తాజాగా భర్తీ చేయనున్న ఆశా కార్యకర్తల పోస్టులు వివిధ జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి. జిల్లాల వారీగా ఖాళీల సంఖ్యను పరిశీలిస్తే.. అనకాపల్లిలో అత్యధికంగా 77 పోస్టులు, కర్నూలులో 65, తూర్పుగోదావరిలో 44, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 43, పార్వతీపురం మన్యంలో 43, పశ్చిమగోదావరిలో 42 పోస్టులు ఉన్నాయి. అలాగే అన్నమయ్య జిల్లాలో 41, ప్రకాశంలో 38, వైఎస్సార్ కడపలో 38, కృష్ణాలో 37, విశాఖపట్నంలో 33, చిత్తూరులో 32, కోనసీమలో 32, పల్నాడులో 31, విజయనగరంలో 31, కాకినాడలో 29, ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరులో 29, ఏలూరులో 27 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక
అనంతపురంలో 26, మార్కాపురంలో 25, శ్రీ సత్యసాయి జిల్లాలో 22, శ్రీకాకుళంలో 22, గుంటూరులో 21, నంద్యాలలో 21, పోలవరంలో 21, తిరుపతిలో 21, ఎన్టీఆర్ జిల్లాలో 15, బాపట్లలో 7 పోస్టుల చొప్పున భర్తీ చేయనున్నారు.