APPSC jobs:ఏపీపీఎస్‌సి ఉద్యోగ నోటిఫికేషన్‌ 2021 విడుదల.. పూర్తి వివరాలు, ధరఖాస్తు కోసం క్లిక్ చేయండి..

First Published | Oct 12, 2021, 12:11 PM IST

ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిరుద్యోగ యువతి, యువకుల కోసం జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్‌సి)  వివిధ ఇంజనీరింగ్‌ విభాగాల్లో ఉన్న అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టుల  భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో  వివిధ ఇంజనీరింగ్‌ సర్వీస్‌ విభాగాల్లో ఖాళీగా ఉన్న 190 అసిస్టెంట్ ఇంజనీర్‌ పోస్టులకు గురువారం ఈ నోటిఫికేషన్‌ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ధరఖాస్తు ఫీజును చెల్లించి ఈ నెల 21 నుంచి నవంబర్‌ 11 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు. ఇతర వివరాలకు https://psc.ap.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని  సూచించారు.

విభాగాలు: సివిల్‌, ఈఎన్‌వీ, మెకానికల్‌
పోస్టులు: అసిస్టెంట్‌ ఇంజనీర్స్‌
మొత్తం పోస్టుల సంఖ్య: 190
అర్హత: పోస్టులను బట్టి వివిధ విద్యార్హతలు నిర్ణయించారు. సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా, బీఈ/బీటెక్‌, ఎల్‌సీఈ/తత్సమాన ఉత్తీర్ణత ఉన్న వాళ్లు అప్లయ్‌ చేసుకోవచ్చు.
సర్వీస్‌లు: ఏపీ ఆర్‌డబ్ల్యూఎస్‌ అండ్‌ ఎస్‌ ఇంజనీరింగ్‌ సబార్డినేట్‌ సర్వీస్, పీహెచ్‌ అండ్‌ ఎంఈ సబార్డినేట్‌ సర్వీస్, ఏపీ పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ఎంపీఎల్‌ ఇంజనీరింగ్‌ సబార్డినేట్‌ సర్వీస్, ఏపీ గ్రౌండ్‌ వాటర్‌ సబార్డినేట్‌ సర్వీస్, ఏపీ పంచాయతీరాజ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సబార్డినేట్‌ సర్వీస్‌లు, ఎండోమెంట్‌ సబార్డినేట్‌ సర్వీస్, ఏపీ వాటర్‌ రిసోర్సెస్‌ సబార్డినేట్‌ సర్వీస్‌. 

Latest Videos


appsc

వయసు: అభ్యర్థుల వయసు 1 జులై 2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21 అక్టోబర్‌ 2021
దరఖాస్తులకు చివరితేది: 11 నవంబర్‌ 2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://psc.ap.gov.in/

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే త్వరలోనే 670 జూనియర్‌ అసిస్టెంట్స్‌, మరో 190 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ చేస్తామని ఏపీపీఎస్సీ సెక్రటరీ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ‘‘త్వరలోనే జూనియర్‌ అసిస్టెంట్స్‌, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ చేస్తాం. ఒక్కొక్కటిగా వివిధ శాఖలల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తాం. గ్రూప్‌-1 మెయిన్స్‌ మూల్యాంకనంపై ఏపీ హైకోర్టు తీర్పును గౌరవిస్తాము’’ అని తెలిపారు.

click me!