అబుదాబీలో మొట్టమొదటి హిందూ ఆలయాన్ని ప్రారంభించిన నరేంద్ర మోడీ (ఫోటోలు)

First Published | Feb 14, 2024, 9:53 PM IST

యూఏఈలోని అబుదాబీలో దాదాపు రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన హిందూ ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ప్రారంభించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం మోడీ యూఏఈకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బోచాసనవాసీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ (బీపీఏఎస్) ఆలయాన్ని నిర్మించింది.  

abu dhabi hindu temple

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో నిర్మించిన మొట్టమొదటి హిందూ దేవాలయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. దాదాపు రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఆలయం మధ్యప్రాచ్యం, యూఏఈలోని హిందూ జనాభాకు అతి ముఖ్యమైనది. 

abu dhabi hindu temple

27 ఎకరాల విస్తీర్ణంలో 108 అడుగుల ఎత్తైన ఈ ఆలయం మధ్యప్రాచ్యంలో అతిపెద్ద హిందూ దేవాలయం కానుంది. 2015లో యూఏఈ రాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, అబు మ్రీఖా దేవాలయం కోసం 13.5 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. 2019లో మరో 13.5 ఎకరాల భూమిని విరాళం ఇవ్వగా.. ఆలయ నిర్మాణం ఘనంగా ప్రారంభమైంది. 

Latest Videos


abu dhabi hindu temple

2018లో ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఆలయానికి పునాదిరాయి వేశారు. బోచసన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామి నారాయణ (బీఏపీఎస్) ఈ ఆలయాన్ని నిర్మించింది. బుధవారం ఉదయం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ప్రారంభమైంది. 

abu dhabi hindu temple

ఆలయాన్ని ప్రారంభించేందుకు అబు మ్రీఖాకు వెళ్లే ముందు 8 నెలల్లో మూడోసారి యూఏఈ పర్యటనకు వచ్చిన మోడీ.. ప్రపంచ ప్రభుత్వ శిఖరాగ్ర సదస్సులో కీలక ప్రసంగం చేశారు. మడగాస్కర్ అధ్యక్షుడు ఆండ్రీ రాజోలినా, దుబాయ్ ఎమిర్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్‌లతో మోడీ ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. 

abu dhabi hindu temple

ప్రారంభోత్సవ అధిపతి, ప్రధాని మోడీ ఆలయ ప్రాంగణంలో గంగా , యమునా నదులలో నీటిని సమర్పించి ఆపై ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. ఇస్లాం అధికారిక మతమైన యూఏఈలో దాదాపు 3.6 మిలియన్ల మంది భారతీయ కార్మికులు నివసిస్తున్నారు.

abu dhabi hindu temple

ఆలయంలో ప్రారంభోత్సవ వేడుకకు భారత ప్రభుత్వ ఉన్నతాధికారులు, బాలీవుడ్ తారలు, ముఖేష్ అంబానీ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. యూఏఈలో భారత మాజీ రాయబారి నవదీప్ సూరి మాట్లాడుతూ.. భారతీయ సమాజానికి ఇది చాలా ప్రతీకాత్మకమైన రోజు అన్నారు. 

abu dhabi hindu temple

ఈ ఆలయాన్ని సాంప్రదాయ నాగర్ నిర్మాణ శైలిలో నిర్మించారు. 108 అడుగుల ఎత్తుతో దీన్ని నిర్మించారు. ఆలయ శిఖర భాగంలో ఏడు శిఖరాలు ఉండేలా జాగ్రత్త తీసుకున్నారు. ఈ ఏడు శిఖరాల్లో ఒక్కోటి యూఏఈలోన ఒక్కో ఎమిరేట్స్‌ను సూచిస్తుంది.

abu dhabi hindu temple

BAPS మందిర్ చుట్టూ చక్కగా రూపొందించబడిన ఘాట్‌లు, గంగా యమునా నదులను తలపించేలా తీర్చి దిద్దారు. ఈ ఆలయంలో 'డోమ్ ఆఫ్ హార్మొనీ’, 'డోమ్ ఆఫ్ పీస్' అనే రెండు గోపురాలను నిర్మించారు. 

click me!