బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం చాలామంది ప్రయత్నిస్తుంటారు. అలాంటిది బ్యాంకులన్నింటికి బాస్ లాంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) లో భారీ ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. మీకు అన్ని అర్హతలుంటే వెంటనే దరఖాస్తు చేసుకొండి.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) 2026 సంవత్సరానికి కొత్త ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది. RBISB/DA/04/2025-26 నోటిఫికేషన్ నంబర్ కింద మొత్తం 93 ఇంజనీర్ ఆండ్ నిపుణుల పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. డేటా సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్‌మెంట్, ఎకనామిక్ అనాలిసిస్ వంటి రంగాలలో అనుభవం ఉన్న నిపుణులకు ఇది ఒక ముఖ్యమైన అవకాశంగా పరిగణించవచ్చు. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా స్వీకరిస్తున్నారు.
27
RBI లో భర్తీ చేసే ఉద్యోగాలివే
ఈ రిక్రూట్‌మెంట్‌లో డేటా సైంటిస్ట్, డేటా ఇంజనీర్, ఐటీ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్, ఐటీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, ఐటీ ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్, ఏఐ / ఎంఎల్ స్పెషలిస్ట్, ఐటీ – సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్, ప్రాజెక్ట్ మేనేజర్ వంటి వివిధ గ్రేడ్ ‘సి’, ‘డి’, ‘ఇ’ స్థాయి పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు పని చేసే ప్రదేశం ఎక్కువగా ముంబై, ఆర్‌బీఐ డేటా సెంటర్లు. కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉన్నత బాధ్యతలతో కూడిన సాంకేతిక ఉద్యోగాలలో చేరాలనుకునే వారికి ఇది ఒక అరుదైన అవకాశం.
37
ఆర్బిఐ ఉద్యోగాలకు అర్హతలు
విద్యా అర్హతల విషయానికొస్తే BE / B.Tech / M.Tech / MCA / MSc / MBA / CA / ICWA వంటి డిగ్రీలు అవసరం. డేటా సైన్స్, ఐటీ, సైబర్ సెక్యూరిటీ, ఫైనాన్స్, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ వంటి రంగాలలో 3 నుంచి 10 సంవత్సరాల అనుభవం అవసరం. కొన్ని పోస్టులకు CISSP, CISA, CFA, FRM, PMP, AI/ML వంటి ప్రొఫెషనల్ సర్టిఫికేట్లు ఉంటే ప్రాధాన్యం ఇస్తారని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
వయోపరిమితి జనవరి 6, 2026 నాటికి కనీసం 21 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు నిర్ణయించారు. కొన్ని సీనియర్ స్థాయి పోస్టులకు గరిష్ట వయస్సు 45 లేదా 62 వరకు అనుమతించారు. SC/ST, OBC, వికలాంగులు, మాజీ సైనికులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపులు ఉంటాయి.
57
శాలరీ
జీతం వివరాల్లో, గ్రేడ్ ‘సి’ (లెవల్ 3) పోస్టులకు సంవత్సరానికి రూ.3.10 లక్షల వరకు, గ్రేడ్ ‘డి’ (లెవల్ 4) పోస్టులకు రూ.4.30 లక్షల వరకు, గ్రేడ్ ‘ఇ’ (లెవల్ 5) పోస్టులకు రూ.4.80 లక్షల వరకు CTC ఇస్తారు. ఇది అనుభవం ఉన్న నిపుణులకు చాలా ఆకర్షణీయమైన జీతం.
67
ఎంపిక ప్రక్రియ
ఈ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ ప్రిలిమినరీ స్క్రీనింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ దశల ద్వారా జరుగుతుంది. దరఖాస్తు రుసుముగా SC/ST/మాజీ సైనికులు/వికలాంగులు రూ.100/-, ఇతర అభ్యర్థులు రూ.600/- ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
77
దరఖాస్తు విధానం
అర్హత గల అభ్యర్థులు 06.01.2026 వరకు ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ https://opportunities.rbi.org.in/ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగ ప్రకటన, ఇతర వివరాలను ఆర్‌బీఐ వెబ్‌సైట్‌లో జాగ్రత్తగా చదివి, అర్హత ఉన్నవారు చివరి తేదీకి ముందే దరఖాస్తు చేసుకోవడం అవసరం.