ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య క్షిపణి దాడులు జరుగుతున్నాయి. ఈ రాత్రికే ఇరాన్‌పై అమెరికా చరిత్రలోనే అతిపెద్ద దాడి చేయబోతోందా? ఇరాన్ మిసైల్ లాంచర్లు, సైనిక స్థావరాలే లక్ష్యంగా ఉన్నాయా?
మిడిల్ ఈస్ట్ లో టెన్షన్ వాతావరణం వేగంగా పెరుగుతోంది. అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణ ఇప్పుడు ఒక పెద్ద సైనిక పోరు వైపు వెళ్తున్నట్టు కనిపిస్తోంది. అమెరికా అధికారులు చెబుతున్న దాని ప్రకారం… శనివారం రాత్రి ఇరాన్‌పై చరిత్రలోనే అతిపెద్ద బాంబు దాడి మొదలుకావచ్చు. ఈ వార్త బయటకు రాగానే ప్రపంచం మొత్తం దృష్టి మధ్యప్రాచ్యంపై పడింది.
28
దాడులపై అమెరికా క్లారిటీ...
అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బేసెంట్, ఇరాన్‌పై అమెరికా పెద్ద సైనిక చర్యకు దిగవచ్చని సంకేతాలు ఇచ్చారు. ఈ దాడి ప్రధాన లక్ష్యం ఇరాన్ మిసైల్ లాంచర్లు, క్షిపణి ఫ్యాక్టరీలు, సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీయడమేనని ఆయన అంటున్నారు.
మిడిల్ ఈస్ట్ లో తన ప్రత్యర్థులకు ఇరాన్ ముప్పుగా మారకుండా చేయడమే అమెరికా ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. ఈ ఆపరేషన్‌తో ఇరాన్ సైనిక శక్తికి భారీ నష్టం కలిగిస్తామని అమెరికా అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
38
ట్రంప్ సీరియస్...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ ఇరాన్ తో యుద్దంపై కీలక ప్రకటన చేశారు. ఇరాన్ సైన్యం, నౌకాదళం ఇప్పటికే చాలా బలహీనపడ్డాయని ఆయన అన్నారు. ఇరాన్ నాయకత్వంలోని రెండు పెద్ద బృందాలు అంతమయ్యాయి... ఇప్పుడు దేశం మూడో సెట్ నాయకులతో నడుస్తోందన్నారు. ఇరాన్ వైమానిక దళం దాదాపుగా నాశనమైందని, దాని అనేక నౌకలు సముద్రంలో ధ్వంసమయ్యాయని కూడా ట్రంప్ చెప్పారు.
దాడికి ముందు అమెరికా మిడిల్ ఈస్ట్ లో భారీగా సైన్యాన్ని మోహరించింది. ఇందులో రెండు పెద్ద విమాన వాహక నౌకలు ఉన్నాయి.
USS అబ్రహం లింకన్ (USS Abraham Lincoln)
USS గెరాల్డ్ ఆర్. ఫోర్డ్ (USS Gerald R. Ford)
వీటితో పాటు గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్లు, ఫైటర్ జెట్లు, ఇతర యుద్ధనౌకలను కూడా ఈ ప్రాంతంలో మోహరించారు. ఇటీవలి కాలంలో ఇంత పెద్ద సైనిక సన్నాహాలు చాలా అరుదుగా కనిపించాయని నిపుణులు అంటున్నారు.
58
వీళ్లే అమెరికా టార్గెట్...
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి సన్నిహితంగా ఉండే సైనిక అధికారులను లక్ష్యంగా చేసుకుని దాడులు ప్లాన్ చేశారని అనేక రిపోర్టులు చెబుతున్నాయి. ఇలాంటి ఆపరేషన్ ఉద్దేశం ఇరాన్ నాయకత్వ సామర్థ్యాన్ని బలహీనపరచడమేనని భావిస్తున్నారు. ఒక దేశ ఉన్నత నాయకత్వం దెబ్బతింటే ఆ దేశం సైనిక, రాజకీయ నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కూడా బలహీనపడుతుంది.
68
ఇరాన్ ప్రతిదాడులు..
అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ కూడా ప్రతీకార చర్యలు చేపట్టింది. ఇరాన్ ఇజ్రాయెల్ వైపు అనేక క్షిపణులను ప్రయోగించిందని, ఆ ప్రాంతంలోని కొన్ని అమెరికా సైనిక స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకుందని రిపోర్టులు చెబుతున్నాయి. తమ దేశం సుదీర్ఘ పోరాటానికి సిద్ధంగా ఉందని, ఏ దాడినైనా గట్టిగా తిప్పికొడతామని ఇరాన్ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
78
ఇరాన్ లో భయం భయం..
శనివారం ఉదయం టెహ్రాన్‌లో అనేక పేలుళ్ల వార్తలు వచ్చాయి. ఆ తర్వాత నగరంపై నల్లటి పొగ మేఘాలు కనిపించాయి. మరోవైపు ఇజ్రాయెల్‌లో కూడా క్షిపణి దాడుల కారణంగా ప్రజలు బాంబ్ షెల్టర్లలోకి పరుగులు తీశారు.
బహ్రెయిన్‌లో సైరన్లు మోగాయి. తమ చమురు క్షేత్రాల వైపు వస్తున్న డ్రోన్లు, క్షిపణులను కూల్చివేశామని సౌదీ అరేబియా కూడా ప్రకటించింది. ఈ ఘటనలు మధ్యప్రాచ్యంలో ఘర్షణ వేగంగా పెరుగుతోందని స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నాయి.
88
ఇజ్రాయెల్ కు అమెరికా ఆయుధాలు..
ప్రస్తుతానికి ఈ ఘర్షణకు స్పష్టమైన ముగింపు కనిపించడం లేదు. అమెరికా ఇజ్రాయెల్‌కు 151 మిలియన్ డాలర్ల విలువైన కొత్త ఆయుధాల అమ్మకానికి కూడా ఆమోదం తెలిపింది. మరోవైపు, తమ భద్రత కోసం అవసరమైన ప్రతి అడుగు వేస్తామని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రాబోయే రోజులు మధ్యప్రాచ్యానికే కాక, యావత్ ప్రపంచానికి చాలా కీలకం కానున్నాయి.