Parenting: మగపిల్లల పెంపకంలో ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు! చేస్తే ఇబ్బందులు తప్పవు!

Published : Jul 10, 2026, 05:13 PM IST

Parenting: ఒక మగపిల్లవాడు మంచి మనిషిగా ఎదగాలంటే చదువు, డబ్బు, విజయం మాత్రమే సరిపోవు. చిన్నప్పటి నుంచే సరైన పెంపకం కూడా అవసరం. మగ పిల్లలను పెంచే ప్రతి తల్లిదండ్రులు పొరపాటున కూడా చేయకూడని 5 తప్పుల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

PREV
16
మగపిల్లల పెంపకంలో చేయకూడని 5 తప్పులు

మగ పిల్లలను పెంచడం కష్టమని చాలామంది పేరెంట్స్ చెబుతుంటారు. వారిని మంచి వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం, బాధ్యత, భావోద్వేగాలను అర్థం చేసుకునే సామర్థ్యం ఉన్న మనిషిగా తీర్చిదిద్దడం చాలా బాధ్యతతో కూడుకున్న పని. చిన్నప్పటి పెంపకమే వారి ఆలోచనా విధానాన్ని, ప్రవర్తనను, జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే తల్లిదండ్రులు తెలియక చేసే కొన్ని పొరపాట్లు పిల్లల వ్యక్తిత్వంపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా ఈ ఐదు తప్పులను అస్సలు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం.

26
అల్లరి చేయకుండా ఆపకూడదు

మగ పిల్లలు పరుగులు తీయడం, ఎగరడం, చెట్లు ఎక్కడం, మట్టిలో ఆడుకోవడం, కొత్త విషయాలను ప్రయత్నించడం సహజం. ఇది వారి శారీరక, మానసిక ఎదుగుదలకు చాలా అవసరం. ప్రతి చిన్న పనికీ అది చేయొద్దు, ఇది చేయొద్దు అంటూ ఎప్పుడూ అడ్డుకుంటే వారి సహజమైన ఉత్సాహం తగ్గిపోతుంది. ప్రమాదకరమైన పనులను ఆపాలి. కానీ సాధారణ అల్లరిని పూర్తిగా నిషేధించకూడదు.

36
ఇంట్లోనే ఖాళీగా కూర్చోబెట్టొద్దు

ఈ రోజుల్లో చాలామంది పిల్లలు బయట ఆటల కంటే మొబైల్ ఫోన్లు, టీవీలు, వీడియో గేమ్స్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇది వారి ఆరోగ్యంపై, సామాజిక నైపుణ్యాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. పిల్లలు బయటకు వెళ్లి స్నేహితులతో కలిసి ఆడుకోవడం, సైకిల్ తొక్కడం, క్రికెట్, ఫుట్‌బాల్ లేదా ఇతర క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరక దృఢత్వంతో పాటు ఓటమిని అంగీకరించడం, సమస్యలను ఎదుర్కోవడం వంటి జీవిత నైపుణ్యాలు అలవడతాయి. 

46
నువ్వు మగాడివి, ఏడవొద్దు అని చెప్పకూడదు

ఈ మాట చాలామంది అబ్బాయిల భావోద్వేగాలను అణిచివేస్తుంది. బాధ, భయం, నిరాశ వంటి భావాలను బయటపెట్టడం సహజం. ఏడవడం బలహీనత కాదు. కానీ చిన్నప్పటి నుంచే "మగాళ్లు ఏడవరు" అనే భావనను నాటితే, పిల్లలు తమ భావాలను దాచుకోవడం నేర్చుకుంటారు. పెద్దయ్యాక కూడా తమ సమస్యలను ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా బాధపడే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలకు తమ భావాలను వ్యక్తపరచడం తప్పు కాదని, బాధ కలిగితే చెప్పుకోవచ్చని నేర్పించాలి.

56
రిస్క్ తీసుకునే అవకాశం ఇవ్వడం

ప్రతి పనిలో వారిని అతిగా కాపాడుతూ, ఏదీ సొంతంగా చేయనివ్వకుండా ఉంటే వారు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకోలేరు. కొత్త ఆటలు నేర్చుకోవడం, పోటీల్లో పాల్గొనడం, చిన్న చిన్న బాధ్యతలు తీసుకోవడం, ఓడిపోయినా మళ్లీ ప్రయత్నించడం వంటి అవకాశాలు వారికి ఇవ్వాలి. ఇలాంటి అనుభవాలే జీవితంలో ధైర్యంగా ముందుకు వెళ్లే గుణాన్ని పెంచుతాయి.  

66
పిల్లల ముందు తండ్రి ప్రవర్తన

పిల్లలు.. పెద్దలు చెప్పేదాని కంటే, వారు చేసేదాన్ని ఎక్కువగా అనుకరిస్తారు. ముఖ్యంగా అబ్బాయిలకు తండ్రే మొదటి రోల్ మోడల్. ఇంట్లో అమ్మతో గౌరవంగా మాట్లాడడం, కోపాన్ని అదుపులో పెట్టుకోవడం, నిజాయతీగా ఉండడం, బాధ్యతగా వ్యవహరించడం వంటి లక్షణాలను పిల్లలు నాన్నను చూసే నేర్చుకుంటారు. ఓ వైపు మంచి విలువలు చెప్పి, మరోవైపు వాటికి విరుద్ధంగా ప్రవర్తిస్తే పిల్లలు మాటల కంటే ప్రవర్తననే ఎక్కువగా అనుసరిస్తారు. అందుకే తండ్రి ప్రవర్తన పిల్లల వ్యక్తిత్వ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుంది. నిపుణుల ప్రకారం ఈ చిన్న చిన్న తప్పులను నివారిస్తే మగపిల్లలు వారి జీవితంలో విజయవంతమైన వ్యక్తులుగా ఎదుగుతారు.

Read more Photos on
click me!

Recommended Stories