Bank Jobs : తెలుగు యువతకు లక్కీ ఛాన్స్.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు, అప్లై చేస్తేచాలు బ్యాంక్ జాబ్

Published : Oct 03, 2026, 08:11 AM IST

కెనరా బ్యాంక్ 3,500 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ పూర్తయిన యువతకు ఇది మంచి అవకాశం. ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

PREV
14
బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా?

Bank Jobs : డిగ్రీ పూర్తి చేసి బ్యాంకింగ్ రంగంలో అడుగుపెట్టాలనుకునే యువతకు కెనరా బ్యాంక్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా 3,500 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో ఆంధ్ర ప్రదేశ్ కు 247, తెలంగాణకు 134 పోస్టులు కేటాయించారు.

ఈ రిక్రూట్‌మెంట్ ప్రత్యేకత ఏంటంటే.. ఎలాంటి రాత పరీక్ష ఉండదు. అభ్యర్థులు ఇంటర్ లేదా డిప్లొమాలో సాధించిన మార్కుల ఆధారంగా స్టేట్ వైడ్ మెరిట్ లిస్ట్ తీస్తారు. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, అవసరమైన చోట స్థానిక భాషా పరీక్ష, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది.

3,500 పోస్టుల్లో ఏ రాష్ట్రానికి ఎన్ని?

కెనరా బ్యాంక్ నోటిఫికేషన్ ప్రకారం దేశవ్యాప్తంగా మొత్తం 3,500 ఖాళీలు ఉన్నాయి. రాష్ట్రాల వారీగా ముఖ్యమైన ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి:

• కర్ణాటక – 581

• ఉత్తరప్రదేశ్ – 409

• తమిళనాడు – 391

• ఆంధ్రప్రదేశ్ – 247

• కేరళ – 240

• మహారాష్ట్ర – 205

• పశ్చిమ బెంగాల్ – 150

• తెలంగాణ – 134

• బీహార్ – 122

• హర్యానా – 114

• మధ్యప్రదేశ్ – 110

• ఒడిశా – 104

తెలుగు రాష్ట్రాల్లోని పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, జనరల్ కేటగిరీలకు రిజర్వేషన్లు కూడా ప్రకటించారు.

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన సంస్థ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన వారు అప్లై చేసుకోవచ్చు.

అయితే ఇక్కడో ముఖ్యమైన కండిషన్ ఉంది. అభ్యర్థి 01.01.2023 నుంచి 01.09.2026 మధ్య మాత్రమే డిగ్రీ పాస్ అయి ఉండాలి. అంతకంటే ముందు డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అనర్హులు.

24
వయోపరిమితి, ఎంపిక విధానం

అభ్యర్థుల వయసు 01.09.2026 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే అభ్యర్థి 02.09.1998 నుంచి 01.09.2006 మధ్య పుట్టి ఉండాలి.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితి సడలింపులు ఉంటుంది.

• ఎస్సీ/ఎస్టీ – 5 ఏళ్లు

• ఓబీసీ (నాన్-క్రీమీ లేయర్) – 3 ఏళ్లు

• దివ్యాంగులు (PwBD) – 10 ఏళ్లు

నిబంధనలకు లోబడి కొన్ని వర్గాలకు చెందిన మహిళలకు కూడా అదనపు వయోసడలింపు ఉంటుంది.

రాత పరీక్ష లేదు.. కానీ మెరిట్ ముఖ్యం!

ఈ రిక్రూట్‌మెంట్‌లో ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. అప్లై చేసిన అభ్యర్థుల మార్కుల శాతాన్ని బట్టి రాష్ట్రాల వారీగా మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు.

జనరల్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 60%… ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు 55% మార్కులతో పాస్ అవ్వాలి.

ఒకవేళ ఇద్దరు అభ్యర్థులకు ఒకే మార్కులు వస్తే, వయసులో పెద్దవారికి మెరిట్ లిస్ట్‌లో ప్రాధాన్యం ఇస్తారు.

స్థానిక భాష కచ్చితంగా రావాలి

మీరు ఏ రాష్ట్రానికి అప్లై చేస్తున్నారో ఆ రాష్ట్ర స్థానిక భాష కచ్చితంగా వచ్చి ఉండాలి. ఉదాహరణకు ఆంధ్ర ప్రదేశ్ లో అప్లై చేసేవారికి తెలుగు రావాలి. టెన్త్ లేదా ఇంటర్ మార్క్ షీట్‌లో ఆ భాష చదివినట్లు ఉంటే ప్రత్యేకంగా భాషా పరీక్ష రాయాల్సిన అవసరం లేదు. అలాంటి సర్టిఫికెట్ లేని వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ పెడతారు. అందులో పాస్ కాకపోతే అప్రెంటిస్‌గా తీసుకోరు.

34
నెలకు రూ.16,650 స్టైపెండ్..

కెనరా బ్యాంకులో అప్రెంటిస్‌ ఉద్యోగాలు ఎంపికైనవారికి 12 నెలల పాటు శిక్షణ ఇస్తారు. ఈ సమయంలో నెలకు రూ.16,650 స్టైపెండ్ చెల్లిస్తారు. ఇందులో కెనరా బ్యాంక్ రూ.10,500 ఇస్తుంది. మిగతా రూ.6,150 ప్రభుత్వ వాటా కింద డీబీటీ ద్వారా నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారని నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు.

ఇది పర్మినెంట్ బ్యాంక్ జాబ్ కాదు

అప్లై చేసే ముందు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇది. అప్రెంటిస్ చట్టం 1961 కింద ఇచ్చే 12 నెలల ట్రైనింగ్ మాత్రమే. అప్రెంటిస్‌లను కెనరా బ్యాంక్ పర్మినెంట్ ఉద్యోగులుగా పరిగణించదు. అంతేకాదు శిక్షణ పూర్తయ్యాక కెనరా బ్యాంక్ పర్మినెంట్ జాబ్ ఇస్తుందనే గ్యారెంటీ కూడా లేదు. ఏడాది తర్వాత ఆ అగ్రిమెంట్ ముగుస్తుంది.

ఒక రాష్ట్రానికి మాత్రమే ఛాన్స్

అభ్యర్థులు ఈ రిక్రూట్‌మెంట్‌లో ఏదైనా ఒక రాష్ట్రానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆ రాష్ట్రంలోని జిల్లాలకు ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఫైనల్‌గా బ్యాంక్ అవసరాలను బట్టి ఏ జిల్లాలో ట్రైనింగ్ ఇవ్వాలనేది కెనరా బ్యాంక్ నిర్ణయిస్తుంది.

44
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

ఇప్పటికే కెనరా బ్యాంక్ లేదా వేరే సంస్థలో అప్రెంటిస్‌షిప్ చేసిన వారు, ప్రస్తుతం చేస్తున్న వారు అప్లై చేయడానికి వీల్లేదు. అలాగే డిగ్రీ పూర్తయ్యాక ఏడాది లేదా అంతకంటే ఎక్కువ పని అనుభవం ఉన్నవారు కూడా ఈ అప్రెంటిస్ పోస్టులకు అనర్హులని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

అప్లై చేసే విధానం

ముందుగా నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ (NATS) వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకుని, మీ ప్రొఫైల్‌ను 100% పూర్తి చేయాలి. ఆ తర్వాత వచ్చే ఎన్‌రోల్‌మెంట్ ఐడీని ఉపయోగించి కెనరా బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

అప్లికేషన్ ప్రాసెస్ 01.10.2026 నుంచి 17.10.2026 వరకు ఉంటుంది. వేరే ఏ పద్ధతిలో పంపినా అప్లికేషన్లు స్వీకరించరు.

ఫీజు వివరాలు:

• ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు – ఫీజు లేదు

• మిగతా వారు – రూ.500

చెల్లించిన ఫీజు రిఫండ్ చేయబడదు.

అప్లై చేసేటప్పుడు ఫోటో, సంతకం, ఎడమ చేతి బొటనవేలి ముద్ర, ఇంగ్లీషులో చేత్తో రాసిన డిక్లరేషన్ అప్‌లోడ్ చేయాలి.

ముఖ్య గమనిక

డిగ్రీ పూర్తయిన ఫ్రెషర్స్‌కు బ్యాంకింగ్ రంగంలో ఏడాది పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచుకోవడానికి ఇది మంచి అవకాశం. కానీ ఇది పర్మినెంట్ కెనరా బ్యాంక్ ఉద్యోగం కాదన్న విషయాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. రాత పరీక్ష లేకపోవడంతో గట్టి పోటీ ఉంటుంది.

దరఖాస్తుకు చివరి తేదీ : 17.10.2026. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, NATS రిజిస్ట్రేషన్ పూర్తయ్యాకే కెనరా బ్యాంక్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.

Read more Photos on
click me!

Recommended Stories