బీటెక్ యువతకు సూపర్ ఛాన్స్ .. దిగ్గజ ఐటీ కంపెనీలో ప్రెషర్స్ కి ఉద్యోగావకాశాలు, లక్షల్లో సాలరీ

Published : Oct 27, 2025, 05:01 PM IST

Software Jobs : డిగ్రీలు పూర్తిచేసి ఉద్యోగాన్వేషణలో ఉన్న యువతకు అద్భుత అవకాశం. ఎలాంటి అనుభవం లేకున్నా ప్రెషర్స్ కి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు జోహో ముందుకు వచ్చింది. 

PREV
16
జోహోలో ప్రెషర్స్ కి ఉద్యోగాలు

Software Jobs : భారతీయ ఐటీ దిగ్గజం జోహో ఈమధ్య కాలంలో బాగా వార్తల్లో నిలుస్తోంది. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి అంతర్జాతీయ ఐటీ దిగ్గజాలకు పోటీగా నిలిచే సర్వీసెస్ ను  అందిస్తున్న పక్కా ఇండియన్ కంపెనీ ఇది. ఇలాంటి ప్రతిష్టాత్మక కంపెనీలో ఉద్యోగం చేసే అవకాశం మీకు వచ్చింది. ఎక్కడా ఉద్యోగంచేసిన అనుభవం లేకపోయినా సరే... అంటే ప్రెషర్స్ కి కూడా జోహో అవకాశం కల్పిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం... వెంటనే అప్లై చేసుకొండి.

26
ఉద్యోగాల వివరాలు

వెబ్ డెవలపర్, సాప్ట్ వేర్ డెవలపర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది జోహో. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జోహో కంపెనీల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు... అయితే కొన్ని ప్రత్యేక స్థానాలకు చెన్నై, బెంగళూరు, నోయిడా, గురుగ్రామ్, జైపూర్, థానేలలోనే పనిచేయాల్సి ఉంటుంది.

36
అర్హతలు

బ్యాచిలర్ డిగ్రీ (B.E/B.Tech) ఉండాలి. కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా అందుకు సమానమైన విద్యార్హతలు కలిగివుండాలి. అయితే మంచి స్కిల్స్ కలిగిన అభ్యర్థులు కాలేజీ డిగ్రీ లేకున్నా ఉద్యోగాలను పొందవచ్చని జోహో తెలిపింది.

ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ Java, C++ లేదా C# లో మంచి ప్రావిణ్యం ఉండాలి. సమస్యలను పరిష్కరించడం, లాజికల్ థింకింగ్, మంచి కమ్యూనికేషన్ స్కిల్ కలిగివుండాలని జోహో చెబుతోంది.

46
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

జోహోలో ఉద్యోగంపై ఆసక్తిగలవారు వెంటనే కంపెనీ అఫిషియల్ వెబ్ సైట్ లో జోహో కెరీర్స్ పేజిని ఓపెన్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఇప్పటికే జోహోలో పనిచేసే ఉద్యోగుల రెఫరెన్స్ ద్వారా కూడా ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు.

56
ఎంపిక ప్రక్రియ

రాత పరీక్ష

ఫస్ట్ రౌండ్. జనరల్ ఆప్టిట్యూడ్, సి ప్రోగ్రామింగ్ పై మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు

బేసిక్ ప్రోగ్రామింగ్ రౌండ్ : 

5-6 ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్స్ పరిష్కరించాల్సి ఉంటుంది.

అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్ రౌండ్ :

కోడింగ్, డాటా స్ట్రక్చర్ ఆండ్ అల్గారిధమ్ (DSA) పై ప్రశ్నలు

టెక్నికల్ ఇంటర్వ్యూ :

ప్రోగ్రామింగ్ నాలెడ్జ్, DSA, డాటాబేస్ కాన్సెప్ట్, సిస్టమ్ డిజెైన్ ఛాలెంజెస్ పై వన్ టు వన్ సెషన్

హెచ్ఆర్ ఇంటర్వ్యూ : 

ఇది చివరి దశ. వివిధ రకాల ప్రశ్నల ద్వారా అభ్యర్థి మనస్తత్వం, కెరీర్ గోల్స్, కోరుకుంటున్న సాలరీ గురించి హెచ్ఆర్ (హ్యూమన్ రిసోర్స్) అధికారులు తెలుసుకుంటారు.

66
సాలరీ

ప్రెషర్స్ కి వార్షిక జీతం (Annual Package) రూ.4.5 నుండి రూ.8.4 వరకు ఉంటుంది. ఎంపిక ప్రక్రియలో ఫెర్పార్మెన్స్, ఎంపిక చేసిన ఉద్యోగాన్ని బట్టి సాలరీ ఉంటుంది.

అనుభవం కలిగినవారికి లక్షల్లో సాలరీలు ఉంటాయి. 1-3 ఏళ్లు సాప్ట్ వేర్ డెవలపర్ గా అనుభవం కలిగినవారికి రూ.8-15 లక్షల వార్షిక జీతం ఉంటుంది. సీనియర్ సాప్ట్ వేర్ ఇంజనీర్ కి యానువల్ సాలరీ రూ.12.6 లక్షల పైగా ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories