ఇండియన్ నేవీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2021 విడుదల : దరఖాస్తు చేసుకోవడానికి చివరి అవకాశం

First Published | May 5, 2021, 2:28 PM IST

ఇండియన్ నేవీలో ఉద్యోగం చేయాలని కలలుకనే వారికి అద్భుతావకాశం.  భారత నావికాదళంలో ఆర్టిఫిషియల్ అప్రెంటిస్ (ఎఎ) అండ్ సీనియర్ సెకండరీ రిక్రూటర్స్ (ఎస్ఎస్ఆర్) పోస్టులకు నియామకం  కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

భారత నావికాదళంలో ఆర్టిఫిషియల్ అప్రెంటిస్ (AA) అండ్ సీనియర్ సెకండరీ రిక్రూటర్స్ (SSR) పోస్టుల నియామకానికి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హతగల అవివాహిత పురుష అభ్యర్థులు భారత నావికాదళం అధికారిక వెబ్‌సైట్ joinindiannavy.gov.in ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ 20 మే 2021.
undefined
నేవీ రిక్రూట్‌మెంట్ పోస్టుల వివరాలుఈ నియామక ప్రక్రియ ద్వారా ఆర్టిఫిషియల్ అప్రెంటిస్, సీనియర్ సెకండరీ రిక్రూటర్స్ ఖాళీలను భర్తీ చేయాలని భారత నావికాదళం ప్రతిపాదించింది.ఆర్టిఫిషియల్ అప్రెంటిస్ (AA) - 500సీనియర్ సెకండరీ రిక్రూటర్స్ (ఎస్ఎస్ఆర్) - 2000
undefined

Latest Videos


ఎంపిక ప్రక్రియక్వాలిఫైయింగ్ టెస్ట్ (10 + 2 పరీక్ష) ఆధారంగా రాత పరీక్ష, పిఎఫ్‌టి అభ్యర్థుల షార్ట్‌లిస్టింగ్ జరుగుతుంది. ఈ పోస్టులను రాష్ట్రాల వారీగా కేటాయించినందున కట్ ఆఫ్ మార్కులు ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి మారవచ్చు. రాత పరీక్ష హిందీ ఇంకా ఇంగ్లీష్ లో ఆబ్జెక్టివ్ రకం ఉంటుంది.ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ఆర్టిఫిషియల్ అప్రెంటిస్ (AA) : అభ్యర్థులు ఇంటర్ లో గణితం, ఫిజిక్స్ సబ్జెక్టులతో 60% లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి - (కెమిస్ట్రీ బయాలజీ కంప్యూటర్ సైన్స్).సీనియర్ సెకండరీ రిక్రూటర్స్ (ఎస్ఎస్ఆర్) : అభ్యర్థులు గణితం, ఫిజిక్స్ సబ్జెక్టులతో (కెమిస్ట్రీ బయాలజీ కంప్యూటర్ సైన్స్) 12 వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
undefined
వయోపరిమితి:అభ్యర్థుల వయోపరిమితి 17-20 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే పై పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 01 ఫిబ్రవరి 2001 నుండి 31 జూలై 2004 మధ్య జన్మించాలి.మెరిట్ జాబితా జూలై 23 న www.joinindiannavy.gov.in వెబ్‌సైట్‌లో లభిస్తుంది.ఇండియన్ నేవీ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తుడైరెక్ట్ లింక్https:www.joinindiannavy.gov.inenpagessr.html#
undefined
undefined
click me!