
government Jobs : నిరుద్యోగ యువతకు బంపరాఫర్. కనీస విద్యార్హతలతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అదీ ఒకటి రెండు ఉద్యోగాలకు కాదు ఏకంగా 1850 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.
రక్షణ రంగ సంస్థ అయిన ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ (AVNL) నేతృత్వంలోని హెవీ వెహికిల్సి ఫ్యాక్టరీ (HVF) లో ఉద్యోగాలను పొందే అద్భుత అవకాశమిది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది కాబట్టి అర్హతలు కలిగిన అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోవచ్చు.
వివిధ విభాగాల్లో తక్కువ విద్యార్హతలతో జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ చేపడుతున్నారు. అయితే ఈ ఉద్యోగాలను శాశ్వత ప్రాతిపదికన కాకుండా ఒప్పంద (కాంట్రాక్ట్) పద్దతిలో చేపడుతున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీలు, అర్హతలు, జీతం, ఎంపిక ప్రక్రియ గురించి ఇక్కడ తెలుసుకుందాం.
1. ఎలక్ట్రీషన్ - 186
2. బ్లాక్ స్మిత్ - 17
3. కార్పెంటర్ - 4
4. ఎలక్ట్రోప్లేటర్ - 3
5. ఎగ్జామినర్ (ఎలక్ట్రీషన్) - 12
6. ఎగ్జామినర్ (జనరల్ ఫిట్టర్) - 23
7. ఎగ్జామినర్ (ఎలక్ట్రానిక్స్ ఫిట్టర్) - 7
8. ఎగ్జామినర్ (మెషినిస్ట్) - 21
9. ఎగ్జామినర్ (వెల్డర్) - 4
10. ఫిట్టర్ జనరల్ - 668
11. AFV ఫిట్టర్ - 49
12. ఫిట్టర్ ఆటో ఎలక్ట్రిక్ - 5
13. ఫిట్టర్ ఎలక్ట్రానిక్స్ - 83
14. హీట్ ట్రీట్మెట్ ఆపరేటర్ - 12
15. మెషినిస్ట్ - 430
16. మెటీరియల్ హ్యన్డ్లింగ్ ఎక్విప్ మెంట్ ఆపరేటర్ - 60
17. పెయింటర్ - 24
18. రిగ్గర్ -36
19. సాండ్ ఆండ్ షాట్ బ్లస్టర్ -6
20. వెల్డర్ - 200
పోస్టులను బట్టి విద్యార్హతలు పరిగణలోకి తీసుకుంటారు. సంబంధిత విభాగంలో నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ నుండి నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ (NAC) లేదా నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ (NTC) కలిగివుండాలి.
మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్ మెంట్ ఆపరేటర్ ఉద్యోగానికి పదో తరగతి పాసయి వుండి హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్, రెండేళ్ల అనుభవం కలిగివుండాలి.
రిగ్గర్ పోస్టులకు కూడా పదో తరగతి పాసయి భారీ పరిశ్రమల్లో లోడింగ్, అన్ లోడింగ్ లో 2 ఏళ్ల అనుభవం ఉండాలి.
రిజర్వేషన్ ఆధారంగా వయోపరిమితి ఉంటుంది.
జనరల్ అభ్యర్థులు 35 ఏళ్ల లోపు వయసు ఉండాలి.
ఓబిసి (నాన్ క్రిమిలేయర్) అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది. అంటే 38 ఏళ్లలోపు వయసు గలవారు అర్హులు
ఎస్సి, ఎస్టి అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు ఉంటుంది. 40 ఏళ్లలోపు వయసుగల అభ్యర్థులు అర్హులు
PwBD (Person with Benchmark Disabilities) : ఈ అభ్యర్థులకు 10 ఏళ్ల వయసు సడలింపు ఉంటుంది. ఇది రిజర్వేషన్ సడలింపుకు అదనం.
మాజీ సైనికులు : ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు వర్తిస్తుంది.
ఇలా అన్నిరకాల సడలింపుల తర్వాత గరిష్ట వయోపరిమితి 55 ఏళ్లు
బేసిక్ సాలరీ : నెలకు రూ.21,000
ఇండస్ట్రియల్ డియర్ నెస్ అలవెన్స్ (IDA)
స్పెషల్ అలవెన్స్ : బేసిక్ సాలరీపై 5శాతం
ఏడాది ఇంక్రిమెంట్ : బేసిక్ సాలరీపై 3 శాతం
నెలకు రూ.3000 మెడికల్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్
పిఎఫ్, గ్యాట్రుటీ ఉంటుంది.
విధుల్లో ఉండగా ప్రమాదవశాత్తు చనిపోతే రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా
అధికారిక AVNL వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.
జనరల్ అభ్యర్థులు రూ.300 ఆన్ లైన్ లో చెల్లించాలి. ఎస్సి, ఎస్టి, పిడబ్ల్యూబిడి, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక ప్రక్రియ :
1. షార్ట్ లిస్ట్ :
దరఖాస్తుల ఆధారంగా అత్యధికంగా స్కిల్ కలిగిన అభ్యర్థులకు గుర్తించి షార్ట్ లిస్ట్ చేస్తారు. అకడమిక్, NTC/NAC లో మెరిట్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
2. ట్రేడ్ టెస్ట్ (ప్రాక్టికల్) :
షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను ట్రేడ్ టెస్ట్ కు ఆహ్వానిస్తారు. ఇందులో క్వాలిఫై అయిన అభ్యర్థులు తదుపరి దశకు వెళతారు.
3. డాక్యుమెంట్ వెరిఫికేషన్ :
అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ను పరిశీలిస్తారు. అన్ని సరిగ్గా ఉంటేనే ఉద్యోగాలకు అర్హులు.
4. ఫైనల్ మెరిట్ లిస్ట్ :
పై అన్నింటిలో క్వాలిఫై అభ్యర్థుల ఫైనల్ మెరిట్ లిస్ట్ రెడీ చేస్తారు. వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుని ఫైనల్ అభ్యర్థులకు సెలెక్ట్ చేస్తారు.
నోటిఫికేషన్ విడుదల : జూన్ 2025
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం ; జూన్ 28, 2025
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ ; జులై 19, 2025
డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్ టెస్ట్ తేదీలను ఇంకా ప్రకటించాల్సి ఉంది.