10వ తరగతి తరువాత ఏ కోర్సు బెస్ట్.. మంచి ఉద్యోగం, జీతం పొందాలంటే ఏం చెయ్యాలి ?

First Published | May 10, 2021, 4:55 PM IST

ఈ రోజుల్లో ఉద్యోగ ఆధారిత కోర్సులకు సంబంధించి విద్యార్థులలో మంచి ఆదరణ పెరుగుతోంది. 10వ తరగతి  తర్వాత విద్యార్ధుల కోసం చాలా డిప్లొమా కోర్సులు ఉన్నాయి.  వీటి తర్వాత మీరు మంచి ఉద్యోగం కూడా సంపాదించవచ్చు. డిప్లొమా కోర్సు  ప్రత్యేకత ఏమిటంటే కాల వ్యవధి తక్కువ అలాగే ఫీజు కూడా తక్కువ. 

మీరు 10వ తరగతి ఉత్తీర్ణులైన తర్వాత చేయగలిగే కొన్ని డిప్లొమా కోర్సుల గురించి తేలుసుకొండి. ఈ కోర్సుల ద్వారా మీకు కనీసం రూ.25 వేల నుండి రూ.30 వేల జీతం సులభంగా లభిస్తుంది. అంతేకాకుండ అనుభవంతో జీతం మరింత పెరుగుతుంది.
undefined
ఇంజనీరింగ్ డిప్లొమామీరు 10వ తరగతి తర్వాత ఇంజనీర్ కావాలని కలలు కంటున్నట్లయితే, మ్యాథ్స్ నుండి దూరంగా ఉంటే నాలుగేళ్ల బిటెక్ బదులు ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేయడం ద్వారా మీరు మంచి ఉద్యోగం పొందవచ్చు. చాలా ఇన్స్టిట్యూట్లు, పాలిటెక్నిక్ కళాశాలలు ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులను అందిస్తున్నాయి. వీటిని పూర్తి చేసిన తరువాత, మీకు మిడిల్ లెవల్ ఇంజనీరింగ్ ఉద్యోగాలు సులభంగా లభిస్తాయి. ఇంకా రైల్వేలో డైరెక్ట్ నియామకాలు అందించే చాలా విభాగాలు ఉన్నాయి.
undefined

Latest Videos


స్టెనోగ్రఫీ అండ్ టైపింగ్10వ తరువాత మీరు స్టెనోగ్రఫీలో డిప్లొమా లేదా వివిధ భాషలలో టైపింగ్ డిప్లొమా చేయవచ్చు. కోర్టులు, ఇతర ప్రభుత్వ విభాగాలలో ఈ కోర్స్ చేసిన అభ్యర్థుల కోసం నియామకాలు నిరంతరం ఉంటాయి. ఇందుకు స్టెనోగ్రఫీ తప్పనిసరి. అయితే ఈ ఉద్యోగాల కోసం హై-స్పీడ్ టైపింగ్ అంటే టైపింగ్ స్పీడ్ చాలా ముఖ్యం.
undefined
ఐటిఐ10వ తరగతి తర్వాత ఐటిఐ కూడా చేయవచ్చు. మీరు మీ స్వంతంగా వ్యాపారం లేదా ఏదైనా పని చేయాలనుకుంటే మీరు ఈ కోర్సును చేయడం ద్వారా మంచి డబ్బు సంపాదించవచ్చు. రైల్వేతో సహా కొన్ని ప్లాంట్లలో అద్భుతమైన ఉద్యోగావకాశాలు ఉన్నాయి.
undefined
కంప్యూటర్ హార్డ్ వేర్ అండ్ నెట్‌వర్కింగ్ప్రస్తుత టెక్నాలజి యుగంలో ప్రజలు ఎక్కువగా ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, మొబైల్‌లు, ఇతర టెక్నాలజి ఆధారిత పరికరాలను ఉపయోగిస్తున్నారు. దీంతో హార్డ్‌వేర్ నిపుణుల డిమాండ్ కూడా పెరుగుతోంది. మీరు కంప్యూటర్ హార్డ్ వేర్ అండ్ నెట్‌వర్కింగ్‌లో డిప్లొమా చేయడం ద్వారా మంచి ఉద్యోగం పొందవచ్చు. అలాగే మీరు స్వంత వ్యాపారాన్ని కూడా ప్రారంభించవచ్చు.
undefined
హోటల్ మేనేజ్‌మెంట్10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు హోటల్ మేనేజ్‌మెంట్ రంగంలో కెరీర్ ప్రారంభించడానికి హోటల్ మేనేజ్‌మెంట్ మంచి అవకాశం. ఒకటిన్నర సంవత్సరాల డిప్లొమా కోర్సు తరువాత హోటల్ మేనేజ్‌మెంట్ రంగంలో ఉద్యోగం పొందవచ్చు. మీరు ఒకటి కంటే ఎక్కువ భాషలను అర్థం చేసుకొని నేర్చుకుంటే చాలా ఉపయోగకరంగా అలాగే ప్రయోజనకరంగా ఉంటాయి.
undefined
పారా మెడికల్ కోర్సు10వ తరగతి తరువాత వైద్య రంగంలో మంచి వృత్తిగా చేసుకోవచ్చు. ఇందులో ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, రేడియోగ్రఫీ, ఎక్స్‌రే టెక్నాలజీ, ఇసిజి టెక్నాలజీ, డయాలసిస్ టెక్నాలజీ, మెడికల్ ఇమేజింగ్, మెడికల్ రికార్డ్ టెక్నాలజీ వంటి సబ్జెక్టుల్లో డిప్లొమా కోర్సులు చేయవచ్చు. పారా మెడికల్‌లో డిప్లొమా చేసిన తరువాత ల్యాబ్ టెక్నీషియన్ లేదా ల్యాబ్ అసిస్టెంట్‌గా ఉద్యోగం లభిస్తుంది. తరువాత, సంవత్సరానికి 2 లక్షల నుండి 5 లక్షల రూపాయల ప్యాకేజీపై ఉద్యోగాలు సులభంగా లభిస్తాయి.
undefined
డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్విద్యార్థులు మొదటి నుండి యానిమేషన్, డిజైనింగ్, ప్రోగ్రామింగ్, గ్రాఫిక్స్, విజువలైజేషన్ వంటి రంగాలపై ఆసక్తి ఉన్నా వారు డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్ కోర్సు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 10వ తరగతి తరువాత ఫైన్ ఆర్ట్స్‌లో ఐదేళ్ల డిప్లొమా కోర్సు ఉంది. దీని తరువాత ప్రారంభ వేతనం కింద నెలకు రూ.25 నుండి రూ.30 వేలు జీతం లభిస్తుంది.
undefined
ఈ కోర్సులు కూడా మంచి ఆప్షన్ డిప్లొమా ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీడిప్లొమా ఇన్ లెథర్ టెక్నాలజిడిప్లొమా ఇన్ గార్మెంట్ టెక్నాలజీడిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీడిప్లొమా ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్డిప్లొమా ఇన్ మెరైన్ ఇంజనీరింగ్‌డిప్లొమా ఇన్ ప్రొడక్షన్డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ టెక్నాలజీడిప్లొమా ఇన్ టెక్స్‌టైల్ టెక్నాలజీ
undefined
డిప్లొమా ఇన్ బ్యూటీ కల్చర్డిప్లొమా ఇన్ బయోటెక్నాలజీడిప్లొమా ఇన్ ఆర్కిటెక్చర్‌డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్డిప్లొమా ఇన్ అపెరల్ డిజైనింగ్‌డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్‌డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీడిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ
undefined
click me!