30 ఏళ్ల త‌ర్వాత కండోమ్‌ల‌పై ప‌న్ను విధించిన ప్ర‌భుత్వం.. కార‌ణం ఏంటంటే?

Published : Dec 03, 2025, 11:38 AM IST

Tax on condoms: తగ్గుతున్న జనాభా, కార్మికశక్తి చైనాకు పెద్ద సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జ‌నాభా పెంచే విధానాలు తీసుకుంటూ, కొన్ని విభాగాలపై పాత నియమాలను మార్చుతోంది. 30 ఏళ్ల తర్వాత మొదటిసారి కండోమ్‌ల‌పై వాట్ మినహాయింపు రద్దు చేసింది. 

PREV
15
పన్ను మినహాయింపు తొలగింపు

2024 డిసెంబర్‌లో అంగీకరించిన కొత్త VAT చట్టంలో వ్యవసాయం, వైద్య సేవలు, సాంస్కృతిక కార్యక్రమాలు వంటి రంగాలకు పన్ను మినహాయింపులు కొనసాగాయి. కానీ కండోమ్‌లు వంటి జనన నియంత్రణ ఉత్పత్తులను ఈ జాబితా నుండి తొల‌గించారు. ఇక నుంచి కండోమ్‌ల‌పై 13% VAT విధిస్తున్నారు. ఇది గత మూడు దశాబ్దాలుగా ఉన్న విధానానికి పూర్తి వ్యతిరేకం. ఈ పన్ను 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది.

25
పాత కుటుంబ నియంత్రణ విధానాల ప్రభావం

చైనా 1979 నుంచి 2015 వరకు కఠినమైన ఒక సంతానం విధానం అమలు చేసింది. దీంతో పుట్టిన శిశువుల సంఖ్య తగ్గినా, అనేక దీర్ఘకాలిక సమస్యలు తలెత్తాయి. ఈ కార‌ణంగా ప‌ని చేసే జ‌నాభా సంఖ్య క్ర‌మంగా త‌గ్గింది. వృద్ధుల సంఖ్య వేగంగా పెరిగింది. ఆడ పిల్లల కంటే మగ పిల్లలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల జెండర్ అసమతుల్యత ఏర్ప‌డింది. 2024లో చైనాలో జననాల రేటు 1000 మందికి 6.77గానే ఉంది. ప్రపంచ బ్యాంక్ అంచనా ప్ర‌కారం.. 2023లో ఫర్టిలిటీ రేటు 1గా ఉంది. ఇది జనాభా స్థిరంగా ఉండేందుకు అవసరమైన 2.1 “రీప్లేస్‌మెంట్ లెవల్” కంటే చాలా తక్కువ.

35
ఆర్థిక నేపథ్యం

చైనా 1980ల నుంచీ వేగంగా ఎదిగిన దేశంగా మారింది. దీనికి పెద్ద కారణం యువ కార్మికశక్తి, భారీ ఉత్పత్తి సామర్థ్యం, ఎగుమతుల ఆధారిత పరిశ్రమలు. కానీ ఇప్పుడు ప‌ని చేసే వారి సంఖ్య త‌గ్గుతోంది. వృద్ధ జనాభా పెరుగుతోంది. భవిష్యత్తులో వృద్ధుల భారం మోయటానికి మార్గాలు లేక‌పోవ‌డం. ఈ పరిస్థితుల్లో చైనా దీర్ఘకాల వృద్ధిని కొనసాగించడం కష్టమవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

45
కుటుంబాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు

ఒక వైపు కండోమ్‌ల‌పై పన్ను పెంచుతూ, మరో వైపు జననాలను ప్రోత్సహించే చర్యలు తీసుకుంటోంది చైనా ప్ర‌భుత్వం. ఇందులో భాగంగానే చిన్న పిల్లల సంరక్షణ కేంద్రాలు, వృద్ధాశ్రమాలు, వివాహ సేవలు వంటి రంగాల‌పై ప‌న్ను మిన‌హాయింపు అందిస్తోంది. ఈ మార్పులు కుటుంబాలు పెర‌గ‌డానికి ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది.

55
చైనా ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు

కండోమ్‌ల‌పై ప‌న్ను పెరుగుద‌ల‌పై ప‌లు విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి. కండోమ్‌ల‌పై ట్యాక్స్ పెరిగితే లైంగిక వ్యాధులు పెరిగే ప్రమాదం ఉందని, కండోమ్‌ల‌పై ప‌న్ను పెంచ‌డం వ‌ల్ల జ‌న‌న రేటు పెద్దగా పెరగదనే అభిప్రాయం ఉంది. యువా పాపులేష‌న్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (2024) రిపోర్ట్ ప్రకారం.. చైనాలో ఒక పిల్లవాడిని 18 ఏళ్ల వయస్సు వ‌ర‌కు పోష‌ఙంచ‌డానికి 538,000 యువాన్ (సుమారు ₹65 లక్షలు) ఖర్చ‌వుతుంది. ఇది ప్రపంచంలో పిల్లల పెంపకం అత్యంత ఖరీదైన దేశాల్లో ఒకటిగా చెబుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories