పదేళ్ల తర్వాత మళ్లీ ఏడాది బిఈడి కోర్సు :
నరేంద్ర మోదీ ప్రభుత్వం 2014 అధికారంలోకి రాగానే విద్యావ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే పాఠశాలల్లో విద్యాప్రమాణాలు పెంచాలని నిర్ణయించిన ప్రభుత్వం ఉపాధ్యాయులకు మరింత శిక్షణ అవసరమని భావించిది. దీంతో టీచర్ అర్హతా విద్యాభ్యాసం బిఈడి కోర్సును ఏడాది నుండి రెండేళ్లకు పెంచింది.
ఇలా గత పదేళ్లుగా బిఈడి రెండేళ్ల కోర్సు మాత్రమే అందుబాటులో వుంది. అయితే ప్రస్తుతం అభ్యర్థుల నుండి వస్తున్న అభ్యర్థన మేరకు మళ్ళీ ఏడాది బిఈడి కోర్సును అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ వన్ ఇయర్ బిఈడి కోర్స్ రూపకల్పన కోసం ఎనిమిది సభ్యుల ప్యానెల్ ను ఏర్పాటుచేసారు. దీని సిపార్సుల మేరకే ఈ కోర్సును తిరిగి అందుబాటులోకి తీసుకువస్తోంది ఎన్సిటీఈ.