అయితే, జెర్రీ, ముర్డోచ్ విడాకులు గతేడాది జూన్లో జరిగాయి. ఆ సమయంలో ఏం జరిగిందనేది తాజాగా జెర్రీ స్నేహితులు చెప్పుకొచ్చారు. ముర్డోచ్ పంపిన విడాకుల సందేశం చూసి జెర్రీ కోలుకోలేకపోయిందని.. ఆమె మైండ్ బ్లాంక్ అయిందని తెలిపారు. ఆ మెసేజ్ చూసిన తర్వాత ఆమెకు ఏం చేయాలో తెలియలేదు. కాలిఫోర్నియాలోని తన మాన్షన్ హౌస్ లో ఉన్న జెర్రీని 30 రోజుల్లో అక్కడి నుంచి వెళ్లిపోవాలని విడాకుల విషయం చెప్పిన తర్వాత ముర్డోచ్ గడువు ఇచ్చాడు. దీంతో జెర్రీ పరిస్థితి దారుణంగా తయారయిందని ఆమె స్నేహితులు వాపోయారు.