ఈ రాష్ట్రాల్లో ఉద్యోగాలే ఉద్యోగాలు..
గుజరాత్ టీచర్ రిక్రూట్‌మెంట్ 2026 (GSPESC విద్యా సహాయక్)
గుజరాత్ ప్రభుత్వం ప్రైమరీ స్కూళ్లలో భారీగా టీచర్ పోస్టులను భర్తీ చేస్తోంది. 2026లో ఇదే అతిపెద్ద టీచింగ్ రిక్రూట్‌మెంట్‌లలో ఒకటి. టెట్ పాసైన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.
మొత్తం ఖాళీలు: 11,000+
పోస్టు: విద్యా సహాయక్ (ప్రైమరీ టీచర్)
అర్హత: D.El.Ed + TET-1 పాస్
వయసు: 18-35 ఏళ్లు (రిజర్వేషన్ ప్రకారం మినహాయింపు)
జీతం: ₹25,000 - ₹81,000 వరకు
దరఖాస్తు చివరి తేదీ: 24 ఏప్రిల్ 2026
దరఖాస్తుల ప్రారంభం: 15 ఏప్రిల్ 2026
అధికారిక వెబ్‌సైట్: https://dpegujarat.in
పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ రిక్రూట్‌మెంట్ 2026 (PSPCL ALM)
పంజాబ్ విద్యుత్ శాఖలో పెద్ద రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ వచ్చింది. ఐటీఐ పాసైన యువతకు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడానికి ఇది మంచి ఛాన్స్.
మొత్తం ఖాళీలు: 3000
పోస్టు: అసిస్టెంట్ లైన్‌మెన్ (ALM)
అర్హత: 10వ తరగతి + ఐటీఐ (ఎలక్ట్రీషియన్/వైర్‌మెన్)
వయసు: 18-37 ఏళ్లు
జీతం: నెలకు ₹19,990
దరఖాస్తు చివరి తేదీ: 6 మే 2026
అధికారిక వెబ్‌సైట్: https://pspcl.in
ఉత్తరప్రదేశ్ సహకార సంస్థ బోర్డు రిక్రూట్‌మెంట్ 2026
ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్న వాళ్లకు ఉత్తరప్రదేశ్ సహకార సంస్థ బోర్డులో మంచి అవకాశం వచ్చింది. స్టెనోగ్రాఫర్‌తో పాటు చాలా పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కామర్స్, టెక్నికల్, మేనేజ్‌మెంట్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్లు దీనికి అప్లై చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 2085
పోస్టు: స్టెనోగ్రాఫర్ సహా వివిధ పోస్టులు
అర్హత: B.Com/B.Tech/BCA/MCA/BBA/MBA + O లెవెల్ (కంప్యూటర్)
వయసు: 18-40 ఏళ్లు (రిజర్వేషన్ ప్రకారం మినహాయింపు)
జీతం: నెలకు ₹25,620 నుంచి ₹1,77,500 వరకు
దరఖాస్తుల ప్రారంభం: 25 ఏప్రిల్ 2026
చివరి తేదీ: 15 మే 2026
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష / స్కిల్ టెస్ట్ (పోస్టును బట్టి)
అధికారిక వెబ్‌సైట్: https://upcbl.in