Layoffs: సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల ప‌రిస్థితి ఏంటి.? ఆ సంస్థ‌లో మ‌రోసారి ఉద్యోగుల కోత

Published : Aug 08, 2025, 03:39 PM IST

ప్ర‌ముఖ ఐటీ దిగ్గ‌జ సంస్థ మైక్రోసాఫ్ట్ ఉద్యోగాల‌ను తొల‌గిస్తున్న తీరు ప్ర‌పంచాన్ని కుదిపేసిన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా మ‌రోసారి కంపెనీ కొంత‌మంది ఉద్యోగుల‌ను తొల‌గించింది. దీంతో అస‌లు మైక్రోసాఫ్ట్‌లో ఏం జ‌రుగుతోంద‌న్న అంశం తెర‌పైకి వ‌స్తోంది. 

PREV
15
మైక్రోసాఫ్ట్‌లో మరోసారి ఉద్యోగాల తొలగింపు

మైక్రోసాఫ్ట్ వాషింగ్టన్‌ స్టేట్‌లోని రెడ్‌మండ్ క్యాంపస్‌లో పని చేస్తున్న కొంద‌రు ఉద్యోగుల‌ను తొల‌గించింది. ఈ పరిణామంతో 2025 మే నెల తర్వాత ఒక్క వాషింగ్టన్ ప్రాంతంలోనే ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య 3,160కి చేరింది. ఆ సంస్థలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు దీనిని 'సంక్షోభం'గా అభివర్ణిస్తున్నారు.

DID YOU KNOW ?
8 నెలల్లో
మైక్రోసాఫ్ట్ ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఏకంగా 15,000 మంది ఉద్యోగులను తొలగించడం గమనార్హం.
25
ఉద్యోగుల తొల‌గింపు ఎందుకు.?

ఈ ఉద్యోగ తొలగింపుల వెనుక ప్రధాన కారణం మైక్రోసాఫ్ట్ భారీగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI) విభాగంపై దృష్టి పెట్టడమే. గత ఏడాది కంపెనీ AI మౌలిక సదుపాయాల కోసం 88 బిలియన్ డాలర్లు ఖర్చు చేయగా, వచ్చే సెప్టెంబర్ నాటికి మరో 30 బిలియన్ డాలర్ల పెట్టుబడిని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మార్పులు వ్యూహాత్మక పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా తీసుకున్న నిర్ణయాలేనని కంపెనీ అధికారులు చెబుతున్నారు.

35
ఈ ఏడాది ఎంతి ఉద్యోగుల‌ను తొల‌గించారంటే.?

ఈ ఏడాది ప్రారంభం నుంచే మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా తన సిబ్బందిలో భారీ కోతలను పెడుతోంది. ఇప్పటి వరకు ఏకంగా 15,000 మందికి పైగా ఉద్యోగులను పలు విభాగాల్లో నుంచి తొలగించారు. వీటిలో ఎక్స్‌బాక్స్, లీగల్, సేల్స్, ఇంజినీరింగ్ తదితర విభాగాలు ఉన్నాయి. ప్రత్యేకించి గేమింగ్ యూనిట్‌ తీవ్రమైన ప్రభావాన్ని ఎదుర్కొంది. 'ది ఇనిషియేటివ్' అనే స్టూడియో మూతపడి, పలు గేమ్ ప్రాజెక్టులు రద్దయ్యాయి.

45
సత్య నాదెళ్ల ఏమ‌న్నారంటే.?

ఈ ఉద్యోగ తొలగింపులపై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల స్పందిస్తూ, ఒక ఇంటర్నల్ మెమోలో ఉద్యోగులకు సందేశాన్ని పంపించారు. “ఈ నిర్ణయాలు చాలా క్లిష్ట పరిస్థితుల్లో తీసుకున్నవే. సంస్థలో ఎంతో కాలంగా పని చేసిన, అనుభవాన్ని పంచుకున్న సిబ్బందిపై ఇది ప్రభావం చూపిస్తోందన్న విషయం నన్నెంతో బాధిస్తోంది. కానీ వ్యాపార దృష్టిలోనూ, భవిష్యత్ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది” అని ఆయన పేర్కొన్నారు.

55
లాభాల్లో ఉన్నా ఎందుకిలా.?

గత త్రైమాసికంలో మైక్రోసాఫ్ట్ నికర లాభం 18% పెరిగి 25.8 బిలియన్ డాలర్లకు చేరింది. ఇలాంటి సమయంలోనూ సంస్థ లేఆఫ్స్ జరుపుతుండటం ఉద్యోగుల్లో అసంతృప్తికి దారితీస్తోంది. ఆర్థికంగా బలమైన స్థితిలో ఉన్నప్పటికీ, కంపెనీ ఉద్యోగులను తొలగించడాన్ని అనేక మంది విమర్శిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories