ఆగష్టు 25న భారీ జాబ్ మేళా.. 10th అర్హత ఉన్నవారు కూడా హాజరుకావొచ్చు.. జీతం ఎంతంటే ?

First Published Aug 23, 2021, 5:31 PM IST

ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో ఈనెల 25వ తేదీన అంటే బుధవారం గుంటూరులో భారీ జాబ్‌మేళాను నిర్వహించనున్నారు. గుంటూరు జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ జాబ్‌మేళా జరగనుంది. ఈ జాబ్‌మేళాలో 6 ప్రముఖ కంపెనీలు పాల్గొనున్నాయని జిల్లా ఉపాధి అధికారి డి.దుర్గా బాయి ఒక ప్రకటనలో తెలిపారు.

ఎస్‌ఎస్‌సీ/ఇంటర్/డిగ్రీ, ఐటీఐ (ఫిట్టర్‌, ఎలక్ట్రికల్‌, మెనాకిల్‌), /బీఎస్సీ కెమిస్ట్రీ, బీఎస్‌సీ/ఎంఎస్సీ, కెమిస్ట్రీ/మైక్రోబయాలజీ, జీఎన్‌ఎమ్‌/బీఎస్‌సీ (నర్సింగ్‌), బీటెక్‌/డిప్లొమా (మెకానికల్‌), ఎమ్‌బీఏ, బీకామ్‌ (కంప్యూటర్స్‌) పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగమేళాకు హాజరుకావొచ్చు.

ఈ ఉద్యోగమేళాలో పాల్గొనాలనుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆధార్‌ కార్డు, బయో డేటాతో ఈ నెల 25వ తేదీన ఉదయం 10 గంటలకు గుంటూరులోని జిల్లా ఉపాధి కార్యాలయ ప్రాంగణం, గుజ్జనగుండ్లలో హాజరుకావాల్సి ఉంటుంది.
 

పూర్తి వివరాల కోసం https://www.ncs.gov.in/ అధికారిక వెబ్‌పోర్టల్‌లో ఆన్‌లైన్‌ జాబ్‌ సీకర్‌గా ముందుగా రిజిస్టర్‌ చేసుకోవాలి. ఒకవేళ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోకపోతే నేరుగా ఆధార్‌తో పాటు విద్యార్హత సర్టిఫికెట్లతో హాజరుకావొచ్చని అధికారులు వెల్లడించారు.
 

click me!