షేక్ హసీనా ఇల్లు లూటీ... చివరకు చీరలు, జాకెట్లు కూడా వదిలిపెట్టలేదుగా.. ఏమేం ఎత్తుకెళ్లారో చూడండి

First Published | Aug 8, 2024, 9:32 AM IST

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా నివాసాన్ని ఆందోళనకారులు లూటీ చేసారు. ఇంట్లోకి చొరబడ్డ నిరసనకారులు కనిపించిన ప్రతి వస్తువును ఎత్తుకెళ్లారు. ఇలా ఏమేం ఎత్తుకెళ్లారో తెలుసా?

Sheik Hasina

షేక్ హసీనా నివాసం నుండి  ఏమేం ఎత్తుకెళ్లారో చూడండి :  

మాజీ ప్రధని షేక్ హసీనాపై కోపంతో రగిలిపోయిన ఆందోళనకారులు ఆమె  ఇంటిని దాడిచేసారు. ఇలా ఇంట్లోకి చొరబడ్డవారు ఎవరికి దొరికిన వస్తువు వారు ఎత్తుకెళ్లారు. ఇలా ఓ వ్యక్తి పరుపులు , దిండ్లు తీసుకెళ్లాడు.  

Sheik Hasina

హసీనా నివాసంలోని స్మిమ్మింగ్ పూల్ లో దిగి హంగామా చేసారు నిరసనకారులు. అలాగే ఇంటి ఆవరణలోని మరో నీటి కాలువలో కూడా నిరసనకారులు దిగారు. ఇలా వందలాదిమంది నీటిలో దిగిన  ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.


Sheik Hasina

కొందరు ఆందోళనకారులు హసీనా నివాసంలోని బెడ్రూంలోకి చొరబడ్డారు.  బెడ్ పై హాయిగా పడుకుని ఫోటోలకు ఫోజులిచ్చారు.  బెడ్రూంలోని వస్తువులను కూడా లూటీ చేసారు. 

Sheik Hasina

మాజీ ప్రధాని ఇంట్లోని ఏ వస్తువును వదిలిపెట్టలేదు ఆందోళనకారులు. చివరకు హసీనాతో పాటు ఆమె కుటుంబసభ్యుల దుస్తులు, చెప్పులు, షూస్ ఎత్తుకెళ్లారు. ఇలా చీర చిట్టుకుని మిగతా బట్టలను ఓ బకెట్ లో వేసుకుని వెళుతున్న ఓ వ్యక్తి  ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

Sheik Hasina

ఓ ఆందోళనకారుడు హసీనా నివాసంలోని టెలిఫోన్ ఎత్తుకెళ్ళాడు. ఇలా ఏది కనిపిస్తే దాన్ని తీసుకుని ఆ నివాసం నుండి బయటపడ్డారు. 

Sheik Hasina

మరీ దారుణం ఏమిటంటే  హసినాతో పాటు ఆమె కుటుంబంలోని మహిళల దుస్తులను కూడా ఎత్తుకెళ్లారు. వీటిని ప్రదర్శిస్తూ మరి లూటీ చేసారు.  ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. 

Sheik Hasina

షేక్ హసీనా నివాసంలోని కొన్ని జంతువులను కూడా ఆందోళనకారులు ఎత్తుకెళ్ళారు. ఇలా ఓ వ్యక్తి మేకను తీసుకెళ్ళాడు.    

Sheik Hasina

హసీనా కుటుంబం పెంచుకుంటున్న కుందేలును  కూడా ఓ యువకుడు తీసుకెళ్లాడు. దాన్ని పట్టుకుని ఫోటోకు పోజు ఇచ్చి మరీ తీసుకెళ్లాడు.

Sheik Hasina

అయితే హసీనా  నివాసం లూటీకి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియా తెెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి పెద్ద చేపను హసీనా నివాసం నుండి తీసుకెళుతూ కెమెరాకు చిక్కాడు.  

Sheik Hasina

ఓ ఆందోళనకారుడు హసీనా నివాసంలోని సీలింగ్ ఫ్యాన్ ను ఊడబీక్కుని తీసుకెళ్లాడు.  ఈ ఫ్యాన్ ఓ చేత్తో పైకెత్తి మరీ ప్రదర్శించాడు.

Sheik Hasina

షేక్ హసీనా నివాసంలోంచి ఓ బాతును ఎత్తుకెళ్ళాడు ఓ యువకుడు. ఇలా అదీ ఇదని కాదు ఏది కనిపిస్తే దాన్ని ఎత్తుకెళ్లారు ఆందోళనకారులు... 

Latest Videos

click me!