
Jobs Notifications in 2025 January : ఉద్యోగ ప్రయత్నాల్లో వున్న యువతీయువకులకు ఈ 2025 ఆరంభమే అదిరిపోయింది. ఈ జనవరిలోనే మంచిమంచి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే అనేక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు బ్యాంకింగ్, ప్రైవేట్ రంగాల్లో కూడా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఇలా ఈ జనవరిలో పలు ఉద్యోగాలకు అప్లికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.
మీరు కూడా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నట్లయితే ఈ నెలలో ఏఏ ఉద్యోగాల భర్తీ కొనసాగుతుందో తెలుసుకొండి. మీ విద్యార్హతలకు సరిపోయే ఉద్యోగాన్ని గుర్తించండి. వెంటనే మీకు ఆసక్తిగల గల ఉద్యోగానికి దరఖాస్తు చేసుకొండి. గట్టిగా ప్రయత్నించి ఉద్యోగాన్ని సాధించడంద్వారా లైఫ్ లో సెట్ కావచ్చు.
ఈ జనవరి 2025 లో అప్లికేషన్ ప్రక్రియ కొనసాగుతున్న ఉద్యోగాలు :
1. తెలంగాణ హైకోర్ట్ జాబ్స్ (Telangana High Court Jobs) :
తెలంగాణలోని అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుతో పాటు జిల్లా కోర్టులు, న్యాయశాఖలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. టెక్నికల్, నాన్ టెక్నికల్ విభాగాల్లో మొత్తం 1,673 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
దరఖాస్తు ప్రక్రియ 08-01-2025 ప్రారంభమైంది.
ఆన్ లైన్ అప్లికేషన్ చివరి తేదీ - 31-01-2025 చివరితేదీ (పోస్టులవారిగా పరీక్షలు, ఇతర ప్రక్రియకు తేదీల్లో మార్పులు వున్నాయి. కానీ అప్లికేషన్ ప్రారంభం, చివరితేదీ ఒకటే)
విద్యార్హతలు : 7 వ తరగతి నుండి టెన్త్, ఇంటర్, డిగ్రీ, పిజీ అర్హతలో ఉద్యోగాలున్నాయి
సాలరీ : రూ.19 వేల నుండి 1,30,000 వరకు వేరువేరు పోస్టులకు వేరువేరుగా జీతాలున్నాయి.
దరఖాస్తు, ఇతర సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్ https://tshc.gov.in ను సంప్రదించండి.
2. ఆంధ్ర ప్రదేశ్ లో నర్సింగ్ ఉద్యోగాలు (AP Staff Nursing Posts) :
ఆంధ్ర ప్రదేశ్ లోని వివిధ జిల్లాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖళీల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది, వైద్యారోగ్య శాఖ స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జోన్ 3 లో మొత్తం 44 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇందులో తెనాలి 6, బాపట్ల 10, నరసరావుపేట 24, గురజాల 1, కందుకూరు 1, ఆత్మకూరు 1, రాపూరు 1 పోస్టును భర్తీ చేపట్టారు.
ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.
దరఖాస్తులకు చివరితేదీ జనవరి 15, 2025 ... ఆలోపూ అప్లికేషన్స్ స్వీకరిస్తారు.
విద్యార్హతలు : జనరల్ నర్సింగ్ ఆండ్ మిడ్వైఫరీ (GNM) లేదా బిఎస్సి నర్సింగ్ చేసినవారు అర్హులు.
మరింత సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ http://cfw.ap.nic.in ను సందర్శించండి.
3. రైల్వే జాబ్స్ (Railway Jobs)
భారతీయ రైల్వో ఉద్యోగం చాలామంది యువత కల. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థల్లో ఒకటైన రైల్వేలు సాలరీలు బాగుంటాయి. అందువల్లే ఇందులో చిన్న ఉద్యోగం వచ్చినా లైఫ్ లో సెటిల్ కావచ్చని చాలామంది అనుకుంటారు. ఇలాంటివారికి ఈ నెలలో మంచి అవకాశం వచ్చింది. రైల్వేలో 1,036 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది.
రైల్వేలొ జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, వెల్ఫేర్ ఇన్స్పెక్టర్, చీఫ్ లా అసిస్టెంట్, కుక్, PGT, TGT, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ (మేల్ & ఫిమేల్), అసిస్టెంట్ మిస్ట్రెస్ (జూనియర్ స్కూల్), మ్యూజిక్ మిస్ట్రెస్, డాన్స్ మిస్ట్రెస్, లాబొరేటరీ అసిస్టెంట్ (స్కూల్), హెడ్ కుక్, ఫింగర్‌ప్రింట్ ఎగ్జామినర్ వంటి పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది.
దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలయ్యింది.
దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 6, 2025.
విద్యార్హతలు : ఇంటర్మీడియట్,డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హతలతో ఉద్యోగాల భర్తీ కొనసాగుతోంది.
ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ rrbapply.gov.in ద్వారా దరఖాస్తు, ఇతర సమాచారం గురించి చేసుకోవచ్చు.
4. కెనరా బ్యాంక్ ఉద్యోగాలు (Canara Bank Jobs) :
ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఈ జనవరి 2025లో భారీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇలా కెనరా బ్యాంకులో కూడా లక్షల సాలరీతో ఉన్నత ఉద్యోగాల భర్తీ కొనసాగుతోంది.
జాబ్, ఖాళీలు : స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు 60 ఫిల్ చేస్తున్నారు.
దరఖాస్తుల స్వీకరణ జనవరి 6, 2025 నుండి ప్రారంభమయ్యింది.
దరఖాస్తుల చివరితేదీ : జనవరి 24, 2025
సాలరీ : రూ.1,50,000 నుండి 2,25,000 వరకు వుంటుంది.
విద్యార్హతలు : ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ పూర్తిచేసినవారు అర్హులు
5. HDFC బ్యాంక్ ఉద్యోగాలు (HDFC Bank Jobs) :
ప్రైవేట్ రంగ బ్యాంక్ HDFC కూడా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రిలేషన్ షిప్ మేనేజర్ రిక్రూట్ మెంట్ ను చేపడుతోంది.
దరఖాస్తులు ప్రారంభం : డిసెంబర్ 30, 2024 లో ప్రారంభమైంది.
దరఖాస్తుల చివరితేది : ఫిబ్రవరి 7, 2025
విద్యార్హతలు : కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ పూర్తిచేసి వుండాలి.
సాలరీ :రూ.3,00,000 నుండి రూ.12,00,000 వరకు జీతంతో పాటు ఇతర అలవెన్సులు వుంటాయి.