
Airport Jobs : నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్. ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) దేశంలోని వివిధ విమానాశ్రయాల్లో ఉద్యోగాల భర్తీ చేపడుతోంది. విమానాలను నియంత్రించే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగంలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసారు. మొత్తం 309 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగం, మంచి సాలరీ ఉండటంతో ఈ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటినుండి ఈ ఉద్యోగాల భర్తీకోసం నిర్వహించే పరీక్ష కోసం ప్రిపేర్ కావడం మంచిది. సిలబస్, ఎంపిక ప్రక్రియ గురించి తెలుసుకుంటే ఉద్యోగం కోసం సన్నద్దంకావచ్చు. కాబట్టి ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ అందిస్తున్నాం.
దరఖాస్తు ప్రక్రియ :
ఎయిర్పోట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీ షెడ్యూల్ ను ప్రకటించింది. ఈ నెలలోనే అంటే ఏప్రిల్ 2025 లోనే నియామక ప్రక్రియ ప్రారంభం కానుంది. త్వరలోనే ఆన్ లైన్ లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభంకానుంది.
ముఖ్యమైన తేదీలు :
ఎఎఐ ఎటిసి నోటిఫికేషన్ రిలీజ్ ; ఏప్రిల్ 4, 2025
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : ఏప్రిల్ 25, 2025
దరఖాస్తుల స్వీకరణకు చివరితేది : మే 24, 2025
అప్లికేషన్ ఫీజు చెల్లింపుకు చివరితేదీ : మే 24, 2025
పరీక్ష తేదీలు : నోటిఫికేషన్ లో పరీక్షల తేదీని పేర్కొనలేదు. త్వరలోనే ప్రకటించే అవకాశాలున్నాయి.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ఎయిర్పోట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్ సైట్ https://aai.aero/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని అర్హతలు కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 25 నుండి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలా దరఖాస్తు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం.
వెబ్ బ్రౌజర్ లో ఎఎఐ అధికారిక వెబ్ సైట్ https://aai.aero/ ఓపెన్ చేయండి.
హోమ్ పేజ్ పై కెరీర్ ను ఎంపిక చేసుకొండి.
రిక్రూట్ మెంట్ ప్రకటనపై క్లిక్ చేయండి. ''Direct Recruitment of Junior Executives in Various Disciplines in Airport Authority of india under Advertisement No.01/2025/CHQ''లేదా Recruitment Notification (Advt. 01/2025/NR) for filling up vacancies in Non-Executive cadres in Northern Region-AAI పై క్లిక్ చేయండి.
ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి ఓపెన్ చేయండి
ఇందులో మీ పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, ఇతర వివరాలతో అప్లికేషన్ ఫారం నింపండి. మీ విద్యార్హతలను కూడా ఫిల్ చేయండి. అవసరమైన డాక్యుమెంట్స్, ఫోటో, సంతకం అప్ లోడ్ చేయండి.
అప్లికేషన్ ఫీజును ఆన్ లైన్ లో చెల్లించండి.
ఈ ప్రక్రియలన్నీ ముగిసాక సబ్మిట్ చేయండి. ఈ దరఖాస్తు ఫారంను భవిష్యత్ అవసరాల కోసం డౌన్లోడ్ చేసుకొండి.
దరఖాస్తు ఫీజు :
ఎఎఐ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ రిక్రూట్ మెంట్ 2025 కు అప్లై చేయాలనుకునేవారు ఆన్ లైన్ లో దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎస్సి, ఎస్టి, మహిళ, పిడబ్ల్యుడి అభ్యర్థులకు ఎలాంటి ఫీజు ఉండదు. ఇతర కేటగిరి అభ్యర్థులు మాత్రం రూ.1000 దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
రిజర్వేషన్ల వారిగా ఫోస్టులు :
అన్ రిజర్వుడ్ : 125 పోస్టులు
ఈడబ్ల్యూఎస్ : 30 పోస్టులు
ఓబిసి : 72 పోస్టులు
ఎస్సి : 55 పోస్టులు
ఎస్టి : 27 పోస్టులు
ఎఎఐ ఎటిసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు విద్యార్హతలు :
అభ్యర్థులు బ్యాచిలర్ డిగ్రీ (B.Sc) పూర్తిచేసివుండాలి. ఖచ్చితంగా ఫిజిక్స్ మరియు మ్యాథ్స్ సబ్జెక్ట్స్ తో డిగ్రీ పూర్తిచేసివుండాలి. ఈ సబ్జెక్టులతో ఇంజనీరింగ్ పూర్తిచేసినవారు కూడా అర్హులే (ఏదయినా సెమిస్టర్ లో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్ ఉండాలి). ప్రభుత్వ గుర్తింపుపొందిన యూనివర్సిటీ, విద్యాసంస్థల నుండి ఈ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
వయో పరిమితి :
ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా భర్తీ చేయనున్న ఎటిసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తు అభ్యర్థుల 27 ఏళ్లలోపు ఉండాలి.
అయితే ఎస్సి, ఎస్టి అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబిసి అభ్యర్థులకు 3 ఏళ్లు, పిడబ్ల్యుడి అభ్యర్థులకు 10 ఏళ్లు సడలింపు ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్స్ కు కూడా ప్రభుత్వ నిబంధనలకు లోబడి సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక ప్రక్రియ :
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ముందుగా అప్లికేషన్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత కంప్యూటర్ బేస్డ్ ఆన్ లైన్ టెస్ట్ ఉంటుంది. తర్వాత వాయిస్ టెస్ట్, సైకోటిక్ సబ్టాన్సెస్ టెస్ట్, సైకలాజికల్ అస్సెస్ మెంట్ టెస్ట్, మెడికల్ టెస్ట్, బ్యాగ్రౌండ్ వెరిఫికేషన్ ఉంటుంది.
పరీక్ష విధానం :
ఎఎఐ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల కోసం నిర్వహించే కంప్యూటర్ బెసుడ్ పరీక్ష 120 మార్కులకు ఉంటుంది. మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి.
పార్ట్ ఎ, పార్టీ బి గా పరీక్ష ఉంటుంది. ఈ పార్ట్ ఎ లో ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ ఇంటెలిజెన్స్/రీజనింగ్, జనరల్ అప్టిట్యూడ్/న్యూమరిక్ అప్టిట్యూడ్ ఆండ్ జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. పార్ట్ బి లో మ్యాథ్స్ మరియు ఫిజిక్స్ కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి.
120 ప్రశ్నలకు 120 నిమిషాల సమయం ఉంటుంది. అంటే ఒక్కో ప్రశ్నకు ఒక్కో నిమిషం సమయం.
ప్రతి సరైన జవాబుకు 1 మార్కు ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ ఉండదు.
హింది లేదా ఇంగ్లీష్ లో పరీక్ష ఉంటుంది.
సాలరీ :
ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎయిర్ ట్రాపిక్ కంట్రోల్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు మంచి సాలరీ ఉంటుంది. నెలకు రూ.40,000 నుండి 1,40,000 వరకు జీతం ఉంటుంది. అనుభవం పెరుగుతున్నకొద్దీ సాలరీ పెరుగుతుంది. ప్రారంభంలో కూడా మంచి సాలరీతో పాటు ఇతర అలవెన్సులు ఉంటాయి.