స్వీడన్‌లో యూరోపియన్ సెక్స్ చాంపియన్‌షిప్‌.. ఇందులో వాస్తవం ఎంత?

First Published Jun 4, 2023, 10:15 AM IST

స్వీడన్ దేశంలో శృంగారాన్ని క్రీడగా పరిగణించారని, ఒక చాంపియన్షిప్‌నే నిర్వహిస్తున్నామని చాలా వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి. కానీ, ఈ వార్త అవాస్తవమని తేలింది. సెక్స్ చాంపియన్షిప్ నిర్వహించాలనే ప్రపోజల్‌ను స్వీడన్ ఏప్రిల్‌లోనే తిరస్కరించినట్టు ఆ దేశ వార్తా సంస్థ స్పష్టం చేసింది.

Image: Getty

స్వీడన్‌ దేశంలో సెక్స్‌ను ఒక స్పోర్ట్‌గా పరిగణించారని ఓ వార్త చక్కర్లు కొట్టింది. తొలుత ట్విట్టర్‌లో ఈ శృంగార క్రీడకు సంబంధించిన వివరాలను పోస్టు చేశారు. ఆ వివరాల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా చాలా న్యూస్ పోర్టల్స్ వార్తను ప్రచురించాయి. కానీ, వాస్తవం కొంచెం మెల్లిగా వెలుగులోకి వస్తుందన్నట్టుగా ఈ వార్త ఫేక్ అని తాజాగా తెలియ వచ్చింది.

స్వీడన్ దేశం శృంగారాన్ని ఒక క్రీడగా గుర్తించిందని, ఈనెల 8 నుంచి యూరోపియన్‌ సెక్స్‌ చాంపియన్‌షిప్‌ నిర్వహించనున్నదని ఆ వార్త తెలిపింది. ఆరు వారాల పాటు ఈ చాంపియన్‌షిప్ కొనసాగనుందని, పోటీలో పాల్గొనే వ్యక్తులు సెక్స్ సెషన్‌లలో పాల్గొంటారని వివరించింది. ఇది రోజుకు ఆరు గంటల వరకు ఉంటుందని. ఇందులో పాల్గొనే జంటలు ఆరు వారాల వ్యవధిలో మ్యాచ్‌ల వ్యవధిని బట్టి రోజుకు 45 నిమిషాల నుంచి గంట పాటు శృంగార కార్యకలాపాల్లో పాల్గొనాల్సి ఉంటుందనీ ఆ వివరాలు పేర్కొన్నాయి.

ఆరువారాల తర్వాత సెక్స్ పోటీలో విజేతలను ప్రకటిస్తారని ఆ వార్త తెలిపింది. 

కానీ, ఈ వార్త అవాస్తవం అని తేలిపోయింది. స్వీడిష్ న్యూస్ ఔట్‌లెట్ గొటెర్‌బర్గ్ పోస్టెన్ ప్రకారం, స్వీడన్ దేశంలో ఫెడరేషన్ ఆఫ్ సెక్స్ ఉన్నది. దీని చీఫ్ డ్రగాన్ బ్రాక్టిక్ చాంపియన్షిప్ నిర్వహించాలని పిలుపు ఇచ్చాడు. మనుషులపై సెక్స్ మానసికంగా, శారీరకంగా వేసే ప్రభావాలను గుర్తించడానికి ఈ టోర్నమెంట్ నిర్వహించాలని పేర్కొన్నాడు.

ఈ చాంపియన్షిప్ నిర్వహించాలని బ్రాక్టిక్ ఈ ఏడాది జనవరి ఓ దరఖాస్తు పెట్టాడు. కానీ, ఈ దరఖాస్తును తిరస్కరించారు. స్పోర్ట్స్ ఫెడరేషన్ చీఫ్ జోర్న్ ఎరిక్సన్.. ఫెడరేషన్ ఆఫ్ సెక్స్ చీఫ్ డ్రగాన్ బ్రాక్టిక్ దరఖాస్తును తిరస్కరించినట్టు వెల్లడించారు.

సెక్స్ చాంపియన్షిప్ తిరస్కరించినట్టు ఎరిక్సన్ పేర్కొంటూ.. ఈ దరఖాస్తు తమ నిబంధనలకు లోబడి లేదని వివరించారు. ఈ దరఖాస్తును తిరస్కరిస్తున్నట్టు ఈ సందర్భంగా వెల్లడిస్తున్నానని ఆయన స్థానిక మీడియాకు చెప్పారు. తమకు వేరే పనులు చాలా ఉన్నాయనీ వివరించారు.

ఫెడరేషన్ ఆఫ్ సెక్స్ చీఫ్ డ్రగాన్ బ్రాక్టిక్ ఆ దేశంలో పలు స్ట్రిపక్ క్లబ్‌లను నడుపుతున్నాడు. సెక్స్‌ను స్పోర్ట్‌గా చూడాలనే ప్రయత్నాలను ఆయన చేస్తున్నాడు. 

click me!