Pilot: మీ పిల్ల‌ల్ని పైల‌ట్‌గా చూడాల‌నుకుంటున్నారా.. ఎంత ఖర్చవుతుంది.? ఏం చేయాలంటే..

Published : Dec 21, 2025, 01:50 PM IST

Pilot: పైలట్ కావ‌డం చాలా మందికి జీవిత ఆశ‌యం. ఒక‌ప్పుడు కేవ‌లం ఉన్న‌త వ‌ర్గాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన ఈ క‌ల ఇప్పుడు మ‌ధ్య త‌ర‌గతి వాళ్లు కూడా సాధిస్తున్నారు. ఇంతకీ భార‌త్‌లో పైలట్ కావాలంటే ఎంత ఖ‌ర్చ‌వుతుంది.? 

PREV
15
స్కూల్ స్థాయి అర్హతలు – 10+2లో ఏ సబ్జెక్ట్స్ కావాలి?

పైలట్ శిక్షణకు అర్హత పొందాలంటే ఇంటర్మీడియట్ స్థాయిలో ఫిజిక్స్, మ్యాథ్స్ చదివి ఉండాలి. ఫిజిక్స్‌, కెమెస్ట్రీమ మ్యాథ్స్‌లో క‌నీసం 50 శాతం మార్కులు సాధించాలి. ఇప్పటికే ఇంటర్ పూర్తై PCM లేకపోతే భయపడాల్సిన అవసరం లేదు. NIOS ద్వారా ఫిజిక్స్, మ్యాథ్స్ రాసే అవకాశం ఉంది. ఇది DGCA అంగీకరించిన మార్గం.

25
మెడికల్ ఫిట్‌నెస్ – DGCA మెడికల్ పరీక్షలు

పైలట్ కావాలంటే శారీరక ఆరోగ్యం చాలా ముఖ్యం.

మొదట DGCA క్లాస్–2 మెడికల్

తర్వాత DGCA క్లాస్–1 మెడికల్

కంటి చూపు, హార్ట్, వినికిడి, నరాల వ్యవస్థ వంటి అంశాలను పరిశీలిస్తారు. ఈ పరీక్షలు పూర్తయిన తర్వాత మాత్రమే ఫ్లయింగ్ ట్రైనింగ్ మొదలుపెట్టాలి.

DGCA గ్రౌండ్ ఎగ్జామ్స్ – రాయాల్సిన పరీక్షలు

పైలట్ కావాలంటే DGCA నిర్వహించే థియరీ పరీక్షలు తప్పనిసరి.

రాయాల్సిన ముఖ్యమైన సబ్జెక్ట్స్:

* ఎయిర్ రెగ్యులేషన్స్

* ఎవియేషన్ మెటియరాలజీ

* ఎయిర్ నావిగేషన్

* టెక్నికల్ జనరల్

* టెక్నికల్ స్పెసిఫిక్

* రేడియో టెలిఫోనీ (WPC ద్వారా)

ప్రతి పరీక్షలో కనీసం 70 శాతం మార్కులు అవసరం. సాధారణంగా ఈ దశ పూర్తి చేయడానికి 6 నుంచి 12 నెలలు పడుతుంది.

35
200 గంటల ఫ్లయింగ్ – అసలు శిక్షణ ఇక్కడే

కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొందాలంటే 200 గంటల ఫ్లయింగ్ తప్పనిసరి.

ఈ ఫ్లయింగ్‌లో ఉండేవి:

* డ్యూయల్ ఫ్లైట్స్

* సోలో ఫ్లైట్స్

* క్రాస్ కంట్రీ ఫ్లయింగ్

* నైట్ ఫ్లయింగ్

* ఇన్‌స్ట్రుమెంట్ ఫ్లయింగ్

ప్రారంభంలో సెస్నా 152, 172 వంటి చిన్న విమానాల్లో శిక్షణ ఇస్తారు. ఇదే దశలో నిజమైన పైలట్ నైపుణ్యాలు వస్తాయి. గ్రౌండ్ ఎగ్జామ్స్, 200 గంటల ఫ్లయింగ్ లాగ్ అయ్యాక DGCA నుంచి CPL కోసం దరఖాస్తు చేయవచ్చు. ఈ లైసెన్స్ వచ్చాకే అధికారికంగా కమర్షియల్ పైలట్ అవుతారు.

45
పెద్ద విమానాలు నడపాలంటే - టైప్ రేటింగ్

ఎయిర్‌బస్ A320 లేదా బోయింగ్ 737 లాంటి విమానాలు నడపాలంటే టైప్ రేటింగ్ అవసరం.

* కాలవ్యవధి: 2–3 నెలలు

* శిక్షణ: సిమ్యులేటర్ ఆధారితం

* ఖర్చు: రూ.12 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు

ఈ శిక్షణను స్వతంత్రంగా తీసుకోవచ్చు లేదా ఎయిర్‌లైన్ క్యాడెట్ ప్రోగ్రామ్ ద్వారా చేయవచ్చు.

పైలట్ శిక్షణకు ఎంత‌ ఖర్చు అవుతుంది.?

* గ్రౌండ్ స్కూల్ + DGCA పరీక్షలు: రూ.2.5–3 లక్షలు

* 200 గంటల ఫ్లయింగ్: రూ.42–49 లక్షలు

* టైప్ రేటింగ్: రూ.12–20 లక్షలు

* మొత్తం ఖర్చు: సుమారు రూ.65–75 లక్షలు

* క్యాడెట్ ప్రోగ్రామ్ అయితే ఖర్చు రూ.1 కోటి దాటుతుంది. అయితే ఉద్యోగ అవకాశాలు ముందే ఉంటాయి.

55
భారత్‌లో ప్రసిద్ధ ఫ్లయింగ్ స్కూల్స్

DGCA ఆమోదం పొందిన కొన్ని ప్రముఖ సంస్థలు:

* IGRUA – అమేథీ

* కార్వర్ ఏవియేషన్ అకాడమీ – బరమతి

* క్యాప్టెన్ సాహిల్ ఖురానా ఏవియేషన్ అకాడమీ – పటియాలా

* CAE గోండియా – ఇండిగో క్యాడెట్ ప్రోగ్రామ్

చేరే ముందు తప్పనిసరిగా DGCA వెబ్‌సైట్‌లో అనుమతి స్థితిని పరిశీలించాలి.

Read more Photos on
click me!

Recommended Stories