ప్రపంచంలో అత్యంత ఎత్తయిన మనుషులను కలిగిన టాప్ 10 దేశాలు

First Published | Jul 25, 2024, 12:16 PM IST

ఎవరైనా మంచి హైట్ కలిగివుంటే ఆరడుగుల అందగాడని పొగుడుతుంటారు. అలాంటి ఆజానుభాహులు దేశమంతా వుంటే... ఇలా అత్యంత ఎత్తయిన పురుషులను కలిగిన టాప్ 10 దేశాలివే... 

Mahesh Babu

ఈ కాలంలో మనిషికి మంచి ఆదాయమే కాదు మంచి ఆరోగ్యమూ చాలా ముఖ్యం. మంచి శరీర సౌష్టవం కలిగివుండే వారిలో కాన్పిడెంట్ లెవల్స్ ఎక్కువగా వుంటాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. బక్కపలుచగా  వుండేవారు, ఊబకాయులు, ఎత్తు తక్కువగా వుండేవారు... ఇలా వయసుకు తగినట్లు బాడీ లేని చాలామంది ఆత్మనూన్యతకు గురవుతుంటారు. అయితే మంచి ఎత్తు కలిగినవారిని మాత్రం ఆజానుబాహుడంటూ పొగడటం మనం చూస్తుంటాం... అంటే ఇది మనిషి అందాన్ని పెంచుతుందన్నమాట.
 

Tallest Mens

మన ఎత్తు అనేది జన్యుపరంగానే కాదు చిన్నప్పటి నుండి తీసుకునే పోషకాహారం, నివసించే భౌగోళిక పరిస్థితులను బట్టి వుంటుంది. ప్రపంచంలో వివిధ దేశాల ప్రజల ఎత్తు వేరువేరుగా వుంటుంది. ఇలా భారతీయ పురుషుల సగటు ఎత్తు 164.94 సెంటీమీటర్లు... మహిళలు 152.58 సెంటిమీటర్లు. అయితే చాలా దేశాల్లోని ప్రజలు మనకంటే చాలా ఎత్తుగా వుంటారు. ఇలా ప్రపంచంలో అత్యంత ఎత్తైన మనుషులను కలిగిన టాప్ 10 దేశాలేంటో చూద్దాం. 


Netherlands

నెదర్లాండ్ :  

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన మనుషులను కలిగివుండే దేశం నెదర్లాండ్. ఈ దేశంలో పురుషుల సగటు ఎత్తు 183.78 సెంటిమీటర్లు.  అంటే భారతీయులకంటే దాదాపు 20 సెంటిమీటర్లు ఎక్కువ ఎత్తును కలిగివుంటారు నెదర్లాండ్ పురుషులు. ఈ దేశంలో మహిళలు కూడా భారీ ఎత్తును కలిగివుంటారు. ఆ దేశ బౌగోళిక పరిస్థితులు, ప్రజల జీవన విధానమే ఈ కటౌట్ కు కారణం. 
 

Montenegro

మాంటెనిగ్రో : 
 
టాలెస్ట్ మనుషులను కలిగిన దేశాల్లో రెండో స్థానం మాంటెనిగ్రోది. ఇక్కడ పురుషుల సగటు ఎత్తు 183.3 సెంటిమీటర్లు. అంటే ఇంచుమించు నెదర్లాండ్ ప్రజల హైట్ ను మాంటెనిగ్రో ప్రజలు కూడా కలిగివుంటారు.

ESTONIA

ఇస్టోనియా :

ఈ దేశ పురుషుల సగటు ఎత్తు 182.79 సెంటిమీటర్లు. ఇక్కడ మహిళల సగటు ఎత్తు కూడా చాలా ఎక్కువ. అత్యధిక హైట్ కలిగిన మనుషుల జాబితాలో ఇస్టోనియాది మూడో స్థానం. 
 

Bosnia

బోస్నియా మరియు హెర్జెగోవినా :  

ఇక్కడి పురుషుల సగటు ఎత్తు 182.47 సెంటిమీటర్లు. మనుషుల హైట్ విషయంలో వీరిది నాలుగో స్థానం 
 

Iceland

ఐస్ ల్యాండ్ : 

ఐస్ ల్యాండ్ పురుషుల సగటు ఎత్తు 182.1 సెంటిమీటర్లు. ప్రపంచంలో ఎత్తయిన కటౌట్లు కలిగిన మనుషుల జాబితాలో ఐస్ ల్యాండ్ ది ఐదో స్థానం 
 

Denmark

డెన్మార్క్

ఈ దేశ పురుషుల సగటు ఎత్తు 181.89 సెంటిమీటర్లు. మంచి ఫిట్ నెస్ తో ఈ దేశ పురుషులు ఆజానుబాహులుగా కనిపిస్తారు. మనుషుల ఎత్తులో ఈ దేశానిది ఆరోస్థానం. 
 

Czech Republic

చెక్ రిపబ్లిక్ : 

సగటు ఎత్తు 181.19 సెంటిమీటర్లతో చెక్ రిపబ్లిక్ పురుషులు ప్రపంచంలోనే ఎత్తయిన మనుషులను కలిగిన దేశాల జాబితాలో ఏడో స్థానంలో నిలిచింది. 

Latvia

లాట్వియా :

లాట్వియన్ పురుషుల సగటు ఎత్తు 181.17 సెంటిమీటర్లు. ప్రపంచంలో ఎత్తయిన మనుషులను కలిగిన దేశాల్లో ఇది ఒకటి.
 

Slovakia

స్లొవేకియా : 

ఈ దేశ పురుషుల సగటు ఎత్తు 181.02 సెంటిమీటర్లు. హైట్ విషయంలో ప్రపంచంలో వీరు తొమ్మిదవ స్థానంలో నిలిచారు. 

Ukrain

ఉక్రెయిన్

ఉక్రెయిన్ ప్రజలు కూడా  మంచి శరీర సౌష్టవాన్ని కలిగివుంటారు. ఈ దేశ పురుషుల సగటు ఎత్తు 180 సెంటిమీటర్లు. ఎత్తయిన మనుషులను కలిగిన దేశాల్లో ఉక్రెయిన్ ది 10వ స్థానం.  

Indonesia

ఇక అత్యంత పొట్టి మనుషులను కలిగిన దేశం ఇండోనేషియా. ఇక్కడ పురుషుల సగటు ఎత్తు కేవలం 158 , మహిళలు 147 సెంటిమీటర్లు మాత్రమే.  
 

Latest Videos

click me!