Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.1.80 లక్షల వరకు జీతంతో ఉద్యోగాలు

Published : Sep 15, 2026, 03:16 PM IST

Jobs: తెలంగాణలోని నిరుద్యోగ యువతకు విదేశాల్లో స్థిరపడేందుకు అద్భుతమైన అవకాశం లభించింది. తెలంగాణ ప్రభుత్వ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ TOMCOM ద్వారా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (దుబాయ్, అబుదాబి) లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఆ వివరాలు మీకోసం.

PREV
16
తెలంగాణ యువతకు బంపర్ ఆఫర్.. సర్కారీ సంస్థ ద్వారా వేల ఉద్యోగాలు

విదేశాల్లో ఉద్యోగం సాధించి, కుటుంబానికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. ముఖ్యంగా మన తెలంగాణ యువత యూఏఈ (దుబాయ్, అబుదాబి, షార్జా) వెళ్లడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. అయితే, ఇదే అడ్వాంటేజ్ గా తీసుకుని చాలామంది నకిలీ ప్రైవేట్ ఏజెంట్లు లక్షలకు లక్షలు వసూలు చేసి ముంచేస్తున్నారు.

ఇలాంటి ఫ్రాడ్స్ కి చెక్ పెడుతూ, తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM - టామ్‌కామ్) విదేశీ ఉద్యోగాల కోసం తోడుగా నిలిచే సేఫ్ అండ్ లీగల్ రూట్‌ను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా యూఏఈ ని ‘కంట్రీ ఆఫ్ ది వీక్’గా ప్రకటిస్తూ నిర్మాణ రంగంతో పాటు పలు విభాగాల్లో భారీ ఉద్యోగ అవకాశాలను ప్రకటించింది.

26
ఏ రంగాలు.. ఎలాంటి ఉద్యోగాలు ఉన్నాయి?

ప్రస్తుతం యూఏఈ లో కన్‌స్ట్రక్షన్, హెల్త్‌కేర్, హాస్పిటాలిటీ, డ్రైవింగ్, లాజిస్టిక్స్, ఐటీ వంటి ప్రధాన రంగాల్లో భారీగా ఖాళీలు ఉన్నాయి. ముఖ్యంగా నిర్మాణ రంగంలో కింది పోస్టుల భర్తీకి టామ్‌కామ్ శ్రీకారం చుట్టింది.

• టైల్ మేసన్

• షట్టరింగ్ కార్పెంటర్

• ఆర్సీసీ వర్కర్

• స్టీల్ ఫిక్సర్

• స్కాఫోల్డర్

• జనరల్ హెల్పర్

టెక్నికల్ పనులు తెలిసిన స్కిల్డ్ వర్కర్లతో పాటు ఎలాంటి అనుభవం లేని ఫ్రెషర్స్ కోసం 'జనరల్ హెల్పర్' పోస్టులు కూడా అందుబాటులో ఉన్నాయి.

36
జీతం, వసతి, ఇతర ప్రయోజనాలు ఇవే

మనం చేసే పని, నైపుణ్యం, అనుభవాన్ని బట్టి వేతనాలు ఉంటాయి.

• స్కిల్డ్ వర్కర్స్: నెలకు AED 1,453 వరకు అంటే మన భారతీయ కరెన్సీలో సుమారు ₹33,000 నుండి రూ.38,000 వరకు) లభిస్తుంది.

• జనరల్ హెల్పర్స్: నెలకు AED 1,200 వరకు (సుమారు ₹27,000) వేతనం ఉంటుంది.

• ఇతర రంగాలు / ప్రొఫెషనల్స్: విద్యార్హత, అనుభవాన్ని బట్టి నెలకు రూ.35,000 నుంచి గరిష్ఠంగా రూ.1.80 లక్షల వరకు సంపాదించే అవకాశాలు ఉన్నాయి.

అదనపు సౌకర్యాలు: ఎంపికైన అభ్యర్థులకు కంపెనీ తరఫున ఉచిత వసతి, రవాణా సదుపాయాలు కల్పిస్తారు. రోజూ 10 గంటల పని సమయం ఉంటుంది, అదనంగా పని చేస్తే ఓవర్‌టైమ్ అలవెన్స్ లభిస్తుంది. ఒప్పంద కాలపరిమితి 2 సంవత్సరాలు.

46
అర్హతలు, వయోపరిమితి

• వయస్సు: 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల మధ్య ఉన్నవారు అర్హులు.

• అనుభవం: స్కిల్డ్ పోస్టులకు కనీసం 1 సంవత్సరం సంబంధిత రంగంలో పని చేసిన అనుభవం ఉండాలి. జనరల్ హెల్పర్ పోస్టులకు ఎలాంటి అనుభవం లేకపోయినా దరఖాస్తు చేసుకోవచ్చు.

• డాక్యుమెంట్లు: ఆధార్ కార్డ్, చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్, విద్యార్హత/ఐటీఐ/టెక్నికల్ సర్టిఫికెట్లు, పని అనుభవ పత్రాలు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు సిద్ధంగా ఉంచుకోవాలి.

56
టామ్‌కామ్ 6-స్టెప్ ప్రాసెస్: మోసపోకుండా సేఫ్ జర్నీ

ప్రైవేట్ దళారులను నమ్మి మోసపోకుండా ఉండేందుకు టామ్‌కామ్ పక్కాగా 6 దశల ప్రక్రియను అమలు చేస్తోంది.

1. రిజిస్ట్రేషన్ అండ్ కౌన్సెలింగ్: వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా వివరాలు నమోదు చేసుకుంటే నిపుణులతో ఉచిత కౌన్సెలింగ్ ఇస్తారు.

2. అసెస్మెంట్ అండ్ స్కిల్ ట్రైనింగ్: అభ్యర్థి నైపుణ్యాన్ని అంచనా వేసి, అవసరమైతే ప్రభుత్వ శిక్షణ కేంద్రాల ద్వారా ప్రత్యేక ట్రైనింగ్ ఇప్పిస్తారు.

3. జాబ్ ఆఫర్ వెరిఫికేషన్: కంపెనీ ఇచ్చిన ఆఫర్ లెటర్ అసలైనదో కాదో టామ్‌కామ్ స్వయంగా పరిశీలించి కన్‌ఫర్మ్ చేస్తుంది.

4. డాక్యుమెంటేషన్ అండ్ వీసా: జెన్యూన్ వర్క్ వీసా ప్రాసెసింగ్‌లో పూర్తి సహాయం అందిస్తారు.

5. ప్రీ-డిపార్చర్ ఓరియంటేషన్: విదేశాలకు వెళ్లేముందు అక్కడి చట్టాలు, సంస్కృతి, పని వాతావరణంపై పూర్తి అవగాహన కల్పిస్తారు.

6. పోస్ట్-అరైవల్ సపోర్ట్: యూఏఈ చేరుకున్న తర్వాత కూడా ఏవైనా సమస్యలు వస్తే పరిష్కరించేందుకు నిరంతరం అందుబాటులో ఉంటారు.

66
ఎలా దరఖాస్తు చేసుకోవాలి? హెల్ప్‌లైన్ వివరాలు ఇవే

ఆసక్తి ఉన్న అభ్యర్థులు నేరుగా టామ్‌కామ్ అధికారిక వెబ్‌సైట్ tomcom.telangana.gov.in లో గానీ, లేదా Google Play Store నుండి TOMCOM App డౌన్‌లోడ్ చేసుకుని మొబైల్ లోనే రిజిస్టర్ చేసుకోవచ్చు.

• హెల్ప్‌లైన్ నంబర్లు: 08035524946 / 040-2334 2040

• ఆఫీస్ అడ్రస్: తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM), ఐటీఐ క్యాంపస్, మల్లేపల్లి, హైదరాబాద్ - 500057.

Read more Photos on
click me!

Recommended Stories