Health: వామ్మో.. రాత్రిపూట లైట్ వేసుకుని పడుకోవడం ఇంత డేంజరా..!

Published : Apr 05, 2022, 03:34 PM IST

Health: పడుకునేటప్పుడు కొంతమంది లైట్లను ఆఫ్ చేస్తే.. మరికొంతమంది మాత్రం లైట్లను వెలిగించే నిద్రపోతుంటారు. కానీ లైట్లను వెలిగించి పడుకోవడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్ వంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.   

PREV
17
Health: వామ్మో.. రాత్రిపూట లైట్ వేసుకుని పడుకోవడం ఇంత డేంజరా..!

Health:రాత్రుళ్లు కొంతమంది లైట్లను ఆఫ్ చేసే పడుకుంటే.. మరికొంంతమంది మాత్రం లైట్లను అలా వెలిగించే నిద్రపోతుంటారు. ఇలా లైట్లను ఆఫ్ చేయకుండా పడుకోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 

27

అమెరికాలోని Northwestern Universityకి చెందిన Feinberg School of Medicine పరిశోధకులు దీనిపై ఒక అధ్యయనం జరిపారు. అందులో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. 
 

37

రాత్రుళ్లు లైట్ వేసుకునే పడుకోవడం వల్ల ప్రమాదకరమైన హార్ట్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్ వంటి రోగాల బారిన పడే అవకాశముందని తేలింది. 
 

47

మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. రాత్రుళ్లు లైట్ వెలుతురులో పడుకోవడం వల్ల Heart rate రోజు రోజుకు పెరుగుతుందని కనుగొన్నారు. మన శరీరంలో ని ఇన్సులిన్ విషయంలో కూడా ఇలాగే జరుతుందని చెబుతున్నారు. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. 

57

ఈ అధ్యయనం 20 మందిపై నిర్వహించారు. ఇందులో వెలుతులో పడుకున్న వారి Heart rate చాలా పెరిగినట్టు  శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనికి కారణం మన పడుకున్నా కానీ మన Autonomic nervous system మాత్రం చురుగ్గానే ఉంటుందట. అందుకే ఇలా జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

67

ప్రకాశవంతమైన వెలుతురులో పడుకుంటే వారిలో ఇన్సులిన్ సుమారుగా 15 శాం పెరుగుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అదే వెలుతురు తక్కువగా ఉండే ప్లేస్ లో పడుకునే వారిలో పెరిగిన ఇన్సులిన్ నాలుగు శాతం తగ్గిందని చెబుతున్నారు. 
 

77

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వెలుతురులో పడుకుంటే ఇంట్లో ఉండే వస్తువును క్లియర్ గా చూడగలుగుతాం. కానీ ఇది మన ఆరోగ్యానికి అంత మంచిది కాదని అభిప్రాయపడుతున్నారు. డిమ్ లైట్ లో లేదా మొత్తమే చీకట్లో పడుకోవడం వల్ల మన ఆరోగ్యం బావుంటుందని చెబుతున్నారు. 

click me!

Recommended Stories