బి‌ఈ‌సి‌ఐ‌ఎల్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చూడండి..

First Published Oct 16, 2021, 2:24 PM IST

న్యూఢిల్లీ: బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) ఝజ్జర్‌లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (AIIMS) లో ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అభ్యర్థులు www.becil.comలో BECIL అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు . 

ఈ నియామక డ్రైవ్ లో ఝజ్జర్ లోని ఎయిమ్స్ లో  నాలుగు ఖాళీ పోస్టులను  ఒప్పందం ఆధారంగా నియమించనుంది. అభ్యర్థులు అక్టోబర్ 25 లేదా అంతకు ముందులోగా దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హత ప్రమాణం: అభ్యర్థులు బ్యాచిలర్ డిగ్రీలో సైన్స్‌ సంబంధిత రంగంలో 1 సంవత్సరాల అనుభవం లేదా 10+12 సైన్స్‌తో సంబంధిత రంగంలో ఐదేళ్ల అనుభవం కలిగి ఉండాలి.
 

అభ్యర్థులకు కావాల్సిన అర్హత:   గుర్తింపు పొందిన హాస్పిటల్స్/ఇనిస్టిట్యూషన్స్ నుండి ఓ‌టి టెక్నిక్స్‌లో సర్టిఫికేట్/డిప్లొమా కోర్సు. అలాగే అభ్యర్థుల వయస్సు 40 ఏళ్లకు మించకూడదు. 

దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ/మహిళా కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ .750 కాగా ఎస్‌సి/ఎస్‌టి/పి‌డబల్యూ‌డి  అభ్యర్థులకు ఫీజు రూ .450. 

జీతం: ఎంపికైన అభ్యర్థులకు నెల జీతం రూ .20,202 చెల్లించబడుతుంది.
 

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది. రాత పరీక్ష/ఇంటర్వ్యూకి సంబంధించిన వివరాలు త్వరలో విడుదల చేయనున్నారు. "అభ్యర్థులు వారు ఇమెయిల్ & మెసేజ్‌లను క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. బి‌ఈ‌సి‌ఐ‌ఎల్ (BECIL)ఎంపికైన అభ్యర్థులకు ఇమెయిల్ & ఎస్‌ఎం‌ఎస్ ద్వారా తెలియజేస్తుంది.

click me!