ఆ చిన్నారులు సజీవం.. 40 రోజుల తర్వాత క్షేమంగా సైన్యం చేతుల్లోకి... అమెజాన్ అడవుల్లో తప్పిపోయిన పసివారు..

Published : Jun 10, 2023, 10:14 AM IST

అమెజాన్ అడవుల్లో తప్పిపోయిన నలుగురు చిన్నారులను 40రోజుల తరువాత సైన్యం విజయవంతంగా కనిపెట్టింది. ఈ చిన్నారుల్లో 11నెలల పాప కూడా ఉంది. 

PREV
19
ఆ చిన్నారులు సజీవం.. 40 రోజుల తర్వాత క్షేమంగా సైన్యం చేతుల్లోకి...  అమెజాన్ అడవుల్లో తప్పిపోయిన పసివారు..

కొలంబియా :  40 రోజుల క్రితం ఓ విమాన ప్రమాదంలో అమెజాన్ అడవుల్లో తప్పిపోయిన నలుగురు పిల్లలను సజీవంగా కనిపెట్టింది గాలింపు బృందం. వీరికోసం గత 40 రోజులుగా రెస్క్యూ బృందం తీవ్రంగా గాలిస్తుంది. వారిని కనుగొన్నప్పుడు పిల్లలు ఒంటరిగా ఉన్నారు. వారికి వెంటనే వైద్య సహాయం అందించారు. 

29

కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో క్యూబా నుండి బొగోటాకు తిరిగి వచ్చిన తర్వాత విలేకరులతో చెప్పారు, అక్కడ అతను నేషనల్ లిబరేషన్ ఆర్మీ రెబల్ గ్రూప్ ప్రతినిధులతో కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకం చేశాడు.

39

ఆయన మాట్లాడుతూ బాలలే రేపటి దేశ మనుగడకు ముఖ్యం.. అని అధ్యక్షుడు అన్నారు. వారి కథ "చరిత్రలో నిలిచిపోతుంది" అని అన్నారు. 40 రోజుల క్రితం ఏడుగురు ప్రయాణికులు, పైలట్‌తో కూడిన సెస్నా సింగిల్-ఇంజిన్ ప్రొపెల్లర్ విమానం ఇంజిన్ వైఫల్యం కారణంగా అత్యవసర పరిస్థితిలోకి పడిపోవడంతో... మే 1 తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.

49

తాము ప్రమాదంలో ఉన్నామని సమాచారం ఇచ్చిన కాసేపటికే ఈ చిన్న విమానం.. కొద్దిసేపటికే రాడార్ నుండి తప్పిపోయింది. ఆ తరువాత ప్రాణాలతో బయటపడిన వారి కోసం వెతుకడం ప్రారంభించారు. విమానంలోని ముగ్గురు చనిపోయారని కనిపెట్టారు. వారి మృతదేహాలు సమీప ప్రాంతంలో కనుగొన్నారు. విమానంలో ఆ సమయంలో ఉన్న 4 పిల్లల ఏమయ్యారో తెలియలేదు. 

59

ప్రమాదం జరిగిన రెండు వారాల తర్వాత, మే 16న, ఒక అన్వేషణ బృందం వర్షారణ్యంలోని దట్టమైన పాచ్‌లో విమానాన్ని కనిపెట్టింది. పెద్దల మృతదేహాలను స్వాధీనం చేసుకుంది, కానీ చిన్న పిల్లలు ఎక్కడా కనిపించలేదు. వారు సజీవంగా ఉండవచ్చని గ్రహించిన కొలంబియా సైన్యం పిల్లల కోసం వేటను వేగవంతం చేసింది.13, 9, 4, 11 నెలల వయస్సు గల నలుగురు తోబుట్టువులు వీరు. వీరినిట్రాక్ చేయడానికి కుక్కలతో 150 మంది సైనికులను ఆ ప్రాంతానికి పంపించింది. స్థానిక తెగల నుండి డజన్ల కొద్దీ వాలంటీర్లు కూడా వారిని వెతకడంతో సహాయం చేసారు.

69

శుక్రవారం, సైనికులు, వాలంటీర్ల బృందం థర్మల్ దుప్పట్లతో చుట్టబడిన పిల్లలతో పోజులిచ్చిన చిత్రాలను సైన్యం ట్వీట్ చేసింది. సైనికుల్లో ఒకడు చిన్న పిల్లవాడి నోట్లో పాల సీసా పెట్టి పట్టుకోవడం కనిపిస్తుంది.  "మా ప్రయత్నాలు దీన్ని సాధ్యం చేశాయి" అని కొలంబియా సైనిక కమాండ్ తన ట్విట్టర్ ఖాతాలో రాసింది.

79

ఇదిలా ఉండగా, మే 19న విమాన ప్రమాదం జరిగిన రెండు వారాల తరువాత దట్టమైన కొలంబియా అమెజాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో తప్పిపోయిన నలుగురు పిల్లలు సజీవంగా ఉన్నారని..దట్టమైన కొలంబియా అమెజాన్‌ అడవిలో 11 నెలల శిశువుతో సహా నలుగురు పిల్లలు సజీవంగా కనిపించారని అధ్యక్షుడు గుస్తావో పెట్రో తెలిపారు. ఇది సంతోషకరమైన విషయం అని ప్రకటించారు.

89

పెట్రో ఈ న్యూస్ ను ట్విట్టర్‌లో షేర్ చేశారు. మిలిటరీ "కష్టతరమైన శోధన ప్రయత్నాల" తర్వాత పిల్లలను కనుగొన్నారు. మే 1న విమానం కూలడంతో అందులో ఉన్న ముగ్గురు పెద్దవారు చనిపోయారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న నలుగురు మైనర్లు అప్పటినుంచి కనిపించకుండా పోయారు. వారిని వెతకడానికి అధికారులు స్నిఫర్ డాగ్‌లతో పాటు.. 100 మందికి పైగా సైనికులను మోహరించారు.

99

ఈ మైనర్లలో 11 నెలల వయస్సు ఉన్న చిన్నారితో సహా 13, 9, 4 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలు ఉన్నారు. ప్రమాదం జరిగినప్పటి నుండి దక్షిణ కాక్వెటా డిపార్ట్‌మెంట్‌లోని అడవిలో తిరుగుతున్నారని పోలీసులు అనుమానించారు. సాయుధ దళాలు, రెస్క్యూ టీంకు అడవిలో ఒకచోటు.. కర్రలు, కొమ్మలతో నిర్మించిన ఓ షెల్టర్ కనిపించింది. దీంతో చిన్నారులు బతికే ఉన్నారన్న ఆశలు చిగురించాయి. దీంతో వెతుకులాట మరింత తీవ్రతరం చేశారు. 

click me!

Recommended Stories