గ్రహాన్ని మింగుతున్న నక్షత్రం.. అంతరిక్షంలో అరుదైన ఘటన...

First Published May 4, 2023, 1:18 PM IST

సూర్యుడి పరిమాణంలో ఉన్న ఓ నక్షత్రం గ్రహాన్ని మింగేయడాన్ని ఖగోళ శాస్త్రజ్ఞులు కనిపెట్టారు. మొట్ట మొదటి సారిగా.. గ్రహాన్ని మింగుతుండగా చూశామని వారు చెబుతున్నారు. 

చనిపోతున్న నక్షత్రం ఓ గ్రహాన్ని తినే క్షణాలను శాస్త్రవేత్తలు మొట్ట మొదటిసారిగా గమనించారు. సూర్యుని పరిమాణంలో ఉన్న ఓ డివౌరర్ నక్షత్రం..  బృహస్పతి గ్రహం పరిమాణంలో ఉండే వాయువుతో నిండిన ఓ గ్రహాన్ని మింగేసింది. 

సూర్యుడు ఎర్రటి రాక్షస గోళంగా మారి లోపలి కక్షలోని నాలుగు గ్రహాలను కబళించినప్పుడు మన భూమికి ఏం జరుగుతుందనే తెలపడానికి ఇది ఒక ప్రివ్యూ లాంటిదని శాస్త్రవేత్తలు అంటున్నారు.  అందుకే ఈ సంఘటనకు చాలా ప్రాముఖ్యత ఉందని వారు చెబుతున్నారు.

February Planet Transit- Four planets will transit in February, good days will start for these 4 zodiac signs, chances of success in every work

నేచర్‌ అనే మ్యాగజైన్ లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం, ఖగోళ శాస్త్రవేత్తలు ఇంతకు ముందు ఇతర నక్షత్రాలను అటువంటి సంఘటనకు ముందు లేదా తరువాత గమనించారు. 

july 2022 planets changs

నేచర్‌ అనే మ్యాగజైన్ లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం, ఖగోళ శాస్త్రవేత్తలు ఇంతకు ముందు ఇతర నక్షత్రాలను అటువంటి సంఘటనకు ముందు లేదా తరువాత గమనించారు. 

"భవిష్యత్తులో సౌర వ్యవస్థలోని గ్రహాలు సూర్యునిలో మునిగిపోతాయనే వాస్తవం నేను హైస్కూల్‌లో మొట్ట మొదట చదివిన విషయం, కాబట్టి వాస్తవంలో ఇలాంటి సంఘటనను పట్టుకోవడం, దీనికి మొదటి ఉదాహరణను కనుగొన్నామని చెప్పడం ఉద్దేశం" అని ఎంఐటీలో పోస్ట్‌డాక్టోరల్ పరిశోధకుడు, అధ్యయన ప్రధాన రచయిత కిషలే డి చెప్పారు.

పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, నక్షత్రం చనిపోయే ప్రక్రియలో పెద్ద నక్షత్రం తన కాలపరిమితి దాటిపోవడంతో ఉబ్బిపోతుంది. ఆ నక్షత్రంలోని ఇంధనం అయిపోవడంతో దాని అసలు పరిమాణానికి మిలియన్ రెట్లు పెరుగుతుంది, అలా అది దాని చుట్టూ ఉన్న అన్ని గ్రహాలను చుట్టుముడుతుంది.

ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం..  మొదట ఇది తెల్లటి-వేడి ఫ్లాష్‌గా కనిపించి.. తర్వాత ఎక్కువసేపు చల్లని సిగ్నల్ గా మొదలవుతుంది.. అది నక్షత్రం గ్రహాన్ని చుట్టుముట్టడం వల్ల సంభవిస్తుందని వారు చెప్పారు. ఈ సంఘటన సుమారు 12,000 కాంతి సంవత్సరాల దూరంలో అక్విలా రాశిలో జరిగింది. కిషలే డి దీనిని 2020లో గమనించారు. వైట్-హాట్ ఫ్లాష్ అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి బృందానికి ఒక సంవత్సరం పట్టింది.

"మేము అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న ముఖ్యమైన సాక్ష్యాలలో ఒకటి ఏమిటంటే, విస్ఫోటనం ముందు, తరువాత నక్షత్రం దుమ్మును ఉత్పత్తి చేస్తుంది" అని మిస్టర్ డి చెప్పారు. "అయితే, వాయువు చల్లగా మారడానికి, ధూళి అణువులను ఘనీభవించడం ప్రారంభించడానికి సమయం పడుతుంది." సూర్యుని లాంటి ఈ నక్షత్రం వయసు సుమారు 10 బిలియన్ సంవత్సరాలు ఉంటుంది అని తెలిపారు.

click me!