కారు ఫ్యాన్సీ నెంబర్ కోసం రూ.122.5 కోట్లు.. రికార్డ్ బ్రేక్...

First Published Apr 11, 2023, 7:42 AM IST

ఓ కారు నెంబర్ కోసం రూ. 122 కోట్లు చెల్లించాడో వ్యక్తి. ఆశ్చర్యంగా ఉన్న ఈ ఘటన దుబాయ్ లో వెలుగు చూసింది. ఇప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 

దుబాయ్ : కోట్ల రూపాయల విలువైన లగ్జరీ కార్లు ఉండడం విని ఉంటారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నులైన వారి దగ్గర ఇలాంటి కార్లు ఉంటాయని ఆశ్చర్యంగా చెప్పుకుంటుంటారు.  అయితే కారు కాదు గానీ..  కేవలం కారు నెంబర్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ఎప్పుడైనా విన్నారా? ఫ్యాన్సీ నెంబర్ కావాలనుకుంటే వేలు, లక్షలు  ఖర్చుచేయడం..ఇప్పటివరకు మనకు తెలుసు. కానీ, ఓ వ్యక్తి  ఫాన్సీ నెంబర్ కోసం రూ.122కోట్లు  పెట్టాడు. వింటుంటేనే కళ్ళు తిరిగి పోతున్నాయి కదా. ఈ ఘటన దుబాయిలో జరిగింది.

‘మోస్ట్ నోబుల్ మెంబర్స్‘ అని దుబాయిలో వేలం జరిగింది. దీంట్లో ఓ కారు నెంబరుకు ఇంత పెద్ద మొత్తంలో భారీ ధర పలికింది. ‘పీ7’ అనే కారు నెంబరు ఏకంగా రూ.122కోట్లకు అమ్ముడైంది. వారి కరెన్సీలో దీని విలువ 55 మిలియన్ దీర్హామ్ లు. 

pavel durov

ఇంత పెద్ద మొత్తం పెట్టి ఈ నెంబర్ను టెలిగ్రామ్ యాప్ వ్యవస్థాపకుడు, ఫ్రెంచ్-ఎమిరాటీ వ్యాపారవేత్త పావెల్ వాలెరివిచ్ దురోవ్..సొంతం చేసుకున్నారు.

‘పీ7’ నెంబరు కోసం మొదట 15 మిలియన్ దీర్హామ్ ల  దగ్గర  మొదలయ్యింది. ఆ తర్వాత మెల్లిగా సాగుతూ 25 మిలియన్ దీర్హామ్ కు చేరుకుంది. కాసేపు అక్కడి నుంచి ముందుకు కదలలేదు. కొద్దిసేపటికి 30 మిలియన్ దీర్హామ్ లకు అక్కడి నుంచి ఒక్కసారిగా 55 మిలియన్ దీర్హామ్ లకు బాకింది. 

ఇక ‘పీ7’ నెంబరుతో పాటు ఇంకా మిగతా ఫ్యాన్సీ నెంబర్లు,  మొబైల్ ఫ్యాన్సీ నెంబర్లకు కూడా అదే సమయంలో వేలం వేశారు. ఈ వేలంలో అన్ని నెంబర్లకు కలిసి మొత్తం రూ.223  కోట్లు వచ్చినట్లుగా అధికారులు వెల్లడించారు. అంతకు ముందు ఒకసారి కూడా ఇలాగే ఒక నెంబర్ కోసం ఇంత మొత్తాన్ని చెల్లించాడో వ్యాపారవేత్త.  2008లో ‘ నెంబర్ వన్’ కోసం అబుదాబిలో ఓ వ్యాపారవేత్త  52.2 మిలియన్ దీర్హామ్ లు పెట్టి కొనుగోలు చేశాడు.

వందల కోట్లలో వచ్చిన ఈ ఆదాయం మొత్తాన్ని వన్ బిలియన్ మీల్స్ కార్యక్రమానికి ఇస్తామని అధికారులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఆకలితో అలమటించే నిరుపేదల కోసం ఈ వన్ బిలియన్ మీల్స్ పనిచేస్తుందని వారు తెలిపారు. దుబాయ్ పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ వన్ బిలియన్ మీల్స్ ఎండోమెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

వీఐపీ నంబర్ల వేలం 'మోస్ట్ నోబుల్ నంబర్స్' వేలంలో ఇంత ఖరీదుకు పోయిన P7 రిజిస్ట్రేషన్ ప్లేట్ గతంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ప్రవేశించిన అత్యంత ఖరీదైన రూ. 132 కోట్ల విలువైన నంబర్ ప్లేట్‌ రికార్డును బద్దలు కొట్టింది, దీనిని బుగాట్టి యజమానిని "F 1’’ ప్లేట్ కోసం కొనుగోలు చేశారు.

click me!