీసుకుని దీనికి 1 టీస్పూన్ సిట్రిక్ యాసిడ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేడినీరు వేసి బాగా కలపండి.
undefined
ఇప్పుడీ మిశ్రమాన్ని ఒక ప్లాస్టిక్ సంచిలో పోసి, దాంట్లో మీ పాదాన్ని ఉంచి దాన్ని కట్టేయండి. అలా 15 నిముషాల పాటు వదిలేయండి. ఇలా చేస్తే 5-7 రోజుల వరకు చేస్తే... పాదాలు, మడిమల్లోని పాత చర్మం ఎక్స్‌ఫోలియేటింగ్ ప్రారంభమవుతుందని గమనించవచ్చు. దీన్ని నెమ్మదిగా తొలగించడం ద్వారా మడిమలు పగుళ్లు లేకుండా ఆరోగ్యంగా తయారవుతాయి.
undefined
మొహం మీద మొటిమలు చాలా ఇబ్బంది పెడతాయి. ఇక ఎక్కువ సంఖ్యలో ఏర్పడే మొటిమలు అందాన్ని మరింత తగ్గిస్తాయి. ఆత్మన్యూనతలో పడేలా చేస్తాయి. దీని నివారణం కోసం వెల్లుల్లిని సగానికి కట్ చేసి నేరుగా మొటిమల మీద దాంతో రుద్దండి. అలా 5 నిమిషాల పాటు చేస్తే ఫలితాలు వెంటనే కనిపిస్తాయి.
undefined
చుండ్రు నివారణకు.. ఒక ఉల్లిగడ్డను సన్నగా తరిగి..జాలీలాంటి చెంచాతో దాంట్లోని రసాన్ని ఎంత తీయగలిగితే అంత తీయాలి. ఈ ఉల్లిపాయ రసానికి 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, 1 టేబుల్ స్పూన్ బర్డాక్ ఆయిల్ కలపండి.
undefined
ఈ మిశ్రమాన్ని ఒక స్ప్రే బాటిల్ లో వేసుకుని తలమీద అంతటా వ్యాపించేలా స్ప్రే చేయాలి. అరగంట తరువాత తరువాత తేలికపాటి షాంపూతో కడగాలి.
undefined
జుట్టు రాలడం అరికట్టడానికి.. ఒక టేబుల్ స్పూన్ బేకర్ ఈస్ట్, రెండు టేబుల్ స్పూన్ల వేడి నీరు వేసి ఫోర్క్ తో కలపాలి. తరువాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ తేనె, 1 టీస్పూన్ మీకు ఇష్టమైన నూనె, 1 టేబుల్ స్పూన్ వోడ్కా, 1 గుడ్డు పచ్చసొన కలపాలి.
undefined
వీటన్నింటినీ బాగా కలిపి.. ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్‌లో పోసి నిల్వ చేసుకుంటే తరువాత వాడుకోవడానికి ఉంటుంది. ఇక ఈ మిశ్రమాన్ని జుట్టు మీద అప్లై చేయాలి.. తరువాత దువ్వెనతో చక్కగా దువ్వాలి. 1-2 గంటల పాటు అలాగే ఉంచి, ఆపై తేలికపాటి షాంపూ, కండీషనర్ ఉపయోగించి కడిగేయాలి.
undefined
click me!