ఎలాంటి పోటీ పరీక్ష లేదు.. కేవలం అప్లై చేసుకుంటే చాలు కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం

Published : Oct 18, 2025, 01:38 PM IST

Government Jobs : కేవలం దరఖాస్తు చేసుకుంటే చాలు… ఎలాంటి రాత పరీక్ష లేకుండానే కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలో ఉద్యోగాన్ని పొందే అద్భుత అవకాశం. ఇంకెందుకు ఆలస్యం… వెంటనే అప్లై చేసుకొండి.  

PREV
18
పరీక్ష లేకుండానే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్

Government Jobs : నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. కేంద్ర కేంద్ర రక్షణ శాఖ పరిధిలోని పలు ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడింది. అర్మర్డ్ వెహికిల్స్ నిగమ్ లిమిటెడ్ (AVNL) యూనిట్ అయిన అవధి ఇంజన్ ఫ్యాక్టరీ (Engine Factory, Avadi) లో 20 ఖాళీలను భర్తీ చేయనున్నారు. డిగ్రీలు పూర్తిచేసి ఉద్యోగాలకోసం ఎదురుచూస్తున్న యువతకు ఇది అద్భుత అవకాశం. మీకు అన్ని అర్హతలుంటే వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొండి... ఎలాంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ, మెరిట్ ఆధారంగానే నియామకాలు చేపడుతున్నారు కాబట్టి ఈజీగా ఉద్యోగాన్ని పొందవచ్చు.

28
పోస్టుల వివరాలు

కేంద్ర రక్షణ శాఖ పరిధిలోని AVNL లో 5 ఉత్పత్తి యూనిట్స్ ఉన్నాయి... దాదాపు 12,000 మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇండియన్ ఆర్మీకి చెందిన యుద్ద ట్యాంకులు T-72, T-90, MBT Arjun, MPV,AEPV వంటివి ఈ సంస్థ తయారుచేస్తుంది. అయితే ప్రస్తుతం అవధి ఇంజిన్ ఫ్యాక్టరీలో ఖాళీలను భర్తీ చేస్తున్నారు... ఏఏ పోస్టులను భర్తీకి ప్రకటన వెలువడిందో తెలుసుకుందాం.

1. జూనియర్ మేనేజర్ (డిజైన్ & డెవలప్మెంట్, లీగల్, ప్రొడక్షన్, క్వాలిటీ, సేప్టీ, మార్కెటింగ్ & ఎక్స్పోర్ట్) ఉద్యోగాలు -13 ఖాళీలు

2. అసిస్టెంట్ మేనేజర్ (డిజైన్ & డెవలప్మెంట్, మెకానికల్ మెయింటెనెన్స్) - 07 ఖాళీలు

మొత్తంగా అవధి ఇంజిన్ ఫ్యాక్టరీలో 20 ఖాళీలను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.

38
వయోపరిమితి

పైన చెప్పిన పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు కనీసం 18 ఏళ్లు పూర్తి చేసుకుని, గరిష్టంగా 40 ఏళ్లకు మించకుండా ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఎస్సి, ఎస్టి, ఓబిసి, ఈడబ్ల్యుఎస్, దివ్యాంగులకు వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.

48
విద్యార్హతలు

డిప్లొమా (Diploma), బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ (B.E/B.Tech), ఎంబిఏ లేదా ఎల్ఎల్బి లాంటి కోర్సులు పూర్తి చేసినవాళ్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

58
ఎంపిక విధానం

ఈ ఉద్యోగాల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేకపోవడం ఒక పెద్ద ప్లస్ పాయింట్. అభ్యర్థుల విద్యార్హత, అనుభవం ఆధారంగా ఒక మెరిట్ లిస్ట్ (Merit List) తయారు చేసి, ఆ తర్వాత ఇంటర్వ్యూ (Interview/Interaction) ద్వారా అర్హులైన వాళ్లను ఎంపిక చేస్తారు.

68
దరఖాస్తు విధానం

అర్హులైన అభ్యర్థులు www.ddpdoo.gov.in లేదా www.avnl.co.in అనే అధికారిక వెబ్‌సైట్‌లో ఇచ్చిన దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. నింపిన దరఖాస్తుతో పాటు అవసరమైన అన్ని డాక్యుమెంట్ల సెల్ఫ్-అటెస్టెడ్ (self-attested) కాపీలను జతచేయాలి. తర్వాత దరఖాస్తు ఫీజుతో (అవసరమైతే) ఫారమ్ ను పోస్టులో (Ordinary Post) మాత్రమే పంపాలి.

దరఖాస్తు పంపాల్సిన చిరునామా:

The Chief General Manager,

Engine Factory, Avadi,

Chennai – 600 054.

పోస్ట్ కవర్ మీద "Name of the Post applied for" అని రాసి, మీరు దరఖాస్తు చేస్తున్న పోస్టు పేరును స్పష్టంగా పేర్కొనాలి.

దరఖాస్తు ఫీజు:

మహిళలు, ఎస్సి/ఎస్టి వర్గాలు, మాజీ సైనికులు, దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు లేదు. ఇతర వర్గాల అభ్యర్థులు రూ.300/- ఫీజుగా చెల్లించాలి.

78
దరఖాస్తుకు ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు ప్రారంభ తేదీ : 11 అక్టోబర్ 2025

దరఖాస్తుకు చివరి తేదీ : 31 అక్టోబర్ 2025

అర్హులైన వాళ్లు చివరి తేదీ వరకు ఆగకుండా వెంటనే దరఖాస్తు చేసి కేంద్ర ప్రభుత్వ సంస్థలో పనిచేసే అవకాశాన్ని పొందవచ్చు. దరఖాస్తు చేసేముందు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి నిర్ధారించుకోండి.

88
సాలరీ

జూనియర్ మేనేజర్ (Junior Manager) : నెలకు రూ.30,000/- జీతం ఇస్తారు.

అసిస్టెంట్ మేనేజర్ (Assistant Manager) : నెలకు రూ.40,000/- జీతం ఇస్తారు.

గమనిక : పైన పేర్కొన్న పోస్టులను కాంట్రాక్ట్ పద్దతిలో నిర్ణీత కాలానికి మాత్రమే నియమిస్తున్నారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించగలరు.

Read more Photos on
click me!

Recommended Stories