Police Recruitment: కొలువుల జాతర.. 2050 పోలీస్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. నోటిఫికేషన్ ఫుల్ డిటైల్స్ ఇవే

Published : Sep 16, 2026, 11:27 AM IST

AP Police Recruitment 2026 : ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో 2,050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
ఏపీ ప్రభుత్వంలో భారీ ఉద్యోగ నోటిఫికేషన్.. ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల వివరాలు ఇవే

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే డ్రీమ్‌తో కష్టపడుతున్న యువతకు కూటమి ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కొలువుల జాతరకు తెరలేపుతూ పోలీస్ శాఖలో భారీగా ఖాళీల భర్తీకి శ్రీకారం చుట్టింది. పోలీసు, ఫైర్, జైళ్లు, ఫోరెన్సిక్ లాంటి పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 2,050 ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు (APSLPRB) అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. సుదీర్ఘకాలంగా ఖాకీ యూనిఫాం వేసుకోవాలని ఆశగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇది అసలైన గోల్డెన్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు.

25
ఎస్ఐ, కానిస్టేబుల్ కేటగిరీలో పోస్టుల వివరాలు ఇవే

విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం అత్యంత కీలకమైన సబ్ ఇన్‌స్పెక్టర్ (SI), కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీలలో 378 ఎస్ఐ పోస్టులు ఉండగా, 1,156 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయి.

ఎస్ఐ కేటగిరీ:

• సివిల్ ఎస్ఐ: 253 (పురుషులు, మహిళలు)

• ఏఆర్ ఎస్ఐ: 116 (పురుషులు, మహిళలు)

• ఎస్పీఎఫ్ ఎస్ఐ: 9 (పురుషులు)

• కమ్యూనికేషన్స్ ఎస్ఐ: 50 (పురుషులు, మహిళలు)

• పీటీఓ ఎస్ఐ: 10 (పురుషులు)

కానిస్టేబుల్ కేటగిరీ :

• సివిల్ కానిస్టేబుల్: 542 (పురుషులు, మహిళలు)

• ఏఆర్ కానిస్టేబుల్: 285 (పురుషులు, మహిళలు)

• కమ్యూనికేషన్స్ కానిస్టేబుల్: 200 (పురుషులు, మహిళలు)

35
అగ్నిమాపక, జైళ్ల శాఖలలో ఖాళీల లెక్కలు ఇవే

కేవలం సాధారణ పోలీసు శాఖ మాత్రమే కాకుండా విపత్తు నిర్వహణ, జైళ్ల శాఖల్లోనూ పోస్టులను కేటాయించారు. అగ్నిమాపక శాఖ (Fire Department) పరిధిలో 158 ఫైర్‌మెన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక జైళ్లు, కరెక్షనల్ సర్వీసెస్ విభాగంలో మొత్తం 171 వార్డర్ పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 150 పురుషుల వార్డర్ పోస్టులు కాగా, 21 మహిళా వార్డర్ పోస్టులు కేటాయించారు.

45
టెక్నికల్, డ్రైవర్, ఫోరెన్సిక్ పోస్టుల సమాచారం

సాంకేతిక నైపుణ్యం, డ్రైవింగ్ అనుభవం ఉన్న అభ్యర్థుల కోసం పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ప్రత్యేక పోస్టులను కేటాయించింది.

• పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్ (PTO): 198 డ్రైవర్, 15 మెకానిక్ పోస్టులు (పురుషులు)

• ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (FSL): 43 సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు (ఫిజికల్ - 10, కెమికల్ - 13, బయాలజీ/సెరాలజీ - 20)

అభ్యర్థులు తమ విద్యార్హత ఆధారంగా ఈ టెక్నికల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

55
అప్లికేషన్ ప్రాసెస్, ఎగ్జామ్ డిటైల్స్ ఇవే

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ విద్యార్హత పత్రాలు, సర్టిఫికేట్లను ముందే సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు APSLPRB అధికారిక వెబ్‌సైట్ https://slprb.ap.gov.in సందర్శించి దరఖాస్తులు పూర్తి చేయాలి.

ఆన్‌లైన్ అప్లికేషన్లు ప్రారంభమయ్యే తేదీలు, ప్రాథమిక రాత పరీక్ష తేదీలను బోర్డు త్వరలోనే వెబ్‌సైట్‌లో ప్రకటిస్తుంది. రాబోయే పోటీని తట్టుకునేలా అభ్యర్థులు ఇప్పటి నుంచే రాత పరీక్షతో పాటు శారీరక సామర్థ్య పరీక్షల సాధన వేగవంతం చేయడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories