Parenting: పిల్లలకు చదువుపై ఇంట్రెస్ట్ రావాలంటే ఈ 5 పనులు చేసి చూడండి!

Published : Jul 29, 2026, 02:38 PM IST

Parenting: ప్రస్తుతం చాలామంది పేరెంట్స్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో, పిల్లలకు చదువుపై ఆసక్తి తగ్గిపోవడం కూడా ఒకటి. బుక్ చేతిలో పెట్టిన కాసేపటికే పిల్లలు విసుగు చెందుతున్నారు. మరి పిల్లలకు చదువుపై ఇంట్రెస్ట్ రావాలంటే పేరెంట్స్ ఏం చేయాలో చూద్దాం.

PREV
16
పిల్లలకు చదువుపై ఆసక్తి పెంచే చిట్కాలు

ప్రస్తుతం చాలామంది పిల్లలు చదువుకంటే మొబైల్ ఫోన్, టీవీ లేదా గేమ్స్ వైపు ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. అయితే పిల్లలు చదువుపై ఆసక్తి చూపకపోవడానికి వారు మాత్రమే కారణం కాదు. ఇంటి వాతావరణం, తల్లిదండ్రుల ప్రవర్తన, బోధించే విధానం, పిల్లలపై ఉండే ఒత్తిడి వంటి అనేక అంశాలు ఉన్నాయి. మరి పిల్లలకు చదువుపై ఆసక్తి కలగాలంటే ఏం చేయాలి? నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం.

26
చదవమని బలవంతం చేయొద్దు

చాలామంది తల్లిదండ్రులు మార్కుల గురించే ఎక్కువగా మాట్లాడుతుంటారు. దీంతో పిల్లలకు చదువు అంటే భయం పెరుగుతుంది. కానీ చదువును ఒక ఆటలా, కొత్త విషయాలు తెలుసుకునే అవకాశంగా పరిచయం చేస్తే వారికి సహజంగానే ఆసక్తి పెరుగుతుంది. కథలు చెప్పడం, చిత్రాల ద్వారా బోధించడం, చిన్న చిన్న ప్రయోగాలు చేయించడం వంటి పద్ధతులు పిల్లలను ఆకట్టుకుంటాయి. ఒక విషయం అర్థమైతే వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అదే వారికి చదువు మీద మరింత ఆసక్తిని కలిగిస్తుంది.

36
స్పష్టమైన షెడ్యూల్

ఎప్పుడు చదువుకోవాలి అనే విషయంలో స్పష్టమైన షెడ్యూల్ ఉంటే పిల్లలు కూడా దానికి అలవాటు పడతారు. అయితే గంటల తరబడి చదవమని ఒత్తిడి చేయకూడదు. వయసును బట్టి 30 నుంచి 45 నిమిషాల పాటు చదివించి, మధ్యలో కొద్దిసేపు విరామం ఇవ్వడం మంచిది. ఇలా చదువు, ఆట, విశ్రాంతి అన్నింటికీ సమాన ప్రాధాన్యం ఇస్తే పిల్లలు విసుగు చెందకుండా చదవగలుగుతారు.

46
ప్రశంస ముఖ్యం

పరీక్షల్లో మంచి మార్కులు వచ్చినప్పుడే కాకుండా, ఒక కొత్త పాఠం నేర్చుకున్నా, హోంవర్క్ సమయానికి పూర్తి చేసినా వారిని ప్రశంసించాలి. “నువ్వు చాలా బాగా చేశావు”, “ చాలా బాగా ట్రై చేశావు” వంటి మాటలు పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ప్రశంసలు పిల్లలను మరింత మెరుగ్గా చేయాలనే ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఎప్పుడూ తప్పులనే చూపించడం వల్ల పిల్లలు నిరుత్సాహానికి గురయ్యే అవకాశం ఉంటుంది.

56
అనుకూల వాతావరణం

పిల్లలు చదువుతున్న సమయంలో టీవీ పెద్ద శబ్దంతో పెట్టడం, మొబైల్ ఫోన్లు చూడటం వంటి అలవాట్లు వారికి ఆటంకంగా మారతాయి. ఇంట్లో పెద్దలు కూడా పుస్తకాలు, వార్తాపత్రికలు చదవడం వంటి మంచి అలవాట్లు పాటిస్తే పిల్లలు వాటిని అనుకరిస్తారు. పిల్లలు చూసి నేర్చుకునే స్వభావం కలిగి ఉంటారు కాబట్టి.. తల్లిదండ్రుల ప్రవర్తనే వారికి మొదటి పాఠశాల అవుతుంది.

66
పిల్లల ఆసక్తికి అనుగుణంగా..

ప్రతి పిల్లవాడికి ఒకే రకమైన అభిరుచులు ఉండవు. కొందరికి సైన్స్ అంటే ఇష్టం, మరికొందరికి కథలు, చిత్రలేఖనం లేదా గణితం అంటే ఆసక్తి ఉంటుంది. వారు ఇష్టపడే అంశాల ద్వారా కొత్త విషయాలను పరిచయం చేస్తే చదువు భారంగా అనిపించదు. ప్రకృతిని ఇష్టపడే పిల్లలకు మొక్కలు, జంతువుల గురించి పుస్తకాలు ఇవ్వడం లేదా చిన్న ప్రయోగాలు చేయించడం ద్వారా చదువుపై ఆసక్తి పెంచవచ్చు. ఇలా వారి అభిరుచులను గౌరవించడం వల్ల నేర్చుకోవాలనే తపన సహజంగానే పెరుగుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories