ఇండియా పోస్ట్ GDS ఖాళీలు 2025
ఇండియా పోస్ట్ అంటే ఇండియన్ పోస్టల్ డిపార్ట్‌మెంట్ మొత్తం 21413 గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టులకు ఉద్యోగాలను విడుదల చేసింది. దీని కోసం మీరు ఎటువంటి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఇవ్వనవసరం లేదు, అయితే ఈ పోస్టులకు ఎంపిక మెరిట్ ఆధారంగా ఉంటుంది. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ నియామకం 10వ తరగతి పాస్ అయితే చాలు.
మీరు ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలను indiapostgdsonline.gov.in లో తెలుసుకోవచ్చు. ఇక్కడ నుండి ఆన్‌లైన్ దరఖాస్తు కూడా చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 3. కాబట్టి చివరి తేదీ కోసం చూడకుండా.. వెంటనే దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.100గా నిర్ణయించగా, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు ఎటువంటి రుసుము లేదు.