Malala Yousafzahi: మలాలా జీవితంలో కొన్ని ముఖ్య ఘట్టాలు...

First Published Nov 10, 2021, 10:35 AM IST

మలాలా గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కొన్ని విషయాలు ఇవే... 

నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ ఒక ఇంటిదయ్యింది. భాగస్వామి అస్సర్ తో తన పెళ్లి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.

మలాలా గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కొన్ని విషయాలు ఇవే... 

మలాలా యూసఫ్‌జాయ్ జూలై 12, 1997న పాకిస్తాన్‌లోని పర్వతప్రాంతమైన స్వాత్ లోయలో జన్మించింది. education activist అయిన ఆమె తండ్రి జియావుద్దీన్ యూసఫ్‌జాయ్ అనేక బాలికల పాఠశాలలను నెలకొల్పాడు. అందులో మలాలా చదివింది. అక్టోబర్ 2007లో, తాలిబాన్ మిలిటెంట్లు లోయను స్వాధీనం చేసుకున్నారు. అనేక ఇతర ఆంక్షలతో పాటు బాలికలు విద్య మీద ఆంక్షలు విధించింది. వారికి విద్యను నిషేధిస్తూ అణచివేత పాలనను ప్రారంభించారు. 

దీంతో... మలాలా విస్తుపోయింది. అక్కడి పరిస్థితులను తానెదుర్కుంటున్న సంఘటనలను వివరిస్తూ బిబిసిలో ఆమె anonymous blog రాయడం ప్రారంభించింది. 15 ఏళ్ల వయసులో 2012లో, బాలికల విద్య, హక్కుల కోసం మాట్లాడినందుకు తాలిబాన్ ముష్కరుడు మలాలా తలపై కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ఘోరంగా గాయపడిన ఆమె UKలో చికిత్స పొందిన తర్వాత బయటపడింది, అక్కడ ఆమెకు ఆశ్రయం లభించింది.

బాలికల హక్కులు, విద్య మీద global advocate  అయిన.. మలాలా 2014లో నోబెల్ శాంతి బహుమతి విజేతగా నిలిచింది. ఈ బహుమతి అందుకున్న అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డ్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా పిల్లలకు విద్య అందించడం అవశ్యకత, ప్రాముఖ్యతను గురించి ఆమె తన ప్రసంగంలో ప్రస్తావించింది. ప్రతీ చిన్నారి పాఠశాలకు వెళ్లాలని అప్పటివరకు తన పోరాటాన్ని కొనసాగిస్తానని చెప్పుకొచ్చింది. ఆమె ప్రసంగాన్ని ఓస్లోలో జరిగిన వేడుకకు హాజరైన ప్రేక్షకుల విపరీతంగా ప్రశంసించారు. ఆమెకు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. 

బాలికల హక్కులు, విద్య మీద global advocate  అయిన.. మలాలా 2014లో నోబెల్ శాంతి బహుమతి విజేతగా నిలిచింది. ఈ బహుమతి అందుకున్న అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డ్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా పిల్లలకు విద్య అందించడం అవశ్యకత, ప్రాముఖ్యతను గురించి ఆమె తన ప్రసంగంలో ప్రస్తావించింది. ప్రతీ చిన్నారి పాఠశాలకు వెళ్లాలని అప్పటివరకు తన పోరాటాన్ని కొనసాగిస్తానని చెప్పుకొచ్చింది. ఆమె ప్రసంగాన్ని ఓస్లోలో జరిగిన వేడుకకు హాజరైన ప్రేక్షకుల విపరీతంగా ప్రశంసించారు. ఆమెకు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. 

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, భారతదేశానికి చెందిన కైలాష్ సత్యార్థితో కలిసి మలాలా శాంతి బహుమతిని అందుకున్నారు. తన నోబెల్ ప్రసంగంలో ఆమె ఇలా చెప్పింది, "మనం కలిసి నిలబడి, ఒక భారతీయుడు, పాకిస్తానీ శాంతితో ఐక్యంగా ఉండవచ్చని.. బాలల హక్కుల కోసం కలిసి పనిచేయగలమని ప్రపంచానికి చూపించడం నాకు చాలా సంతోషంగా ఉంది’’ అని ఉద్వేగానికి లోనయ్యింది. 

జూలై 12, 2013న ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో మలాలా లింగ సమానత్వం గురించి ఉద్వేగభరితమైన ప్రసంగం చేసింది. మలాలా తన శక్తివంతమైన ప్రసంగంలో, తీవ్రవాదులు విద్యకు భయపడుతున్నారని ఎత్తి చూపారు. మహిళలు తమ కోసం తాము పోరాడగలిగేలా స్వతంత్రంగా ఉండాలని ఉద్ఘాటించారు. ఆమె ప్రసంగానికి మరోసారి పెద్ద ఎత్తున ప్రశంసలు అందాయి, ఐక్యరాజ్యసమితి ఆమె పుట్టినరోజును 'మలాలా డే'గా ప్రకటించింది.

2016లో 'హి నేమ్డ్ మీ మలాలా' అనే డాక్యుమెంటరీ కోసం నటి ఎమ్మా వాట్సన్‌ను మలాలా కలిశారు. ఇద్దరు స్త్రీవాదం గురించి మాట్లాడారు. మలాలా వాట్సన్‌తో 'ఫెమినిస్ట్' అనే పదం గురించి మొదట్లో తనకు ఖచ్చితంగా తెలియదని చెప్పింది. స్త్రీ వాది అనేదానికి పాజిటివ్, నెగటివ్ రెండు అభిప్రాయాలనున్నాయని చెప్పుకొచ్చింది. కానీ feminism మీద వాట్సన్ వివరణ మలాలాకు విషయాలను స్పష్టం చేసింది.  సమానత్వం అనే పదం ఉన్నందున తాను స్త్రీవాది అని ఆమె గ్రహించిందని ఆమె అన్నారు.

ప్రస్తుతం 24 ఏళ్ల మలాలా.. బర్మింగ్‌హామ్‌లో కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వివాహం చేసుకుంది. ఆమె తన పెళ్లి వార్తను social media ద్వారా ప్రకటించింది. "ఈ రోజు నా జీవితంలో ఒక విలువైన రోజు. అస్సర్ నేను జీవిత భాగస్వాములు కావడానికి కొంగులు ముడివేసుకున్నాం. మేము మా కుటుంబాలతో బర్మింగ్‌హామ్‌లోని ఇంట్లో ఒక చిన్న nikkah ceremonyను జరుపుకున్నాం. దయచేసి మీ బ్లెస్సింగ్స్ మాకు ఇవ్వండి. జీవితాంతం కలిసి నడవాలన్న మా ప్రయాణాన్ని సంతోషింగా మొదలుపెడుతున్నాం" అని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. 

click me!