మిస్సైల్ దాడి జ‌రిగిన‌ప్పుడు పైల‌ట్ ఎలా త‌ప్పించుకుంటాడు.? ఫైట‌ర్ ప్లేన్ ఎజెక్ష‌న్ సీట్ అంటే ఏంటి.?

Published : Apr 05, 2026, 03:25 PM IST

War: యుద్ధ విమానాల్లో పైలట్ ప్రాణాలను రక్షించే అత్యంత కీలక భద్రతా వ్యవస్థల్లో ఎజెక్షన్ సీట్ (Ejection Seat) ఒకటి. ప్ర‌మాదం లేదా శ‌త్రువు దాడికి గురైన‌ప్పుడు పైలట్‌కు ఈ ప్ర‌త్యేక సీట్ ప్రాణాల‌ను కాపాడుతుంది. ఇంత‌కీ సీట్ ఎలా ప‌నిచేస్తుందో తెలుసుకుందాం.

PREV
14
యుద్ధ విమానాల్లో ఎజెక్షన్ సీట్ పాత్ర

ఫైటర్ ప్లేన్‌లో ఎజెక్షన్ సీట్ కేవలం ఒక కుర్చీ కాదు. ఇది పైలట్‌కు చివరి భద్రతా కవచం లాంటిది. విమానంలో అగ్ని ప్రమాదం, ఇంజిన్ వైఫల్యం లేదా మిసైల్ దాడి జరిగితే పైలట్ వెంటనే ఒక లీవర్‌ను లాగుతాడు. అప్పుడు కొన్ని సెకన్లలోనే మొత్తం వ్యవస్థ పని చేయడం ప్రారంభిస్తుంది. మొదట విమానం కాక్‌పిట్ కవర్ (కెనోపీ) పేలుడు చార్జ్ సహాయంతో తొలగిపోతుంది. ఆ తరువాత సీట్‌కు అమర్చిన రాకెట్ మోటార్ పైలట్‌ను బలంగా పైకి నెట్టుతుంది. ఈ ప్రక్రియలో పైలట్ విమానం అవశేషాలకు తగలకుండా ప్రత్యేకంగా రూపొందించిన సెన్సర్లు, నియంత్రణ వ్యవస్థలు పనిచేస్తాయి. చివరికి సరైన ఎత్తుకు చేరుకున్నప్పుడు ప్యారాచూట్ తెరుచుకుని పైలట్‌ను భూమిపై సురక్షితంగా దిగేలా చేస్తుంది.

24
ఎజెక్షన్ సీట్‌లో ఉండే అధునాతన సాంకేతికత

ఎజెక్షన్ సీట్ సాధారణ సాంకేతికతతో తయారవదు. ఇది ఒక రాకెట్ ఆధారిత అత్యంత క్లిష్టమైన ఇంజినీరింగ్ వ్యవస్థ.ఇందులో పలు కీలక భాగాలు ఉంటాయి. వీటిలో ప్ర‌ధాన‌మైన‌వి. రాకెట్ మోటార్ లేదా కాటపల్ట్ వ్యవస్థ, చిన్న పేలుడు చార్జ్‌లు, సెన్సర్లతో పాటు ఆటోమేటిక్ నియంత్రణ వ్యవస్థ, పైలట్ భద్రత కోసం ప్రత్యేక హార్నెస్, ఆటోమేటిక్ ప్యారాచూట్ వ్యవస్థ వంటివి ఉంటాయి. ఈ సాంకేతికత చాలా క‌చ్చితంగా పనిచేయాలి. ఎందుకంటే ఒక చిన్న తప్పు జరిగినా పైలట్‌కు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకే ఈ వ్యవస్థను రూపొందించడానికి ప్రపంచంలోని కొద్ది కంపెనీలకే నైపుణ్యం ఉంది.

34
ఎజెక్షన్ సీట్లలో ప్రపంచంలో నంబర్-1 ఎవరు?

ఎజెక్షన్ సీట్ తయారీలో ప్రపంచవ్యాప్తంగా బ్రిటన్‌కు చెందిన “మార్టిన్-బేకర్ (Martin-Baker)” కంపెనీ ప్రముఖంగా నిలిచింది. ఈ కంపెనీని ఈ రంగంలో అగ్రగామిగా భావిస్తారు. భారత్‌లోని తేజస్ యుద్ధ విమానం నుంచి మిగ్, రఫేల్ వంటి అనేక విమానాల్లో కూడా ఈ కంపెనీ తయారు చేసిన సీట్లు ఉపయోగిస్తున్నారు. ఈ సీట్లు ఇప్పటివరకు వేలాది పైలట్ల ప్రాణాలను రక్షించాయి. మార్టిన్-బేకర్‌తో పాటు రష్యా కంపెనీ NPP Zvezda, అమెరికా కంపెనీ Collins Aerospace కూడా ఈ రంగంలో పనిచేస్తున్నాయి.

44
ఒక ఎజెక్షన్ సీట్ ధర ఎంత?

ఎజెక్షన్ సీట్ తయారీ ఖర్చు చాలా ఎక్కువ. ఒక సీట్ ధర సుమారు రూ.1 కోటి నుంచి రూ.3 కోట్ల వరకు ఉంటుంది. విమానం రకంతో పాటు అందులో ఉన్న సాంకేతికత ఆధారంగా ఈ ధర మారుతుంది. ఒక ఫైట‌ర్ పైల‌ట్‌ను త‌యారు చేయ‌డానికి ప్ర‌భుత్వాల‌కు ఎంతో ఖ‌ర్చ‌వుతుంది. అందులోనూ ఒక మ‌నిషి ప్రాణం ముందు డ‌బ్బు ఎక్కువ కాద‌నే కాన్సెప్ట్‌తో ఇంత ఖ‌ర్చ‌యినా పెట్ట‌డానికి వెనుకాడ‌వు.

Read more Photos on
click me!

Recommended Stories