ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నిరుద్యోగుల‌కు బంప‌రాఫ‌ర్‌.. జ‌ర్మ‌నీలో ఉద్యోగం, నెల‌కు రూ. 2 ల‌క్ష‌ల‌కుపైగా జీతం

Published : Oct 31, 2025, 09:40 AM IST

Jobs: ఐటీఐ లేదా డిప్లొమా పూర్తిచేసిన వారికి కూడా జర్మనీ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో మంచి అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం కొత్త ప్రణాళికను ప్రారంభించింది. 

PREV
15
జర్మనీలో ఉద్యోగాలకు ప్రభుత్వం చర్యలు

ఉద్యోగావకాశాల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే యువతకు సాయపడేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ పర్యవేక్షణలో జర్మనీ కంపెనీలలో ఉద్యోగాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమం రూపొందించారు. అర్హత, అనుభవం ఉన్న ప్రతి అభ్యర్థికి సమాన అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఈ చర్యలు తీసుకున్నారు.

25
జర్మన్ భాష శిక్షణ – 12 నుంచి 14 వారాల ప్రోగ్రామ్‌

ఎంపికైన అభ్యర్థులకు ముందుగా జర్మన్ భాషలో శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణను A1, A2 అనే రెండు ద‌శల్లో నిర్వహిస్తారు. ప్రతి రోజు 8 గంటలపాటు సుమారు 3 నెలల పాటు క్లాసులు కొనసాగుతాయి. రాజమహేంద్రవరం కేంద్రంగా నవంబర్ నెలలో శిక్షణ ప్రారంభం కానుంది. A1 దశలో ప్రాథమిక భాషా పరిజ్ఞానం నేర్పిస్తారు. A2 దశలో భాషలో ప్రవేశం, మాట్లాడే నైపుణ్యాలపై దృష్టి సారిస్తారు. అభ్యర్థులు ఆహారం, వసతి, విమాన ప్రయాణం, వీసా ఖర్చులు ముందుగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఉద్యోగంలో చేరిన తర్వాత ఆరు నెలల వ్యవధిలో ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు.

35
అభ్యర్థుల ఎంపిక, దరఖాస్తు విధానం

జర్మనీ ఉద్యోగాలకు ఆసక్తి ఉన్నవారు apssdc.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌గా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుతో పాటు పాస్‌పోర్టు, విద్యార్హత సర్టిఫికెట్లు, జాబ్ ఎక్స్‌పీరియ‌న్స్ డాక్యూమెంట్స్ సమర్పించాలి. శిక్షణ రుసుము రూ.1.15 లక్షలు ఉండగా, దానిని మూడు వాయిదాల్లో చెల్లించవచ్చు.

45
శ్రీకాకుళంలో అవగాహన సదస్సు

శిక్షణ, ఎంపిక ప్రమాణాలు, అర్హతలపై వివరాలు అందించేందుకు శ్రీకాకుళం జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ కార్యాలయంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సు ద్వారా ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు.

55
అర్హతలు, వేతనాలు, ఇతర ప్రయోజనాలు

* అభ్యర్థి వయసు 30 ఏళ్లకు మించకూడదు.

* కనీసం రెండేళ్ల ఐటీఐ ఎలక్ట్రిషియన్ ట్రేడ్ లేదా మూడేళ్ల డిప్లొమా కోర్సు ఉత్తీర్ణత ఉండాలి.

* కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండాలి.

* ఎంపికైన వారికి నెలకు రూ. 2.60 లక్షల నుంచి రూ. 2.70 లక్షల వరకు జీతం లభిస్తుంది.

* రెండు సంవత్సరాల ఒప్పంద కాలంలో అదనపు పని గంటలకు వేతనం, వసతి సౌకర్యం, విదేశీ ప్రయాణ సాయం వంటి సదుపాయాలు కంపెనీ అందిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories