Andhra Pradesh Jobs
Andhra Pradesh Jobs : ఆంధ్ర ప్రదేశ్ యువతకు గుడ్ న్యూస్. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇప్పటికే మెగా డిఎస్సిపై క్లారిటీ వచ్చేసింది... వేలాది టీచర్ పోస్టులను వచ్చే అకడమిక్ ఇయర్ నాటికి భర్తీ చేస్తామని స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇక గత ప్రభుత్వం విడుదలచేసిన 6100 టీచర్ పోస్టుల భర్తీని ఈ ప్రభుత్వం ముందుకు తీసుకువెళుతోంది. ఇలా హోం, విద్యాశాఖతో పాటు అన్ని శాఖల్లోని ఖాళీల భర్తీకి ఏపీ ప్రభుత్వం కసరత్తు చేసింది.
తాజాగా వైద్యారోగ్య శాఖలో ఖాళీల భర్తీకి ఏపీ ప్రభుత్వం సిద్దమయ్యింది. ల్యాబ్ టెక్నీషియన్ 2, ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ (FNO), సానిటరీ అటెండర్ కమ్ వాచ్ మెన్ (SAW) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఏపీ హెల్త్ మెడికల్ ఆండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ మొత్తం 61 పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.
ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలచేసి అర్హులు, ఆసక్తిగల అభ్యర్థుల నుండి దరఖాస్తుల స్వీకరణ కూడా ప్రారంభమయ్యింది. ఎలాంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే కేవలం మెరిట్ ఆధారంగానే ఉద్యోగాల భర్తీ చేపడుతున్నారు. కాబట్టి ఇవి ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలే అయినప్పటికీ పోటీ ఎక్కువగా వుండనుంది.
ఈ ఉద్యోగాలకు మీరు అర్హులో కాదో తెలుసుకొండి. అలాగే దరఖాస్తు ప్రక్రియ కూడా తెలుసుకొండి. మీకు అన్ని అర్హతలు కలిగివుంటే వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి ఈ జాబ్స్ కు సంబంధించిన వివరాలను తెలియజేస్తున్నాం.
Andhra Pradesh jobs
భర్తీచేయనున్న ఉద్యోగాలు, ఖాళీలు :
1. ల్యాబ్ టెక్నిషియన్ గ్రేడ్ 2 - 3 పోస్టులు
2. ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ - 20 పోస్టులు
3. శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ - 38 పోస్టులు
విద్యార్హతలు :
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్, డిప్లమా, డిగ్రీ పాసయి వుండాలి.
ల్యాబ్ టెక్నిషియన్ గ్రేడ్ 2 ఉద్యోగానికి ఇంటర్మీడియట్+డిప్లమా లేదా బ్యాచిలర్ డిగ్రీ/ మాస్టర్ డిగ్రీ ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ పూర్తిచేసివుండాలి (ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీల నుండి ఈ సర్టిఫికెట్స్ పొందివుండాలి. ఇక ఇంటర్ (వొకేషనల్) పూర్తిచేసి ప్రభుత్వ గుర్తింపుపొందిన సంస్థలో ఏడాది అప్రెంటిస్ చేసినవారు కూడా అర్హులే.
ఇక ఫీమెయిల్ నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులకు 10వ తరగతి లేదా అందుకు సమానమైన చదువు వుండాలి. ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ వుండాలి. సానిటరీ అటెండర్ కమ్ వాచ్ మెన్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణత సాధించివుంటే చాలు.
వయో పరిమితి :
అభ్యర్థులు 18 నుండి 42 ఏళ్లలోపు అభ్యర్థులు అర్హులు. అయితే ఎస్సి, ఎస్టి, బిసి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు వుంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్స్ కు అదనంగా 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల వయసు సడలింపు వుంటుంది. మొత్తంగా గరిష్ట వయోపరిమితి 52 ఏళ్లు.
సాలరీ :
ఉద్యోగాన్ని బట్టి నెలకు రూ.15,000 నుండి రూ.32,600 వరకు సాలరీ వుంటుంది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు కాబట్టి అలవెన్సులు వుండవు.