ఎలాంటి పోటీ పరీక్ష లేదు... రూ.1,42,400 సాలరీలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, వెంటనే అప్లై చేపుకొండి

Published : Oct 27, 2025, 10:40 AM IST

Intelligence Bureau Recruitment 2025 : దేశానికి నేరుగా సేవచేసే అవకాశం కొందరు ఉద్యోగులకు మాత్రమే లభిస్తుంది. అలాంటి ఓ విభాగంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఎలాంటి పోటీపరీక్ష లేకుండానే ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

PREV
18
ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు

Intelligence Bureau Jobs : నిరుద్యోగ యువతకు అద్భుత అవకాశం ... కేంద్ర హోంశాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. ప్రతిష్టాత్మకమైన కేంద్ర నిఘా సంస్థ ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) లో టెక్నికల్ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. మొత్తం 258 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ACIO) గ్రేడ్-2 ఉద్యోగాల భర్తీకి ఐబి నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలాంటి పోటీపరీక్ష లేకుండా కేవలం మెరిట్, స్కిల్ టెస్ట్ ఆధారంగానే ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు... కాబట్టి యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

28
ముఖ్యమైన తేదీలు

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 25 అక్టోబర్ 2025

దరఖాస్తు చేసుకోడానికి చివరితేదీ : 16 నవంబర్ 2025

దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇంటర్వ్యూ తేదీని ప్రకటిస్తారు. 

38
పోస్టులు, రిజర్వేషన్ల వారిగా ఖాళీలు
  1. కంప్యూటర్ సైన్స్ ఆండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో మొత్తం 90 ఖాళీలున్నాయి.
  • అన్ రిజర్వుడ్ - 40
  • ఈడబ్యుఎస్ - 7
  • ఓబిసి - 24
  • ఎస్సి - 13
  • ఎస్టి - 6

2. ఎలక్ట్రానిక్స్ ఆండ్ కమ్యూనికేషన్ విభాగంలో 168 పోస్టుల భర్తీ

  • అన్ రిజర్వుడ్ - 74
  • ఈడబ్యుఎస్ - 14
  • ఓబిసి - 44
  • ఎస్సి - 24
  • ఎస్టి - 12

మొత్తంగా ఐబిలో 258 పోస్టులకు రిజర్వేషన్లు

  • అన్ రిజర్వుడ్ - 114
  • ఈడబ్యుఎస్ - 21
  • ఓబిసి - 68
  • ఎస్సి - 37
  • ఎస్టి - 18
48
విద్యార్హతలు

కేంద్ర నిఘా సంస్థ ఐబిలో టెక్నికల్ పోస్టులను దరఖాస్తు చేసేవారు ఎలక్ట్రానిక్స్ ఆండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్ ఆండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో GATE 2023 లేదా 2024 క్వాలిఫై అయివుండాలి.

ఎలక్ట్రానిక్స్ ఆండ్ టెలీకమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ ఆండ్ కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రికల్ ఆండ్ ఎలక్ట్రానిక్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ సైన్స్ ఆండ్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి వుండాలి. ప్రభుత్వ గుర్తింపుపొందిన యూనివర్సిటీ లేదా విద్యాసంస్థ నుండి ఇది పూర్తిచేసివుండాలి.

ఎలక్ట్రానిక్స్ ఆండ్ కంప్యూటర్ సైన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ ఫిజిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ ఆండ్ కమ్యూనికేషన్ లో మాస్టర్ డిగ్రీ చేసివుండాలి. కంప్యూటర్ అప్లికేషన్స్ లో మాస్టర్ డిగ్రీ చేసినవారు అర్హులే.

58
వయోపరిమితి

ఈ ఉద్యోగాలకు 18 నుండి 27 ఏళ్ల వయసువారు అర్హులు. 16 నవంబర్ 2025 నాటికి వయసును పరిగణలోకి తీసుకుంటారు.

ఎస్సి, ఎస్టిలకు 5 ఏళ్ళు, ఓబిసిలకు 3 ఏళ్ళ సడలింపు ఉంటుంది. వితంతువులు, భర్తతో విడిపోయి ఒంటరిగా జీవిస్తున్న మహిళలకు కూడా వయోపరిమితి సడలింపు ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్స్ కు కూడా సడలింపు ఉంటుంది.

68
దరఖాస్తు ప్రక్రియ, ఫీజు

దరఖాస్తు చేసేముందే ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ తో పాటు విద్యా, ఇతర అర్హతలకు సంబంధించిన పత్రాలు రెడీగా పెట్టుకొండి. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారిక వెబ్ సైట్ https://www.mha.gov.in/en ఓపెన్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం ఆన్లైన్ లోనే దరఖాస్తులను స్వీకరిస్తారు.

అన్ని కేటగిరీల అభ్యర్థులకు రూ.100 రిక్రూంట్మెంట్ ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. ఇక మగవారు, అన్ రిజర్వుడ్, ఈడబ్ల్యుఎస్, , ఓబిసి అభ్యర్థులకు అదనంగా మరో రూ.100 ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది... మొత్తంగా వీరు రూ.200 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి.

78
ఎంపిక ప్రక్రియ

అభ్యర్థులను GATE స్కోర్ (2023/2024/2025) ఆధారంగా ఎంపిక చేస్తారు. తర్వాత స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఉంటాయి. మొత్తం 1175 మార్కులకు గాను గేట్ స్కోరు 750 మార్కులు, స్కిల్ టెస్ట్ 250 మార్కులు, ఇంటర్వ్యూకి 175 మార్కులుంటాయి.

88
సాలరీ

నెలనెలా రూ.44,900 నుండి రూ.1,42,400 వరకు సాలరీ వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు లభించే అలవెన్సులు వర్తిస్తాయి. మంచి సాలరీతో కూడిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను పొందడంద్వారా లైఫ్ లో సెటిల్ కావడమే కాదు సమాజంలో గౌరవం కూడా లభిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories