నోబెల్ అవార్డు గ్రహీతకు బంగ్లాదేశ్ పాలనాపగ్గాలు...ఎవరీ మహ్మద్ యూనస్?

First Published | Aug 7, 2024, 4:13 PM IST

బంగ్లాదేశ్ పాలనా పగ్గాలు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహ్మద్ యూనుస్ కు దక్కనున్నాయి. ఇంతకీ ఎవరీ యూనస్..? ఆయనకే ఎందుకు మద్యంతర ప్రభుత్వ బాధ్యతలు అప్పగించారంటే... 

Muhammad Yunus

Mohammed Yusuf : బంగ్లాదేశ్ ఆందోళనలతో అట్టుడుకుతోంది. ఇప్పటికే ప్రధాని షేక్ హసినా రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోయారు. దీంతో ఆ దేశ అధ్యక్షులు మహ్మద్ షహబుద్దిన్ ప్రభుత్వాన్ని రద్దు చేయడంతో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఇలా దేశంలో అలజడి, రాజకీయ సంక్షోభంతో పరిస్థితి మరింత చేయిదాటిపోకుండా అధ్యక్షుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ పార్టీలు, సైనికాధికారులు, ఆందోళనకారులతో చర్చలు జరిపి అందరి సమ్మతితో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసారు. నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మహ్మద్ యూనస్ కు పాలనా బాధ్యతలు అప్పగించారు.

Muhammad Yunus

ఎవరి మహ్మద్ యూనస్ : 

బంగ్లాదేశ్ కు చెందిన మంచి ఆర్థికవేత్త, సమాజ సేవకుడు. మంచి విద్యావంతుడు, సమాజం కోసం ఆరాటపడే ఈయనను ఆ దేశ ప్రజలు చాలా గౌరవిస్తారు. ఇక నోబెల్ శాంతి బహుమతి తర్వాత యూనస్ పేరు ప్రపంచం మొత్తానికి పరిచయం అయ్యింది. 
 


Muhammad Yunus

బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ జూన్ 28, 1994 లో యూనస్ జన్మించారు. సాధారణ కుటుంబంలో పుట్టిన ఆయన చదువులో బాగా చురుకు. అతడి ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు బాగా చదివించారు. ఇలా ప్రాథమిక,ఉన్నత విద్యాబ్యాసమంతా స్వదేశంలో సాగించారు.ఢాకా యూనివర్సిటీలో విద్యాభ్యాసం ముగిసిన తర్వాత ఆయన అమెరికాకు పయనం అయ్యారు. 
 

Muhammad Yunus

యూఎస్ లోని వండర్బిల్ట్ యూనివర్సిటీ నుండి 1969 లో ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డీ పూర్తిచేశారు. అనంతరం అక్కడే మిడిల్ టెన్నెసీ స్టేట్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరారు. ఇలా కొంతకాలం అమెరికాలో వున్న ఆయన తన దేశానికి సేవ చేసేందుకు తిరిగి బంగ్లాదేశ్ కు చేరుకున్నారు. 
 

Muhammad Yunus

అయితే బంగ్లాదేశ్ పరిస్థితి మారాలంటే ముందుగా పేదరికాన్ని తరిమికొట్టాలి. కాబట్టి ముందుగా పేద ప్రజలు స్వయంఉపాధి పొందేలా సూక్ష్మరుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసమే ఆయన 1983లో గ్రామీణ బ్యాంకును ఏర్పాటుచేసారు. ఈ బ్యాంకు ద్వారా పేద ప్రజలకు చిన్నమొత్తంలో రుణాలిచ్చి వారు ఆర్థికంగా మెరుగుపడేందుకు సహకరించారు. 
 

Muhammad Yunus

స్వయంగా ఆర్థిక వేత్త కావడంతో యూనస్ ఎలాంటి పొరపాట్లు లేకుండా గ్రామీణ బ్యాంకును సక్సెస్ ఫుల్ గా నడిపారు. బంగ్లాదేశ్ లోని కోట్లాదిమందికి రుణాలు అందించి వారి జీవితాలను మెరుగుపర్చారు. దీంతో ఆయనను జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు. పేద ప్రజల జీవన ప్రమాణాలు మార్చేందుకు ఆయన చేసిన కృషిని గుర్తించి 2006 లో నోబెల్ శాంతి బహుమతిని  బహూకరించారు. దీంతో యూనస్ పేరు అంతర్జాతీయ స్థాయిలో మారుమోగింది.
 

మహ్మద్ యూనస్ అవార్డులు : 

ఆర్థిక రంగాన్ని సామాజిక సేవతో జోడించి పేదల బ్రతులకు మార్చేందుకు యూనస్ చేసిన ప్రయత్నాలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. దీంతో ఆయన నోబెల్ బహుమతితో పాటు అనేక అంతర్జాతీయ అవార్డులు పొందారు. శ్రీలంక నుండి 1993లో మహ్మద్ షాబ్దీన్ అవార్డు,  యుూఎస్ఐ నుండి 1993లో హ్యుమానిటేరియన్ అవార్డ్, 1994 లో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ పొందారు. ఇక సొంత దేశం బంగ్లాదేశ్ లో అత్యున్నత పురస్కారం  ఇండిపెడెన్స్ డే అవార్డ్ ను 1987 లో పొందారు.  కింగ్ హుసెన్ హ్యుమానిటేరియన్ లీడర్ షిప్ అవార్డును 2000 లో జోర్డాన్ నుండి పొందారు. వోల్వో ఎన్విరాన్ మెంట్ అవార్డును 2003 లో స్వీడన్, నిక్కి ఆసియన్ ప్రైజ్ ఫర్ రీజనల్ గ్రోత్ పురస్కరాన్ని జపాన్ నుండి2004 లో పొందారు. నెదర్లాండ్ నుండి ఫ్రాంక్లిన్ డి రూజ్ వెల్ట్ ఫ్రీడమ్ అవార్డును 2006, సియోల్ ఫీస్ ప్రైజ్ ను ఇదే సంవత్సరం కొరియా నుండి పొందారు యూనస్. 
 

Muhammad Yunus

రాజకీయ పార్టీ :

బంగ్లాదేశ్ పరిస్థితిని పూర్తిగా మార్చాలంటే తన ఒక్కడివల్ల కాదు... అందుకు ఓ వ్యవస్థ అవసరమని భావించారు మహ్మద్ యూనస్. దీంతో ఆయన 2007 లో ఓ పార్టీని స్థాపించి రాజకీయ రంగప్రవేశం చేసారు.  'నాగరిక్ శక్తి' ఆయన స్థాపించిన రాజకీయ పార్టీ.  అయితే రాజకీయంగా ఆయన అనకున్న స్థాయిలో రాణించలేకపోయారు. దీంతో కొంత కాలానికే రాజకీయాలకు దూరమయ్యారు.  

Muhammad Yunus

అయితే ఈ ఏడాది జనవరిలో యూనస్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. ఆయన నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డాడనే అభియోగాలతో బంగ్లాదేశ్ కోర్టు ఆరునెలల జైలుశిక్ష విధించింది. అయితే ఇది ఆయనపై ప్రత్యర్థులు చేసిన కుట్రలో భాగమేనని యూనస్ అనుకూల వర్గం వాదన.

Muhammad Yunus

ఏదేమైనా బంగ్లాదేశ్ ఆపత్కాలంలో వుండగా మహ్మద్ యూనస్ పాలనా పగ్గాలు చేపడుతున్నారు. ఆయన దేశంలో పరిస్థితిని మార్చగలడని నమ్ముతున్నారు.బంగ్లా ఆర్మీతో పాటు రాజకీయ పక్షాలు, ప్రజలు యూనస్ నేతృత్వంలని మధ్యంతర ప్రభుత్వానికి సహకరిస్తే బంగ్లాదేశ్ లో పరిస్థితి మెరుగుపడుతుంది. 

Latest Videos

click me!