ట్రంప్ మాటల కోటలు: స్టెనోలు ఉక్కిరిబిక్కిరి

Published : Jan 31, 2025, 07:41 AM IST

తగువులమారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిననాటి నుంచి అందరికీ చుక్కలు చూపిస్తూనే ఉన్నారు. పలు దేశాలపై సుంకాలు విధించడం, హెచ్చరికలు జారీ చేయడం ఇలాంటివెన్నో. ఆయన తీరుతో ఇప్పుడు వైట్ హౌస్ లోని స్టెనోగ్రాఫర్ల పని భారం కూడా పెరిగింది. గత అధ్యక్షుడు  జో బిడెన్ కంటే ట్రంప్ ఎక్కువగా మాట్లాడటంతో, ఒకే రోజులో 22,000 పదాలకు పైగా రాసుకోవాల్సి వస్తోంది. దీంతో అదనపు సిబ్బందిని నియమించుకోవాలని భావిస్తున్నారు.

PREV
14
ట్రంప్ మాటల కోటలు: స్టెనోలు ఉక్కిరిబిక్కిరి
వైట్ హౌస్ స్టెనోలు

ట్రంప్ నిత్యం మీడియాతో ఎక్కువసేపు మాట్లాడుతుండటంతో స్టెనోల పని కష్టమవుతోంది. బిడెన్ కంటే ఎక్కువగా మాట్లాడటం వల్ల వాళ్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.

24
డొనాల్డ్ ట్రంప్ స్టెనోలు

పని భారం పెరగడంతో వైట్ హౌజ్ లో  అదనపు సిబ్బందిని నియమించుకోవాలని చర్చ జరుగుతోంది. దీన్ని త్వరలోనే అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

34
స్టెనోలు

ట్రంప్ ప్రతి ప్రసంగాన్ని స్టనోలు రికార్డు చేయాల్సి ఉంటుంది. అవి అసాధారణంగా కొనసాగుతున్నాయి. అధికారం చేపట్టిన మొదటి వారంలోనే ఆయన 81,235 పదాలు పలికారని సమాచారం.

44
డొనాల్డ్ ట్రంప్

ఎక్కువగా మాట్లాడటం అంటే ఎక్కువ స్పష్టత కాదని కొందరు వాదిస్తున్నారు. ప్రజలు విసుగు చెందుతారని అభిప్రాయ పడుతున్నారు.

click me!

Recommended Stories