Trump: మరో బాంబ్‌ పేల్చిన ట్రంప్‌.. గ్రీన్‌ కార్డు ఉన్న భారతీయుల గుండెల్లో గుబులు

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి డోనాల్డ్‌ ట్రంప్‌ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా అమెరికా ఫస్ట్‌ అనే నినాదంతో ముందుకు వెళ్తున్న ట్రంప్‌ వలసదారులకు చెక్‌ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతోన్న ట్రంప్‌ తాజాగా గ్రీన్‌ కార్డు ఉన్న వారిపై కూడా కఠినమైన నిబంధనలను అమల్లోకి తేనున్నారు.. 
 

Trumps New Immigration Rules Green Card Holders Face Tougher Scrutiny details in telugu VNR

అమెరికాలో హెచ్‌1బీ ఫీజా వస్తేనే సంతోషిస్తారు. అలాంటిది గ్రీన్‌ కార్డు వస్తే ఎగిరి గంతేస్తారు. జీవితాంతం అమెరికాలో ఉండిపోయే హక్కును గ్రీన్‌ కార్డు అందిస్తుందని తెలిసిందే. అయితే గ్రీన్‌ కార్డు ఉన్నంత మాత్రనా అమెరికాలో ఎల్లకాలం ఉండలేరా.? అంటే అవుననే సమాధానం వస్తోంది.

ఇటీవల అమెరికా ఉపాధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు దీనికి ఊతమిస్తున్నాయి. గ్రీన్‌ కార్డ్‌ పొందినంత మాత్రానా అమెరికాలో ఎల్లకాలం ఉండిపోయే హక్కు లేదంటూ జేడీ వాన్స్‌ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 
 

TRUMP GREEN CARD

దీంతో గ్రీన్‌ కార్డు ఉన్న వారు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా భారత సంతతికి చెందిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గత కొన్ని వారాలుగా అమెరికా తమ వలస చట్టాలను మరింత కఠినతరం చేస్తోంది. అగ్రరాజ్యం చర్యలతో వలసదారుల ఆందోళనను మరింత పెంచుతోంది. ఇటీవల అమెరికా వలస విభాగం అధికారులు కీలక అడ్వైజరీ జారీ చేశారు. హెచ్‌-1బీ, ఎఫ్‌-1, గ్రీన్‌కార్డు కలిగిన భారతీయులు ప్రయాణాల్లో అప్రమత్తత పాటించాలని సూచించారు. 


USA Green Card

చాలా రోజుల పాటు విదేశాలకు వెళ్లి అమెరికాకు తిరిగి వచ్చే సమయంలో అధికారులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది. అమెరికా నుంచి వెళ్లే సమయంలో, తిరిగి వచ్చే సమయంలో తనిఖీలు మరింత ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. అమెరికాకు వలస వచ్చిన వారు వారి స్వదేశీ పాస్‌పోర్టులతో సహా ఇతర డాక్యుమెంట్లను వెంట తెచ్చుకోవాలని సూచిస్తున్నారు. గ్రీన్‌కార్డు, వీసా, రీఎంట్రీ పర్మిట్, ఎంప్లాయ్‌మెంట్‌ వెరిఫికేషన్‌ లెటర్, ఫెడరల్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ చెల్లింపులు, పే స్లిప్స్‌ వంటివి వెంట పెట్టుకోవాలని సూచిస్తున్నారు. 

Green Card

విద్యార్థులు కూడా సంబంధిత కళాశాల, యూనివర్సిటీ ఇచ్చిన పర్మిషన్‌ లెటర్‌తో పాటు యూఎస్‌ బ్యాంకు ఖాతా వివరాల వంటివి చూపించాలని అధికారులు ఆదేశించారు. ఇక అమెరికాలో నివసిస్తున్న వారి సోషల్‌ మీడియా అకౌంట్స్‌పై కూడా ట్రంప్‌ ప్రభుత్వం దృష్టిసారించింది. అమెరికాలో ఉంటున్న గ్రీన్‌ కార్డుదారులంతా తమ సోషల్‌ మీడియా ఖాతా వివరాలను అప్పగించాల్సి రావొచ్చని తెలుస్తోంది. 

Latest Videos

vuukle one pixel image
click me!